< UGenesisi 18 >
1 UThixo wabonakala ku-Abhrahama eduzane lezihlahla ezinkulu zikaMamure, ehlezi emnyango wethente lakhe, ilanga litshisa kakhulu.
౧మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
2 U-Abhrahama waphosa amehlo wabona amadoda amathathu emi eduze. Wonela ukuwabona wasuka ngokuphangisa emnyango wethente lakhe wawahlangabeza wafika wakhothama phansi.
౨అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
3 Wathi, “Nxa ngifumene umusa kuwe, nkosi yami, ungedluli eceleni kwenceku yakho.
౩“ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.
4 Akulethwe amanzi amalutshwana nje, ukuze lonke ligeze inyawo zenu, keliphumule ngaphansi kwesihlahla lesi.
౪నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
5 Wothini ngilidingele ukudla ukuze lizuze amandla andubana liqhubeke ngohambo lwenu njengoba nje selizile encekwini yenu.” Baphendula bathi, “Kulungile, yenza lokho okutshoyo.”
౫మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
6 Ngakho u-Abhrahama waphanga waya ethenteni kuSara. Wathi, “Phangisa, thatha izilinganiso ezintathu zefulawa ecolekileyo, uvube inhlama wenze isinkwa.”
౬అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు.
7 Waphanga waya emhlambini wakhetha iguqana elihle, elibuthakathaka walipha isisebenzi ukuba silihlinze.
౭తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.
8 Waseletha izankefu zamasi, lochago kanye leguqa elaselilungisiwe, konke wakubeka phambi kwabo. Bathi besidla yena wema eduzane labo ngaphansi kwesihlahla.
౮తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
9 Bambuza bathi, “Ungaphi umkakho uSara na?” Wathi, “Ulaphayana, ethenteni.”
౯వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.
10 UThixo wasesithi, “Ngizabuya ngempela kuwe ngalesisikhathi ngomnyaka ozayo, njalo umkakho uSara uzakuba lendodana.” USara wayelokhu elalele esemnyango wethente elalingemuva kwakhe.
౧౦అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
11 U-Abhrahama loSara basebevele sebebadala kakhulu, uSara esedlule isikhathi sokuba labantwana.
౧౧అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది.
12 Ngakho uSara wahleka yedwa, wakhumbula wathi, “Kambe sengigugile kanje lenkosi yami isindala, ngingakhona ngizuza intokozo le?”
౧౨శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
13 UThixo wasesithi ku-Abhrahama, “Kungani uSara ehlekile njalo wathi, ‘Kambe sibili ngizakuba lomntwana mina sengiluphele?’
౧౩అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది?
14 Kambe kulolutho olwehlula uThixo na? Ngizabuya kuwe ngesikhathi esimisiweyo ngomnyaka ozayo, njalo uSara uzakuba lendodana.”
౧౪యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
15 USara wesaba, yikho waqamba amanga wathi, “Kangizange ngihleke mina.” Kodwa wathi, “Ye, uhlekile.”
౧౫అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
16 Amadoda asuka ahamba aqonda eSodoma, u-Abhrahama wawaphelekezela ukuwakhupha.
౧౬అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.
17 UThixo wasesithi, “Ngimfihlele yini u-Abhrahama lokho esengizakwenza na?
౧౭కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.
18 Ngempela u-Abhrahama uzakuba yisizwe esikhulu esilamandla, njalo zonke izizwe zomhlaba zizabusiswa ngaye.
౧౮అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
19 Ngoba sengimkhethile, ukuze aqondise abantwabakhe lomuzi wakhe, yena esedlule, ukugcina indlela kaThixo ngokwenza okulungileyo lokuqondileyo, ukuze uThixo amenzele u-Abhrahama lokho amthembise khona.”
౧౯అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
20 UThixo wasesithi kuye, “Insolo ngeSodoma leGomora inkulu kakhulu njalo isono sakhona siyesabeka
౨౦అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
21 okokuthi sengizakuya khona ngiyebona ingabe lokho abakwenzileyo kubi okulingana lensolo le esifikile kimi. Nxa kungenjalo, ngizakwazi.”
౨౧నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
22 Amadoda akhangela phambili aqonda eSodoma, kodwa u-Abhrahama wasala emi phambi kukaThixo.
౨౨ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.
23 Ngakho u-Abhrahama waya kuye wathi: “Uzabhubhisa abalungileyo kanye lababi na?
౨౩అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
24 Pho nxa kukhona abangamatshumi amahlanu kulelodolobho ke? Ngempela uzalikhucula na ungalixoleli ngenxa yabangamatshumi amahlanu abalungileyo abakulo na?
౨౪ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
25 Akube khatshana lawe ukwenza into enjalo, ukubulala abalungileyo lababi. Kakube khatshana lawe lokho! Kambe uMahluleli womhlaba wonke kayikwenza okufaneleyo na?”
౨౫నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
26 UThixo wathi, “Nxa ngifumana abangamatshumi amahlanu abalungileyo edolobheni laseSodoma, ngizalixolela lonke idolobho ngenxa yabo.”
౨౬దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
27 U-Abhrahama waphinda wakhuluma njalo wathi: “Njengoba sengibe lesibindi esingaka sokukhuluma loThixo, loba ngingasulutho mina, ngiluthuli nje lomlotha,
౨౭అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.
28 pho nxa inani labalungileyo lingaphansi ngabahlanu ematshumini amahlanu? Uzalibhubhisa idolobho lonke ngenxa yabantu abahlanu na?” Wathi, “Ngingafumana abangamatshumi amane lanhlanu kangiyikulibhubhisa.”
౨౮యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
29 Waphinda njalo wakhuluma laye wathi, “Nxa kufunyanwa amatshumi amane kuphela-ke?” Yena wathi, “Ngenxa yabangamatshumi amane kangizukukwenza.”
౨౯అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు.
30 Ngakho wasesithi, “UThixo makangathukutheli, kodwa ake ngikhulume. Kungafunyanwa khona amatshumi amathathu ke?” Waphendula wathi, “Kangizukukwenza ngingafumana khona amatshumi amathathu.”
౩౦అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
31 U-Abhrahama wathi, “Kambe njengoba ngibe lesibindi esingaka ngaze ngakhuluma loThixo, pho nxa kufunyanwa abangamatshumi amabili khona kuphela-ke?” Wathi, “Ngenxa yabangamatshumi amabili kangiyikulibhubhisa.”
౩౧అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
32 Waphinda wathi, “UThixo angathukutheli, kodwa ake ngikhulume kanye kuphela njalo. Kambe nxa kungafunyanwa itshumi lodwa-ke?” Waphendula wathi, “Ngenxa yabalitshumi kangiyikulibhubhisa.”
౩౨చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
33 Kwathi uThixo eseqedile ukukhuluma lo-Abhrahama wasuka, lo-Abhrahama wabuyela ngekhaya.
౩౩అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.