< UJobe 1 >
1 Kwakukhona indoda elizweni leUzi, ibizo layo lalinguJobe. Leyondoda yayiphelele-ke, iqondile, imesaba uNkulunkulu, ixwaya okubi.
౧ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవునిపట్ల భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు.
2 Yasizalelwa amadodana ayisikhombisa lamadodakazi amathathu.
౨అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.
3 Lemfuyo yayo yayiyizimvu eziyizinkulungwane eziyisikhombisa, lamakamela ayizinkulungwane ezintathu, lezipane zenkabi ezingamakhulu amahlanu, labobabhemi abasikazi abangamakhulu amahlanu, lenceku ezinengi kakhulu. Ngakho lowomuntu wayemkhulu okwedlula bonke abantu bempumalanga.
౩అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
4 Njalo amadodana akhe ahamba enza idili endlini yaleyo laleyo ngosuku lwayo; athuma abiza odadewabo abathathu ukuze badle banathe lawo.
౪అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్ళలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు.
5 Kwakusithi lapho esephelile amazopha ensuku zedili, uJobe athume, awangcwelise, avuke ekuseni kakhulu, anikele iminikelo yokutshiswa ngokwenani lawo wonke, ngoba uJobe wathi: Mhlawumbe amadodana ami onile, amthuka uNkulunkulu enhliziyweni yawo. Wenza njalo uJobe zonke izinsuku.
౫వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు.
6 Kwasekusiba losuku lapho amadodana kaNkulunkulu eza ukuzimisa phambi kweNkosi, loSathane laye wafika phakathi kwawo.
౬ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు.
7 INkosi yasisithi kuSathane: Uvela ngaphi? USathane wasephendula iNkosi wathi: Ekuzulazuleni emhlabeni lekuhambahambeni kuwo.
౭యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు.
8 INkosi yasisithi kuSathane: Ubekile yini inhliziyo yakho encekwini yami uJobe, ngoba kakho onjengayo emhlabeni, umuntu opheleleyo loqondileyo, owesaba uNkulunkulu loxwaya ububi?
౮అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.
9 USathane wasephendula iNkosi wathi: UJobe umesabela ize uNkulunkulu yini?
౯అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా?
10 Kawumbiyelanga yini yena lendlu yakhe lakho konke alakho inhlangothi zonke? Ubusisile umsebenzi wezandla zakhe, lezifuyo zakhe zanda kakhulu elizweni.
౧౦నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది.
11 Kodwa isibili yelula isandla sakho khathesi, uthinte konke alakho; sibili uzakuthuka ebusweni bakho.
౧౧అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు.
12 INkosi yasisithi kuSathane: Khangela konke alakho kusesandleni sakho; kuphela kuye ungeluleli isandla sakho. Wasephuma uSathane phambi kweNkosi.
౧౨అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.
13 Kwasekusiba losuku lapho amadodana lamadodakazi akhe ayesidla enatha iwayini endlini yomfowabo olizibulo.
౧౩ఒక రోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు.
14 Kwasekufika isithunywa kuJobe sathi: Inkabi bezilima labobabhemi besidla emaceleni azo;
౧౪అతడు వాళ్ళతో “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు.
15 kwasekutheleka amaShebha, akuthatha, atshaya izinceku ngobukhali benkemba, njalo yimi ngedwa kuphela engiphephileyo ukuze ngikubikele.
౧౫పనివాళ్ళను కత్తులతో చంపివేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను” అని చెప్పాడు.
16 Lesi sisakhuluma, kwafika lesinye, sathi: Umlilo kaNkulunkulu uwile uvela emazulwini, watshisa izimvu lezinceku, waziqeda; njalo yimi ngedwa kuphela engiphephileyo ukuze ngikubikele.
౧౬ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. “దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
17 Lesi sisakhuluma, kwafika lesinye, sathi: AmaKhaladiya amise amaxuku amathathu atheleka phezu kwamakamela, awathatha, atshaya izinceku ngobukhali benkemba, njalo yimi ngedwa kuphela engiphephileyo ukuze ngikubikele.
౧౭అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
18 Lesi sisakhuluma, kwafika lesinye, sathi: Amadodana akho lamadodakazi akho bebesidla benatha iwayini endlini yomfowabo, izibulo.
౧౮అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు.
19 Khangela-ke, umoya omkhulu wafika uvela ngaphetsheya kwenkangala, watshaya amagumbi womane endlu, yawela phezu kwamajaha, afa; njalo yimi ngedwa kuphela engiphephileyo ukuze ngikubikele.
౧౯అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
20 UJobe wasesukuma, wadabula ibhatshi lakhe, waphuca ikhanda lakhe, wawa emhlabathini, wakhonza;
౨౦అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు.
21 wasesithi: Ngaphuma ngize esiswini sikamama, njalo ngizabuyela khona ngize; iNkosi yapha, iNkosi ithethe; kalibusiswe ibizo leNkosi.
౨౧“నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”
22 Kukho konke lokhu uJobe konanga, kambalelanga ubuwula uNkulunkulu.
౨౨జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.