< Amahubo 41 >
1 Kumqondisi wokuhlabela. Ihubo likaDavida. Ubusisiwe lowo onanza abahluphekayo; uThixo uyamkhulula ngezikhathi zokuhlupheka.
౧ప్రధాన సంగీతకారుడి కోసం దావీదు కీర్తన బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు.
2 UThixo uzamvikela alondoloze impilo yakhe; uzambusisa phakathi kwelizwe akasoze amnikele emandleni ezitha zakhe.
౨యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు.
3 UThixo uzamqinisa lanxa elele egula njalo amsilise avuke ekuguleni kwakhe.
౩జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.
4 Ngathi, “Oh Thixo ake ungihawukele; ngisilisa, ngoba ngonile kuwe.”
౪నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.
5 Izitha zami ziyangigcona zithi, “Uzakufa nini licitshe ibizo lakhe?”
౫నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు.
6 Nxa omunye wabo efika ezongibona, ukhuluma kuhle angikhohlise, kodwa enhliziyweni yakhe egaya izibozi; athi angaphuma ahambe esekhihliza ebantwini.
౬నా శత్రువు నన్ను చూడటానికి వస్తే నా గురించి పనికిమాలిన మాటలు చెప్తాడు. వాడి హృదయం నా నాశనం చూడ్డానికి సిద్ధపడి ఉంటుంది. వాడు బయటకు వెళ్లి ఇతరులకు ఆ సంగతి చెప్తాడు.
7 Bonke abangizondayo banyenyezelana ngami; bangicabangela wonke amanyala besithi,
౭నన్ను ద్వేషించే వాళ్ళంతా చేరి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ ఉన్నారు. నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు.
8 “Usengenwe ngumkhuhlane omubi; kasoze asile avuke futhi.”
౮ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు.
9 Lomngane wami osekhwapheni, ebengimthembile, lowo obesidla lami isinkwa usengihlamukele.
౯నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు.
10 Kodwa wena, Oh Thixo ake ungihawukele; ake ungivuse ukuze ngibakhawulise.
౧౦కానీ యెహోవా, వాళ్ళకు బదులు తీర్చడానికై నన్ను కరుణించి పైకి లేపు.
11 Ngiyazi ukuthi uyathokoza ngami, ngoba isitha sami kasingehluli.
౧౧అప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుస్తుంది. నా శత్రువు నాపై విజయం సాధించలేడు.
12 Ubuqotho bami busekelwa nguwe njalo ungimisa phambi kwakho nini lanini.
౧౨నా యథార్థతను బట్టి నువ్వు నాకు సహాయం చేస్తావు. నీ సమక్షంలో నన్ను శాశ్వతంగా నిలబెట్టుకుంటావు.
13 Udumo alube kuye uThixo, uNkulunkulu ka-Israyeli, kusukela nininini kuze kube nininini.
౧౩నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్. ఆమేన్.