< Salamo 80 >

1 Toloro ravembia ry Mpiarak’ Israele, ry Mpiaolo’ Iosefe hoe t’ie lia-raike; ry Mpiambesatse ambone’ o kerobeo, mireandreaña!
ప్రధాన సంగీతకారుని కోసం, సోషన్నీము ఏదూత్ (ఒడంబడిక కలువలు) రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.
2 Tsekafo añatrefa’ i Efraime naho i Beniamine naho i Menase ty haozara’o vaho mb’etoa hañimba anay!
ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు.
3 Ry Andrianañahare, Ampolio zahay naho ampireandreaño laharañe, soa te ho tra-drombake zahay.
దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
4 O ry Iehovà Andrianañahare’ i Màroy, pak’ombia ty mbe hiviñera’o ty halali’ ondati’oo?
యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు?
5 Nazotso’o mofon-dranom-pihaino, naho nampigenohe’o ranomaso am-pitovy telo.
కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
6 Ampanivetivè’o ondaty mañohok’anaio; vaho vereverè’ o rafelahi’aio.
మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.
7 Ry Andrianañahare’ i Màroy. Ampolio zahay, ampireandreaño ty lahara’o, soa t’ie ho tra-drombake.
సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
8 Nitsongoe’o boak’e Mitsraime ty vahe; rinoa’o o kilakila‘ndatio naho naketsa’o.
నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు.
9 Nihatsafe’o ty tane aolo’e eo, naho nampandaleke o vaha’eo, vaho nanitsife’o i taney.
దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది.
10 Nikopahe’ i alo’ey o vohitseo; naho o tsampa’eo o mendoraveñe ra’elahio.
౧౦దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి,
11 Nandrevake mb’amy riakey o ra’eo, naho pak’amy sakay añe o tora’eo.
౧౧దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి.
12 Aa vaho akore ty nandrotsaha’o o fahe’eo, hitimpona’ ze miary eo,
౧౨దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు?
13 Troatroae’ ty lambon’ ala, vaho abotse’ ze misitsitse an-kivoke ey.
౧౩అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి.
14 Ry Andrianañahare’ i màroy, Ehe, Mibaliha, mijilova boak’ an-dikerañe ao naho vazoho vaho tiliho ty vahe toy,
౧౪సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు.
15 Eka! i tora’e naketsam-pitàn-kavana’oy, i ana-dahy nampaozare’o ho Azoy,
౧౫నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు.
16 finorototo’ ty afo, finira, mihomake ami’ty fitrevohan-dahara’o.
౧౬దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక.
17 Anampezo fitàñe indatim-pitàn-kavana’oy, i ana’ ondaty nampifatrare’o ho Azoy.
౧౭నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు.
18 Vaho tsy hiambohoa’ay; Ehe sotraho, hikanjia’ay ty tahina’o.
౧౮అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం.
19 Ry Iehovà Andrianañahare’ i Màroy; Ampolio zahay, ampireandreaño ama’ay ty lahara’o, vaho ho tra-drombake.
౧౯యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.

< Salamo 80 >