< UJakhobe 3 >
1 Lingabi ngabafundisi abanengi, bazalwane bami, lisazi ukuthi sizakwemukela isigwebo esikhulu.
౧నా సోదరులారా, ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో ఎక్కువమంది ఉపదేశం చేసేవారుగా ఉండకండి.
2 Ngoba sonke siyakhubeka ezintweni ezinengi. Uba umuntu engakhubeki elizwini, lowo uyindoda epheleleyo, elamandla okukhina lomzimba wonke.
౨మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.
3 Khangela, sifaka amatomu emilonyeni yamabhiza ukuze asilalele, sibe sesiqondisa umzimba wonke wawo kwenye indlela.
౩గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా!
4 Khangela, lemikhumbi, lanxa imikhulu kangaka njalo iqhutshwa yimimoya elamandla, iyaqondiswa kwenye indlela ngephinyana nje, lapho isifiso somtshayeli esifuna khona.
౪ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు.
5 Lunjalo lolimi luyisitho esincinyane, kanti luzincoma kakhulu. Khangela, umlilo omncinyane uyatshisa izigodo ezingakanani!
౫అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి!
6 Ulimi lalo lungumlilo, umhlaba wobubi; lunjalo ulimi lubekwe phakathi kwezitho zethu, lungcolisa umzimba wonke, luthungele indlela yempilo, njalo luthungelwa yisihogo. (Geenna )
౬నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది. (Geenna )
7 Ngoba yonke imvelo yokubili izinyamazana lezinyoni, kokubili ezihuquzelayo lezidalwa zolwandle, iyathanjiswa njalo isithanjisiwe ngemvelo yabantu;
౭అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా.
8 kodwa ulimi kakulamuntu ongaluthambisa; luyibubi obungelakunqotshwa, lugcwele ubuhlungu obubulalayo.
౮కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది.
9 Ngalo siyabonga uNkulunkulu ngitsho uBaba, langalo siqalekisa abantu abenziwe ngesimo sikaNkulunkulu;
౯నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం.
10 emlonyeni munye kuyaphuma ukubonga lenhlamba. Lezizinto kazifanelanga, bazalwane bami, zenzeke njalo.
౧౦ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు.
11 Kambe umthombo emlonyeni munye ungagobhoza yini okumnandi lokubabayo?
౧౧ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా?
12 Kambe, bazalwane bami, umkhiwa ungathela imihlwathi yini, loba ivini umkhiwa? Ngokunjalo kakulamthombo oveza amanzi alitshwayi lamnandi.
౧౨నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.
13 Ngubani ohlakaniphileyo loqedisisayo phakathi kwenu? Katshengise imisebenzi yakhe ekuziphatheni kuhle ngobumnene benhlakanipho.
౧౩మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి.
14 Kodwa uba lilomhawu obabayo lombango enhliziyweni yenu, lingazincomi liqambele amanga iqiniso.
౧౪కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి.
15 Lokhu kayisiyo inhlakanipho eyehla ivela phezulu, kodwa ingeyomhlaba, ngeyemvelo, eyamadimoni.
౧౫ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.
16 Ngoba lapho okukhona umhawu lombango, lapho kukhona isiphithiphithi laso sonke isenzo esibi.
౧౬ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి.
17 Kodwa inhlakanipho evela phezulu eyokuqala ihlanzekile, emva kwalokho ibe lokuthula, ibe mnene, ilalele, igcwele isihawu lezithelo ezinhle, kayilakubandlulula futhi ingelakuzenzisa.
౧౭అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.
18 Lesithelo sokulunga sihlanyelwa ekuthuleni kulabo abenza ukuthula.
౧౮శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.