< ULukha 22 >
1 Kwasekusondela umkhosi wesinkwa esingelamvubelo, othiwa liphasika.
౧పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
2 Abapristi abakhulu lababhali basebedinga ukuthi bangambulala njani; ngoba babesesaba abantu.
౨ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.
3 USathane wasengena kuJudasi othiwa nguIskariyothi, owayengowenani labalitshumi lambili.
౩అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
4 Wasesuka wayakhuluma labapristi abakhulu lezinduna ngokuthi angamnikela njani kubo.
౪దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.
5 Basebethokoza, basebevumelana ukumnika imali.
౫దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
6 Wasevuma, njalo wadinga ithuba elihle lokumnikela kubo lingekho ixuku.
౬అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
7 Lwaselufika usuku lwesinkwa esingelamvubelo, okwakumele kuhlatshwe ngalo iphasika.
౭పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.
8 Wasethuma uPetro loJohane, esithi: Hambani liyesilungisela iphasika, ukuze sidle.
౮యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.
9 Basebesithi kuye: Uthanda ukuthi silungise ngaphi?
౯వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు.
10 Wasesithi kubo: Khangelani, kuzakuthi selingenile emzini, umuntu uzahlangana lani ethwele imbiza yamanzi; limlandele endlini azangena kuyo.
౧౦ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.
11 Beselisithi kumninindlu: Uthi uMfundisi kuwe: Ingaphi indlu yezihambi, lapho engingadlela khona iphasika labafundi bami?
౧౧మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.
12 Yena-ke uzalitshengisa indlu enkulu ephezulu eyendlelweyo; lilungise khona.
౧౨అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు.
13 Bahamba-ke bafica njengokutsho kwakhe kubo; basebelungisa iphasika.
౧౩సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు.
14 Kwathi selifikile ihola, wahlala phansi, labaphostoli abalitshumi lambili belaye.
౧౪సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.
15 Wasesithi kubo: Ngokunxwanela nginxwanele ukudla lani leliphasika ngingakahlupheki;
౧౫అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను.
16 ngoba ngithi kini: Kangisoze ngidle futhi kulo, lize ligcwaliseke embusweni kaNkulunkulu.
౧౬ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”
17 Wasethatha inkezo, esebongile wathi: Thathani lokhu, beselisabelana;
౧౭తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి.
18 ngoba ngithi kini: Kangisoze nginathe okwesithelo sevini, kuze kufike umbuso kaNkulunkulu.
౧౮ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
19 Wasethatha isinkwa, esebongile wasihlephuna, wabanika, esithi: Lokhu kungumzimba wami, owanikelelwa lina; lokhu kwenzeni ukungikhumbula.
౧౯ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.
20 Ngokunjalo lenkezo emva kokudla, esithi: Inkezo le iyisivumelwano esitsha egazini lami, elichithelwa lina.
౨౦అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
21 Kodwa khangelani, isandla songinikelayo silami etafuleni.
౨౧“వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు.
22 Ngoba isibili iNdodana yomuntu ihamba njengokumisiweyo; kodwa maye kulowomuntu enikelwa nguye!
౨౨దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు,
23 Bona basebeqala ukubuzana ukuthi kambe ngubani kubo ozakwenza lokho.
౨౩ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.
24 Kwavela lokuphikisana phakathi kwabo okokuthi nguwuphi kubo ongathiwa ngomkhulu.
౨౪తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
25 Wasesithi kubo: Amakhosi abezizwe azibusa ngobulukhuni, leziphathamandla zazo zithiwa ngabasizi.
౨౫అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు.
26 Kodwa lina kakungabi njalo; kodwa omkhulu phakathi kwenu kabe njengomncinyane, longumkhokheli njengosebenzayo.
౨౬మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.
27 Ngoba nguwuphi omkhulu, lowo ohleziyo ekudleni kumbe lowo osebenzayo? Kayisilowo yini ohlezi ekudleni? Kodwa mina ngiphakathi kwenu njengaye osebenzayo.
౨౭అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
28 Lina-ke liyibo ababehlezi lami ezilingweni zami;
౨౮“నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు.
29 njalo mina ngilimisele umbuso, njengoba uBaba engimisele,
౨౯నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి,
30 ukuthi lidle linathe etafuleni lami embusweni wami, lihlale ezihlalweni zobukhosi, lisehlulela izizwe ezilitshumi lambili zakoIsrayeli.
౩౦సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.
31 INkosi yasisithi: Simoni, Simoni, khangela, uSathane ulifunisisile, ukuze alihlungule njengamabele;
౩౧“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.
32 kodwa mina ngikukhulekele, ukuze ukholo lwakho lungapheli; wena-ke nxa usuphendukile uqinise abazalwane bakho.
౩౨నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”
33 Kodwa wathi kuye: Nkosi, lentolongweni lekufeni ngilungele ukuya khona lawe.
౩౩కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.
34 Kodwa yena wathi: Ngiyakutshela, Petro, iqhude kaliyikukhala lamuhla, ungakaphiki kathathu ukuthi uyangazi.
౩౪అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.
35 Wasesithi kubo: Mhla ngilithuma lingelamxhaka lesikhwama lamanyathela, laswela yini ulutho? Basebesithi: Kasiswelanga lutho.
౩౫ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.
36 Wasesithi kubo: Kodwa khathesi lowo olomxhaka kawuthathe, ngokunjalo lesikhwama; lalowo ongelakho, athengise isembatho sakhe, athenge inkemba.
౩౬ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
37 Ngoba ngithi kini, kusamele kugcwaliseke kimi lokhu okulotshiweyo, ukuthi: Wabalwa kanye lezoni; ngoba lalezizinto eziqondane lami zilesiphetho.
౩౭‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
38 Basebesithi: Nkosi, khangela, nanzi inkemba ezimbili. Wasesithi kubo: Kwanele.
౩౮శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.
39 Wasephuma waya entabeni yeMihlwathi njengokwejwayela; labafundi bakhe bamlandela.
౩౯భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
40 Esefikile kuleyondawo, wathi kubo: Khulekani ukuthi lingangeni ekulingweni.
౪౦వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
41 Yena wasemonyuka kubo okungaba libanga lokuphosa ilitshe, waguqa phansi ngamadolo wakhuleka,
౪౧వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.
42 esithi: Baba, uba uthanda, susa linkezo kimi; kodwa-ke kungenziwa intando yami, kodwa eyakho.
౪౨“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”
43 Kwabonakala kuye ingilosi evela ezulwini imqinisa.
౪౩అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.
44 Esesesizini olunzima, wakhuleka kakhulu. Njalo izithukuthuku zakhe zaba njengamathonsi egazi zawela emhlabathini.
౪౪ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.
45 Esesukumile emkhulekweni, weza kubafundi bakhe, wabafica belele ngenxa yokudabuka,
౪౫ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.
46 wasesithi kubo: Lilaleleni? Vukani likhuleke, ukuze lingangeni ekulingweni.
౪౬వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.
47 Kwathi esakhuluma, khangela, ixuku, lalowo okuthiwa nguJudasi, omunye wabalitshumi lambili, ehamba phambi kwabo, wasesondela kuJesu ukumanga.
౪౭ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
48 Kodwa uJesu wathi kuye: Judasi, uyayinikela yini iNdodana yomuntu ngokuyanga?
౪౮అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
49 Kwathi labo ababengakuye sebebona okuzakwenzeka bathi kuye: Nkosi, sigadle yini ngenkemba?
౪౯ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు.
50 Omunye wabo wasegadla inceku yompristi omkhulu, waquma indlebe yayo yokunene.
౫౦ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
51 Kodwa uJesu waphendula wathi: Yekelani kuze kube yilokhu. Wasethinta indlebe yayo, wayisilisa.
౫౧దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
52 UJesu wasesithi kubapristi abakhulu lezinduna zethempeli labadala ababeze kuye: Liphume njengokuyamelana lomphangi yini lilezinkemba lezinduku?
౫౨తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
53 Nxa bengilani insuku ngensuku ethempelini, kalelulanga izandla ukumelana lami; kodwa leli lihola lenu, lamandla obumnyama.
౫౩నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.
54 Sebembambile bamqhuba, bamusa endlini yompristi omkhulu. UPetro waselandela ekhatshana.
౫౪వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.
55 Sebebasile umlilo phakathi kweguma, sebehlezi phansi ndawonye, uPetro wahlala phakathi kwabo.
౫౫అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.
56 Kodwa incekukazi ethile imbona ehlezi emlilweni, yamjolozela, yathi: Lumuntu laye ube laye.
౫౬అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది.
57 Kodwa wamphika, wathi: Mama, kangimazi.
౫౭దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు.
58 Emva kwesikhatshana omunye wasembona wathi: Lawe ungomunye wabo. Kodwa uPetro wathi: Ndoda, kangisuye.
౫౮కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.
59 Sekungaba kwedlule ihola elilodwa, omunye waqinisa, esithi: Isibili laye ube laye; ngoba futhi ungumGalili.
౫౯మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు.
60 Kodwa uPetro wathi: Ndoda, kangazi ukuthi uthini. Njalo khonokho esakhuluma lakhala iqhude.
౬౦అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
61 INkosi yasiphenduka yamkhangela uPetro. UPetro waselikhumbula ilizwi leNkosi, ukuthi yakhuluma njani kuye isithi: Iqhude lingakakhali, uzangiphika kathathu.
౬౧అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.
62 UPetro wasephuma phandle wakhala kabuhlungu.
౬౨దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
63 Lamadoda ayembambile uJesu amklolodela, amtshaya.
౬౩యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.
64 Amembesa, amtshaya ubuso, asembuza, esithi: Profetha! Ngubani okutshayileyo?
౬౪ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.
65 Akhuluma lezinye izinto ezinengi kuye ehlambaza.
౬౫ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.
66 Kwathi sekusile, abadala babantu babuthana, labapristi abakhulu lababhali, basebemusa emphakathini wabo, bathi:
౬౬ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.
67 Uba unguKristu, sitshele. Wasesithi kubo: Uba ngilitshela, kalisoze likholwe;
౬౭“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.
68 njalo uba lami ngilibuza, kalisoze lingiphendule, loba lingikhulule.
౬౮అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.
69 Kusukela khathesi iNdodana yomuntu izahlala ngakwesokunene samandla kaNkulunkulu.
౬౯అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు.
70 Basebesithi bonke: Kanti uyiNdodana kaNkulunkulu? Wasesithi kubo: Kutsho lina ukuthi ngiyiyo.
౭౦“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు.
71 Basebesithi: Pho sisafunelani ubufakazi? Ngoba sesizizwele uqobo lwethu emlonyeni wakhe.
౭౧అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.