< Imisebenzi 8 >
1 Njalo uSawuli wayevumelana lokubulawa kwakhe. Ngalolosuku kwasekusuka ukuzingelwa okukhulu kwebandla elaliseJerusalema; bonke basebehlakazeka emazweni eJudiya leSamariya, ngaphandle kwabaphostoli.
౧ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది.
2 Amadoda akholwayo asembutha uStefane, amenzela isililo esikhulu.
౨కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
3 Kodwa uSawuli walichitha ibandla, engena izindlu ngezindlu, ehudula amadoda labafazi ebafaka entolongweni.
౩అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు.
4 Ngakho abahlakazekileyo badabula ilizwe, betshumayela ilizwi.
౪అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.
5 UFiliphu wasesehlela emzini weSamariya, watshumayela kubo uKristu.
౫ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.
6 Amaxuku aselalela nganhliziyonye okwakhulunywa nguFiliphu, esizwa njalo ebona izibonakaliso azenzayo.
౬జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు.
7 Ngoba kwabanengi ababelabomoya abangcolileyo, bememeza ngelizwi elikhulu baphuma; labanengi ababome umhlubulo lababeyiziqhuli basiliswa.
౭చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.
8 Kwaba khona intokozo enkulu kulowomuzi.
౮అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
9 Njalo indoda ethile, uSimoni ngebizo, eyayikade isenza imilingo emzini isanganisa isizwe saseSamariya, isithi ingumuntu omkhulu;
౯సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు.
10 abayilalelayo bonke kusukela kwabancinyane kuze kube kwabakhulu, besithi: Lo ungamandla amakhulu kaNkulunkulu.
౧౦అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు.
11 Basebemlalela, ngoba wabasanganisa isikhathi eside ngemilingo.
౧౧అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు.
12 Kodwa kwathi sebekholwe uFiliphu etshumayela indaba ezinhle zezinto ngombuso kaNkulunkulu langebizo likaJesu Kristu, babhabhathizwa bonke amadoda labafazi.
౧౨అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు.
13 LoSimoni laye wakholwa, njalo esebhabhathiziwe wanamathela kuFiliphu; wasanganiseka, ebona imisebenzi yamandla lezibonakaliso ezazisenziwa.
౧౩అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
14 Kwathi abaphostoli abaseJerusalema bezwe ukuthi iSamariya ilemukele ilizwi likaNkulunkulu, bathuma kubo uPetro loJohane;
౧౪సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.
15 abathi sebehlile babakhulekela, ukuze bamemukele uMoya oNgcwele;
౧౫వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
16 ngoba wayengakehleli lakoyedwa wabo, kodwa babebhabhathizwe ebizweni leNkosi uJesu kuphela.
౧౬అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు.
17 Basebebeka izandla phezu kwabo, basebesemukela uMoya oNgcwele.
౧౭అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.
18 Njalo uSimoni esebonile ukuthi ngokubekwa kwezandla zabaphostoli uyaphiwa uMoya oyiNgcwele, waletha imali kubo,
౧౮అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను,
19 esithi: Ngiphani lami lawomandla, ukuze kuthi loba ngubani engibeka izandla zami phezu kwakhe, emukele uMoya oNgcwele.
౧౯వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండి” అని అడిగాడు.
20 Kodwa uPetro wathi kuye: Isiliva sakho kanye lawe kakube sekubhubheni, ngoba ucabanga ukuthi isipho sikaNkulunkulu singazuzwa ngemali.
౨౦అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక.
21 Kawulasabelo lelifa kuloludaba. Ngoba inhliziyo yakho kayiqondanga phambi kukaNkulunkulu.
౨౧నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
22 Ngakho phenduka kulobububi bakho, njalo ucele iNkosi, ukuthi uba kungenzeka uthethelelwe umnakano wenhliziyo yakho.
౨౨నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
23 Ngoba ngibona ukuthi usenyongweni ebabayo njalo usekubotshweni yisono.
౨౩నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు.
24 USimoni wasephendula esithi: Ngikhulekelani lina eNkosini, ukuze ngingehlelwa ngolunye lwalezizinto elizikhulumileyo.
౨౪అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.
25 Ngakho kuthe sebefakazile bekhulumile ilizwi leNkosi, babuyela eJerusalema, njalo betshumayela ivangeli emizaneni eminengi yamaSamariya.
౨౫ఆ తరువాత వారు సాక్షమిచ్చి ప్రభువు వాక్కు బోధించి యెరూషలేము తిరిగి వెళ్తూ, సమరయ ప్రజల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
26 Ingilosi yeNkosi yasikhuluma loFiliphu, yathi: Sukuma uye eningizimu endleleni eyehla isuka eJerusalema isiya eGaza; yona iyinkangala.
౨౬ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.
27 Wasesukuma ehamba; njalo khangela umuntu weEthiyophiya umthenwa induna enkulu kaKandake indlovukazi yamaEthiyophiya, eyayiphezu kwempahla yakhe eligugu yonke, eyayifikile eJerusalema ukukhonza,
౨౭అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.
28 yayisibuyela ihlezi enqoleni yayo, ibala kumprofethi uIsaya.
౨౮అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
29 UMoya wasesithi kuFiliphu: Sondela uhambe lalinqola.
౨౯ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు.
30 UFiliphu wasegijimela kuyo wayizwa ibala umprofethi uIsaya, wathi: Kambe uyaqedisisa yini lezizinto ozifundayo?
౩౦ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు.
31 Yasisithi: Kambe ngingakwenelisa njani, ngaphandle kokuthi omunye angiqondise? Yasimcela uFiliphu ukuthi akhwele ahlale layo.
౩౧అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.
32 Lesehlukwana sombhalo eyayisifunda yilesi: Walethwa ekuhlatshweni njengemvu; lanjengewundlu lithule phambi komgundi walo, ngokunjalo kawuvuli umlomo wakhe.
౩౨ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే, ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు. బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే, ఆయన నోరు తెరవలేదు.
33 Ekuthotshisweni kwakhe ukwahlulelwa kwakhe kwasuswa, njalo ngubani ongalandisa ngesizukulwana sakhe? Ngoba impilo yakhe iyasuswa emhlabeni.
౩౩ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు. ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.
34 Umthenwa wasephendula uFiliphu wathi: Ngiyakubuza, umprofethi ukhuluma lokhu ngobani? Ngaye ngokwakhe, kumbe ngomunye yini?
౩౪అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు.
35 UFiliphu wasevula umlomo wakhe, eseqala kulowombhalo, watshumayela uJesu kuye.
౩౫ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
36 Kwathi besahamba endleleni, bafika emanzini athile; lomthenwa wathi: Khangela, nanka amanzi; kuyini okungivimbela ukuthi ngibhabhathizwe?
౩౬వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.
37 UFiliphu wasesithi: Uba ukholwa ngenhliziyo yonke, kuvunyelwe. Wasephendula wathi: Ngiyakholwa ukuthi uJesu Kristu uyiNdodana kaNkulunkulu.
౩౭ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు.
38 Waselaya ukuthi inqola ime; basebesehlela emanzini bobabili, uFiliphu lomthenwa; wasembhabhathiza.
౩౮అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు.
39 Kwathi sebekhuphukile emanzini, uMoya weNkosi wamhluthuna uFiliphu; njalo umthenwa kazabe esambona; wahamba-ke ngendlela yakhe ethokoza.
౩౯వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
40 Kodwa uFiliphu waficwa eAzotu; njalo edabula watshumayela ivangeli kuyo yonke imizi, waze wafika eKesariya.
౪౦అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.