< Nomery 36 >
1 Niharine mb’eo o mpiaolon’ anjomban-droaem-pifokoan-tarira’ i Gilade ana’ i Makire, ana’ i Menasè, hasavereña’ o ana’ Iosefeoo vaho nilañoñe añatrefa’ i Mosè naho o talèo naho o talèn’ anjomban-droae’ o ana’ Israeleoo,
౧యోసేపు కొడుకుల వంశాల్లో మాకీరు కొడుకు, మనష్షే మనమడు అయిన గిలాదు వంశం పెద్దలు వచ్చి మోషేతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల నాయకులతో ఇలా అన్నారు,
2 nanao ty hoe: Linili’ Iehovà i talèkoy ty hanolotse i tane lovaeñey an-tsapake; vaho linili’ Iehovà i talèkoy ty hanolotse i lovan-drahalahi’ay Tselofekhàdey amo anak’ ampela’eo.
౨“ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు.
3 Aa naho ivalia’ ty anam-pifokoa ila’e amo ana’ Israeleo, le ho rambeseñe ami’ty lovan-droae’ay ty lova’ iareo vaho ho tovoñañe ami’ty lova’ i fifokoañe nivalie’ey; aa le ho liniva amy lova niazo’ay an-tsapakey.
౩అయితే వారు ఇశ్రాయేలీయుల్లో ఇతర గోత్రాల వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వం నుండి తీసి, వారు చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోయి, మా గోత్రానికి వచ్చిన చీటీల ప్రకారం లభించిన వారసత్వం నుండి వేరైపోతుంది.
4 Le ie avy i Jobili’ o ana’ Israeleio, ho tovoñañe ami’ ty lova’ i fifokoañe nañeng’ azey i lova’ey; le ho livaeñe ami’ ty lovam-pifokoan-droae’ay i lova’ey.
౪కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి వంతు వారు పెళ్లి చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోతుంది కాబట్టి ఆ మేరకు మా పూర్వీకుల గోత్ర వారసత్వం తగ్గిపోతుంది.”
5 Le hoe ty linili’ i Mosè amo ana’ Israeleo ty amy tsara’ Iehovày, To ty saontsi’ o tariram-pifokoa’ Iosefeo.
౫అప్పుడు మోషే యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. “యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పింది న్యాయంగానే ఉంది.
6 Aa hoe ty linili’ Iehovà omba o anak’ ampela’ i Tselofekhàdeo: angao hifanambaly amy ze tea’e fe tsy mete tsy amo tariram-pifokoan-droae’eo avao ty anambalia’ iareo.
౬యెహోవా సెలోపెహాదు కూతుళ్ళ గురించి చెప్పింది ఏమిటంటే, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు గాని, తమ తండ్రి గోత్ర వంశాల్లోనే చేసుకోవాలి.
7 Aa le tsy hafindra am-pifokoañe raike ho ami’ty fifokoañe ila’e o lovao; fa songa hitañe ty lovam-pifokoan-droae’e o ana’ Israeleo.
౭ఇశ్రాయేలీయుల వారసత్వం ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల గోత్ర వారసత్వానికి కట్టుబడి ఉండాలి.
8 Le hanambaly ami’ty fifokoan-droae’e ze anak’ ampela mitan-dova ami’ty fifokoañe raik’ amo ana’ Israeleo, soa te songa hitan-dovan-droae’e o ana’ Israeleo.
౮ఇశ్రాయేలీయులకు వారి పూర్వీకుల వారసత్వం కలిగేలా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి యువతీ తన తండ్రి గోత్రంలోనే వివాహం చేసుకోవాలి.
9 Aa le tsy hafindra ho ami’ty fifokoañe ila’e ty lova fa sambe mitan-ty lova’e o fifokoan’ ana’ Israeleo.
౯వారసత్వం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రాలు వారి వారి వారసత్వాల్లోనే నిలిచి ఉండాలి.”
10 Nanoe’ o anak’ampela’ i Tselofekadeo ty nandilia’ Iehovà i Mosè.
౧౦యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా సెలోపెహాదు కూతుళ్ళు చేశారు.
11 Le nifanambaly ami’ty anan-drahalahin-drae’e t’i Maklà, i Tirtsà, naho i Koglà vaho i Noà ana’ i Tselofekade.
౧౧మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అనే సెలోపెహాదు కూతుళ్ళు తమ తండ్రి సోదరుని కొడుకులను వివాహం చేసుకున్నారు.
12 Nifanambaly amo tarira’ o nte-Menasè ana’ Iosefeo iereo vaho mireketse am-pifokoan-droae’e ao ty lova’ iareo.
౧౨అంటే యోసేపు కొడుకులైన మనష్షీయులను వివాహం చేసుకోవడం వలన వారి వారసత్వం వారి తండ్రి గోత్రంలోనే ఉండిపోయింది.
13 Irezay ro lily naho fepetse linili’ Iehovà amo ana’ Israeleo am-pità’ i Mosè a montom-bei’ i Moabe añ’ olo’ Iordaney tandrife Ierikò eo.
౧౩ఇవి యెరికో దగ్గర యొర్దానుకు సమీపంగా ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు.