< UDanyeli 8 >
1 Ngomnyaka wesithathu wokubusa kwenkosi uBelishazari kwabonakala umbono kimi, mina Daniyeli, emva kwalowo owabonakala kimi kuqala.
౧బెల్షస్సరు రాజు పరిపాలన మూడవ సంవత్సరంలో దానియేలు అనే నాకు మొదట కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగింది.
2 Ngabona-ke embonweni; kwasekusithi, sengibonile, ngiseShushani isigodlo, esisesabelweni seElamu; ngasengibona embonweni, mina ngangingasemfuleni iUlayi.
౨నేను దర్శనం చూశాను. చూస్తుండగా నేను ఏలాము ప్రాంతానికి చెందిన షూషను అనే పట్టణం కోటలో ఉండగా నాకు దర్శనం వచ్చింది.
3 Ngasengiphakamisa amehlo ami, ngabona, khangela-ke, kwema phambi komfula inqama elempondo ezimbili. Impondo zombili zaziphakeme, kodwa olunye lwaluphakeme okwedlula olunye, njalo oluphakemeyo lwenyuka muva.
౩నేను ఊలయి అనే నది ఒడ్డున ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది. నేను కళ్ళెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ఒడ్డున నిలబడి ఉంది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు పొడవుగా ఉన్నాయి. అయితే ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది.
4 Ngabona inqama ihlaba ikhangele ngentshonalanga langenyakatho langeningizimu; ukuze kungabi lezinyamazana ezingema phambi kwayo, njalo kungekho ongophula esandleni sayo; kodwa yenza njengentando yayo, yazikhulisa.
౪ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమానికి, ఉత్తరానికి, దక్షిణానికి, పరుగులు పెడుతూ ఉండడం కనిపించింది. ఇలా జరుగుతుండగా దాన్ని ఎదిరించడానికైనా, దానికి చిక్కకుండా తప్పించుకోడానికైనా, ఏ జంతువుకూ శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టు చేస్తూ గొప్పదయింది.
5 Kwathi mina ngisacabanga, khangela-ke, kweza impongo yembuzi ivela ngentshonalanga phezu kobuso bomhlaba wonke, njalo kayiwuthintanga umhlabathi. Njalo limpongo yayilophondo olunanzelelekayo phakathi laphakathi kwamehlo ayo.
౫నేను ఈ సంగతి ఆలోచిస్తుంటే ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, కాళ్లు నేలపై మోపకుండా భూమి అంతటా పరుగులు తీసింది. దాని రెండు కళ్ళ మధ్య ఒక గొప్ప కొమ్ము ఉంది.
6 Yasisiza enqameni eyayilempondo ezimbili, engangiyibone imi phambi komfula, yagijimela kuyo ngolaka lwamandla ayo.
౬ఈ మేకపోతు నది ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు దగ్గరికి వచ్చి, భయంకరమైన కోపంతో బలంతో దాన్ని కుమ్మింది.
7 Ngasengiyibona isondela ngasenqameni, yathukuthela kakhulu imelene layo, yayitshaya inqama, yephula impondo zayo zombili. Kwakungaselamandla enqameni okuma phambi kwayo; kodwa impongo yayiwisela emhlabathini, yayinyathelela phansi; njalo kwakungekho owayengayophula inqama esandleni sayo.
౭నేను చూస్తుండగా ఆ మేకపోతు పొట్టేలుపై తిరగబడి, భీకరమైన రౌద్రంతో దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. ఆ పొట్టేలు దాని నెదిరించలేక పోయింది. ఆ మేకపోతు దాన్ని నేలపై పడేసి తొక్కుతూ ఉంది. దాని బలాన్ని అదుపు చేసి ఆ పొట్టేలును తప్పించడం ఎవరివల్లా కాలేదు.
8 Ngakho impongo yembuzi yazikhulisa kakhulukazi; yathi isilamandla, uphondo olukhulu lwephuka; njalo endaweni yalo kwenyuka ezine ezinanzelelekayo ngasemimoyeni emine yamazulu.
౮ఆ మేకపోతు విపరీతంగా పెరిగి పోయింది. అది బాగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగాయి.
9 Njalo kolunye lwazo kwaphuma uphondo oluncinyane, olwakhula kakhulukazi, ngaseningizimu langasempumalanga langaselizweni elihle.
౯ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్నకొమ్ము మొలిచింది. అది దక్షిణానికి, తూర్పుకు, ఇశ్రాయేలు మహిమాన్విత దేశం వైపుకు అత్యధికంగా ప్రబలింది.
10 Lwaselukhula kwaze kwaba sebuthweni lamazulu; lwaseluwisela emhlabathini okwebutho lokwezinkanyezi, lwakunyathelela phansi.
౧౦ఆకాశ సైన్యంతో యుద్ధమాడేటంతగా అది పెరిగిపోయి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసి కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
11 Yebo, lwazikhulisa kwaze kwaba sesiphathamandleni sebutho, langalo umhlatshelo oqhubekayo wasuswa, lendawo yendlu yaso engcwele yadilizelwa phansi.
౧౧ఆ సైన్యాధిపతికి విరోధంగా గొప్పదైపోయి, అనుదిన బలి అర్పణలను ఆపి వేసి ఆయన ఆలయాన్ని పాడు చేసింది.
12 Kwasekunikelwa ibutho limelene lomhlatshelo oqhubekayo ngenxa yesiphambeko, laphosela emhlabathini iqiniso, lenza, laphumelela.
౧౨తిరుగుబాటు మూలంగా ఆ మేకపోతు కొమ్ముకు ఒక సేన ఇవ్వడం జరిగింది. అతడు సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టానుసారంగా జరిగిస్తూ వర్థిల్లాడు.
13 Ngasengisizwa ongcwele oyedwa ekhuluma, njalo omunye ongcwele wathi kulowo othile owakhulumayo: Koze kube nini uzakuba khona lumbono mayelana lomhlatshelo oqhubekayo, lesiphambeko sencithakalo, ukunikela indawo engcwele kanye lebutho ukuthi kunyathelelwe phansi?
౧౩అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాటలాడగా విన్నాను. అంతలో మాట్లాడుతూ ఉన్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే “దహన బలిని గూర్చి, నాశనకారకమైన పాపం గురించి, ఆలయం అప్పగించడం, ఆకాశ సైన్యం కాలి కింద తొక్క బడడం కనిపించిన ఈ దర్శనం నెరవేరడానికి ఎన్నాళ్లు పడుతుంది” అని మాట్లాడుకున్నారు.
14 Wasesithi kimi: Kuze kube zintambama lekuseni okuzinkulungwane ezimbili lamakhulu amathathu; kube sekuhlanjululwa indawo engcwele.
౧౪అతడు “2, 300 రోజుల వరకే” అని నాతో చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగుతుంది.
15 Kwasekusithi mina Daniyeli sengiwubonile umbono ngadinga ukuqedisisa, khangela-ke, kwema phambi kwami okunjengesimo somuntu.
౧౫దానియేలు అనే నేను ఈ దర్శనం చూశాను. దాన్ని గ్రహించ గలిగిన వివేకం పొందాలని నాకు అనిపించింది. మనిషి రూపం ఉన్న ఒకడు నా ఎదుట నిలబడ్డాడు.
16 Ngasengisizwa ilizwi lomuntu phakathi kwezinkumbizeUlayi, elamemeza lathi: Gabriyeli, yenza lo aqedisise umbono.
౧౬అప్పుడు ఊలయి నదీతీరాల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనిషి స్వరం విన్నాను. అది “గాబ్రియేలూ, ఈ దర్శనభావాన్ని ఇతనికి తెలియజెయ్యి” అని వినిపించింది.
17 Wasesiza eceleni kwalapho engangimi khona. Esefikile, ngethuka, ngathi mbo ngobuso bami. Kodwa wathi kimi: Qedisisa, ndodana yomuntu, ngoba umbono ungowesikhathi sokucina.
౧౭అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.
18 Kwathi esakhuluma lami, ngangilele ubuthongo obukhulu ngobuso bami emhlabathini; kodwa wangithinta, wangimisa endaweni yami yokuma.
౧౮అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు గాఢనిద్ర పట్టి నేలపై సాష్టాంగపడ్డాను. కాబట్టి అతడు నన్ను పట్టుకుని లేపి నిలబెట్టాడు.
19 Wasesithi: Khangela, ngizakwenza wazi okuzakuba sekupheleni kwentukuthelo, ngoba ukucina kuzakuba ngesikhathi esimisiweyo.
౧౯అతడు “ఉగ్రత పూర్తి అయ్యే కాలంలో జరగబోయే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలాన్ని గురించినది.
20 Inqama oyibonileyo elempondo ezimbili ngamakhosi eMede lePerisiya.
౨౦నీవు చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు మాదీయుల పారసీకుల రాజులను సూచిస్తున్నది.
21 Njalo impongo eyisiyephu iyinkosi yeGirisi, lophondo olukhulu oluphakathi laphakathi kwamehlo ayo luyinkosi yokuqala.
౨౧బొచ్చు ఉన్న ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని రెండు కళ్ళ మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది.
22 Ngolwephukayo, njengoba kwema ezine endaweni yalo, kuzakuma imibuso emine kuso isizwe, kodwa hatshi ngamandla alo.
౨౨అది పెరిగిన తరువాత దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టాయి గదా. నలుగురు రాజులు ఆ జాతిలో పుడతారు గాని వారికి అతనికున్నంత బలం ఉండదు.
23 Njalo ekucineni kwemibuso yazo, lapho abaphambeki sebephelele, izakuma inkosi elukhuni ngobuso, eqedisisa imizekeliso.
౨౩వారి పరిపాలన అంతంలో వారి అతిక్రమాలు పూర్తి ఆవుతుండగా, క్రూరముఖం ఒక రాజు వస్తాడు. అతడు చాలా యుక్తిపరుడు.
24 Lamandla ayo azaqina, kodwa hatshi ngamandla ayo. Njalo izachitha ngokumangalisayo, iphumelele, yenze, ichithe abalamandla lesizwe sabangcwele.
౨౪అతడు శక్తిశాలి గాని అది అతని స్వశక్తి కాదు. అతడు విస్తృతంగా విధ్వంసం జరిగిస్తాడు. తాను చేసే ప్రతి దానిలోనూ సఫలుడౌతాడు. అతడు బలిష్టులైన ప్రజలను పరిశుద్ధ ప్రజలను నాశనం చేస్తాడు.
25 Langobuqili bayo izaphumelelisa inkohliso esandleni sayo, izikhulise enhliziyweni yayo, ichithe abanengi ngokuthula, futhi izamelana leNkosana yamakhosana, kodwa izakwephulwa kungelasandla.
౨౫అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.
26 Njalo umbono wantambama lowekuseni olandisiweyo uliqiniso; wena-ke valela umbono, ngoba ungowensuku ezinengi.
౨౬ఆ దినాలను గూర్చిన దర్శనాన్ని గూర్చి చెప్పినది వాస్తవం, నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయవద్దు. ఎందుకంటే అది భవిషత్తులో నెరవేరుతుంది.”
27 Mina-ke Daniyeli, ngaphela amandla ngagula okwensuku ezithile; emva kwalokho ngasukuma, ngenza umsebenzi wenkosi; njalo ngamangala kakhulu ngombono, kodwa kakho owaqedisisayo.
౨౭దానియేలు అనే నేను తట్టుకోలేక కొన్నాళ్లు నీరసంగా పడి ఉన్నాను. తరువాత నేను లేచి రాజు కోసం చేయవలసిన పని చేస్తూ వచ్చాను. ఈ దర్శనాన్ని గూర్చి నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండిపోయాను. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరూ లేరు.