< KumaHebheru 12 >
1 Ngakho-ke, njengoba sihanqwe lixuku elikhulu kangaka labafakazi, kasikulahleni konke okusivimbelayo kanye lesono esisibopha lula njalo kasigijimeni ngokubekezela kulo umjaho ophawulelwe thina.
౧మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
2 Kasikhangeleni kuJesu, uMqalisi loMphelelisi wokukholwa kwethu, okwathi ngentokozo eyayibekwe phambi kwakhe wabekezelela isiphambano, engananzi ihlazo laso, wahlala phansi esandleni sokunene sobukhosi sikaNkulunkulu.
౨మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
3 Cabangani ngaye owabekezelela ukuphikiswa okungaka ngabantu abayizoni ukuze lingabi buthakathaka lilahle ithemba.
౩మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.
4 Ekulweni kwenu lesono, kalimelananga laso kwaze kwaba sebangeni lokuchitha igazi lenu.
౪మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.
5 Njalo selilikhohliwe lelizwi lokulikhuthaza elikhuluma kini njengamadodana elithi: “Ndodana yami, ungeyisi ukulaya kweNkosi. Njalo ungalahli ithemba lapho ikukhuza,
౫కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
6 ngoba uThixo ulaya labo abathandayo, abuye ajezise bonke abamukela njengendodana.”
౬ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.
7 Bekezelelani ukuhlupheka njengokulaywa; uNkulunkulu uliphatha njengabantwana bakhe. Kambe yibaphi abantwana abangalaywa nguyise na?
౭హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
8 Nxa lingalaywa (umuntu wonke uyalaywa), liyabe lingabantwana abazalwa ngokungekho emthethweni njalo abangasiwo amadodana lamadodakazi uqobo.
౮కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
9 Phezu kwalokho, sonke sake saba labobaba abasilayayo njalo sabahlonipha ngenxa yalokho. Pho kufanele sizehlise kakhulu okungakanani kuBaba wemimoya yethu njalo siphile!
౯ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
10 Obaba basilaya okwesikhatshana ngababekubona kukuhle, kodwa uNkulunkulu usilaya ukuba sisizakale, ukuba sihlanganyele ebungcweleni bakhe.
౧౦మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
11 Akukho kulaywa okukhanya kukuhle ngalesosikhathi, kodwa kubuhlungu. Kodwa muva, kuletha isivuno sokulunga lokuthula kulabo abafundiswa yikho.
౧౧అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
12 Ngakho-ke, qinisani izingalo zenu ezibuthakathaka lamadolo enu axegayo.
౧౨కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.
13 “Lungiselani inyawo zenu izindlela ezibekekileyo,” ukuze abaqhulayo bangagogeki, kodwa basiliswe.
౧౩మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి
14 Zamani kakhulu ukuhlalisana ngokuthula labantu bonke lokuba ngcwele; kungekho bungcwele kakho ozayibona iNkosi.
౧౪అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
15 Bonani ukuthi kakho oswela umusa kaNkulunkulu kanye lokuthi akulampande ebabayo ekhulayo ukuba idale uhlupho ingcolise abanengi.
౧౫దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
16 Bonani ukuthi kakho oyisifebe, loba ongakhonzi uNkulunkulu njengo-Esawu okwathi ngenxa yokudla kunye wathengisa amalungelo elifa lakhe okuba lizibulo.
౧౬లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.
17 Muva, njengoba lisazi, lapho esefuna ukuzuza isibusiso lesi waliwa. Wayengeke enze kube lokuguquka kwengqondo, lanxa wafuna isibusiso leso ngezinyembezi.
౧౭ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
18 Kalizanga entabeni engathintwayo njalo ebhebha umlilo; ebumnyameni lasekufiphaleni lesiphepho;
౧౮చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు.
19 ekukhaleni kwecilongo loba ilizwi elinjalo elikhulumayo, okwenza labo abalizwayo bacela ukuba kungabi lelizwi elikhulunywa kubo futhi,
౧౯బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు.
20 ngoba babengeke bakumele ukulaywa okwakusithi: “Lenyamazana ingathinta intaba, kumele itshaywe ngamatshe.”
౨౦ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.
21 Okwabonwayo kwakusesabeka kakhulu uMosi waze wathi, “Ngiyathuthumela ngenxa yokwesaba.”
౨౧భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.
22 Kodwa lina lize eNtabeni iZiyoni, iJerusalema lasezulwini, umuzi kaNkulunkulu ophilayo. Lize kuzinkulungwane lezinkulungwane zezingilosi ezihlangane ngentokozo
౨౨ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
23 ebandleni lezibulo, ezimabizo azo alotshiwe ezulwini. Lize kuNkulunkulu, umahluleli wabantu bonke, emimoyeni yabantu abalungileyo abaphelelisiweyo,
౨౩పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.
24 kuJesu umeli wesivumelwano esitsha, lasegazini elicheliweyo elikhuluma ilizwi elihle kulegazi lika-Abheli.
౨౪ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
25 Bonani ukuthi kalimenqabeli lowo okhulumayo. Nxa bengaphephanga lapho benqabela lowo owabaxwayisa emhlabeni, koba kuncane kangakanani kithi, nxa sidela lowo osixwayisa ezulwini na?
౨౫మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
26 Ngalesosikhathi ilizwi lakhe lanyikinya umhlaba, kodwa khathesi usethembisile wathi: “Ngizaphinda njalo futhi nginyikinye, hatshi umhlaba kuphela, kodwa lamazulu futhi.”
౨౬ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.”
27 Amazwi la “njalo futhi” atsho ukususwa kwalokho okunganyikinyiswa, okuyikuthi izinto ezadalwayo, ukuze kuthi lokho okungeke kunyikinyiswe kusale.
౨౭“మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
28 Ngakho-ke, njengoba sisamukela umbuso ongeke unyikinywe, kasibongeni njalo sikhonze uNkulunkulu ngokufaneleyo ngenhlonipho langokwesaba,
౨౮కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
29 ngoba “uNkulunkulu wethu ungumlilo oqothulayo.”
౨౯ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.