< Amahubo 72 >
1 Nkulunkulu, nika inkosi izahlulelo zakho lokulunga kwakho endodaneni yenkosi.
౧సొలొమోను కీర్తన దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.
2 Izakwehlulela abantu bakho ngokulunga, labayanga bakho ngokuqonda.
౨అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.
3 Izintaba zizalethela abantu ukuthula, lamaqaqa, ngokulunga.
౩నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.
4 Izakwahlulela abahluphekayo babantu, isindise abantwana babaswelayo, ifohloze umcindezeli.
౪ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.
5 Bazakwesaba wena lisekhona ilanga, isekhona lenyanga, kuzizukulwana ngezizukulwana.
౫సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక.
6 Izakwehla njengezulu etshanini obugundiweyo, njengezihlambo ezithambisa umhlaba.
౬కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.
7 Ensukwini zayo olungileyo uzahluma; lokwanda kokuthula, ize ingabi khona inyanga.
౭అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక.
8 Izabusa-ke kusukela elwandle kusiya elwandle, lakusukela emfuleni kusiya emikhawulweni yomhlaba.
౮సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక.
9 Abahlala enkangala bazakhothama phambi kwayo; izitha zayo zizakhotha uthuli.
౯ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.
10 Amakhosi eTarshishi lawezihlengeni azaletha izipho, amakhosi eShebha leSeba asondeze izipho.
౧౦తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.
11 Amakhosi wonke azayikhothamela, izizwe zonke ziyikhonze.
౧౧రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక.
12 Ngoba izamkhulula oswelayo ekhala, longumyanga, longelamsizi.
౧౨ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.
13 Izahawukela ongumyanga loswelayo, isindise imiphefumulo yabaswelayo.
౧౩నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.
14 Izahlenga umphefumulo wabo ecindezelweni ledlakeleni; legazi labo lizakuba ligugu emehlweni ayo.
౧౪బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.
15 Izaphila, inikwe okwegolide leShebha, ikhulekelwe njalonjalo, usuku lonke ibusiswe.
౧౫రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.
16 Kuzakuba khona inala yamabele elizweni ezingqongeni zezintaba; izithelo zawo zihatshazele njengeLebhanoni; labomuzi bazahluma njengotshani bomhlaba.
౧౬దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.
17 Ibizo layo lizakuba khona kuze kube phakade, lebizo layo lizakwanda lisekhona ilanga. Njalo bazabusiswa kuyo; izizwe zonke zizakuthi ibusisiwe.
౧౭రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.
18 Kayibongwe iNkosi uNkulunkulu, uNkulunkulu kaIsrayeli, onguye yedwa owenza imimangaliso.
౧౮ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతులు పొందుతాడు గాక. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.
19 Kalibusiswe ibizo lakhe elilodumo kuze kube nininini; umhlaba wonke ugcwaliswe ngodumo lwakhe. Ameni, loAmeni!
౧౯ఆయన మహిమగల నామం నిరంతరం స్తుతులు పొందుతుంది గాక. ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్.
20 Imikhuleko kaDavida indodana kaJese isiphelile.
౨౦యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.