< Nomery 16 >
1 Ie amy zao, niavotse t’i Korahk’ ana’ Itsare ana’ i Kehàte fifokoa’ i Levy reketse i Datane naho i Abirame songa ana’ i Eliabe vaho i One, ana’ i Pelete tarira’ i Reòbene,
౧లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి
2 le nijohañe aolo’ i Mosè eo mindre ami’ty ila’ o ana’ Israeleo, mpiaolo’ i valobohòkey, roanjato-tsi-limampolo, jinoboñe am-pivory, aman-kasy;
౨ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి
3 nifanontoñe hiatrek’ amy Mosè naho i Aharone vaho nanoe’ iareo ty hoe, Loho bey ty vavea’ areo, amy te fonga miavake i valobohòkey naho am’ iareo iaby t’Iehovà. Aa ino ty irengevoha’ areo ambone’ ty fivori’ Iehovà?
౩మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు.
4 Ie jinanji’ i Mosè, le nibabok’ an-dahara’e,
౪మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,
5 nanao ty hoe amy Korahke naho o mpiama’e iabio: Hamaray ty hampiboaha’ Iehovà o azeo, ty miavake, le ie ty hampañarinea’e; toe i ho joboñe’ey ty hampitotofa’e.
౫“ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.
6 Ano zao: ry Korahke naho o mpiama’o iabio, andrambeso sadron’ afo,
౬కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.
7 le apoho ama’e ty afo naho andafiho embok’ añatrefa’ Iehovà hamaray vaho t’indaty joboñe’ Iehovà, ie ty hiavake. Fa loho maro ty vavea’ areo ry nte-Levio!
౭అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.
8 Le hoe t’i Mosè amy Korahke, Mitsendreña henaneo ry ana’ i Levio:
౮ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,
9 Loho kede ama’ areo hao t’ie nampiambahen’ Añahare’ Israele amo valobohò’ Israeleo hampañarinea’e, hitoloñe amy kivoho’ Iehovày ao, hijohañe añatrefa’ i valobohòkey hiatrak’ iareo,
౯తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
10 ie nampañarivoe’e ama’e mitraok’ amo rahalahi’o ana’ i Levio? Aa mbe hipay ho mpisoroñe ka v’iheo?
౧౦ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.
11 kanao mifanontoñe hiatreatre am’ Iehovà, ihe naho o mpiama’o iabio. Le i Aharone, inon-dre te injè’ areo?
౧౧దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు.
12 Nampañitrife’ i Mosè amy zao t’i Datane naho i Abirame ana’ i Eliabe, fa hoe iereo: Tsy homb’eo zahay!
౧౨మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
13 raha kede ama’o hao te nakare’o an-tane orikorihen-dronono naho tantele ao hanjamana’o am-patrambey atoy, mbore manao ho mpifehe anay?
౧౩కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
14 Ie amy zao tsy nendese’o amy ze o tane orikorihen-dronono naho tantele zao, tsy nampandovae’o anay ty teteke naho tetem-bahe. Aa vaho havitso’o am’ondaty retiañe o fihaino’ iareoo? Zahay tsy homb’eo!
౧౪అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు.
15 Niforoforo t’i Mosè le hoe re am’ Iehovà, Amoeo ty enga’ iareo. Mbe liako tsy nandrambe borìke raik’ am’ iereo vaho leo raik’ am’iereo tsy jinoiko.
౧౫అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు.
16 Le hoe t’i Mosè amy Korahke, Miatrefa am’ Iehovà, ihe naho o mpiama’oo—ihe naho iereo vaho i Aharone te maray;
౧౬అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.
17 songa mindesa sadron’ afo vaho apoho ama’e ty emboke, sindre hinday ty sadròn’ afo’e añatrefa’ Iehovà, sadron’ afo roanjato-tsi-limampolo; ihe naho i Aharone ka, sambe aman-tsadron’ afo.
౧౭మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.
18 Aa le fonga nandrambe ty sadron’ afo’e t’indaty, naho napo’e ama’e ty afo naho nandafihan’ emboke vaho nijohañe an-dalan-kibohom-pamantañañe eo mindre amy Mosè naho i Aharone.
౧౮కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.
19 Le navori’ i Korahk’ an-dalan-kibohom-pamantañañe ey i valobohòkey hiatreatre iareo. Nisodehañe amy màroy amy zao ty enge’ Iehovà.
౧౯కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.
20 Le hoe ty nitsara’ Iehovà amy Mosè naho i Aharone:
౨౦అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.
21 Mivevea amo valobohòkeo fa hampangotomomoheko aniany.
౨౧తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,
22 Nibabok’ an-dahara’e amy zao iereo nihalaly ty hoe, O Andrianañahare, Andrianañaharen’ arofo’ ze hene atao nofotse; hiviñera’o ami’ty lila’ ondaty raike hao i valobohòkey?
౨౨వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.
23 Aa le hoe ty nitsara’ Iehovà amy Mosè,
౨౩అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,
24 Saontsio amo valobohòkeo ty hoe: Iengao o kiboho’ i Korahke naho i Datane vaho i Abirameo.
౨౪“సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు.
25 Le niongake t’i Mosè nimb’amy Datane naho i Abirame mb’eo; nanonjohy aze o roandria’ Israeleo.
౨౫అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
26 Le sinaontsi’e amy valobohòkey ty hoe, Isitaho henaneo o kiboho’ ondaty lo-tsereke reroañe! Ko mitsapa ty raha’ iareo tsy mone ho faoheñe añe amo hakeo’ iareoo.
౨౬అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.
27 Aa le niviha’ iereo o kiboho’ i Korahke naho i Datane naho i Abirameo; le niakatse t’i Datane naho i Abirame vaho nijohañe an-dalan-kiboho’e eo rekets’ o tañanjomba’eo naho o ana’eo naho o amori’eo.
౨౭కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.
28 Le hoe t’i Mosè: Inao ty hahafohina’ areo t’ie nirahe’ Iehovà hanao o tolon-draha rezao, tsy te nisatriko:
౨౮అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
29 Aa naho mikoromake manahake ze hene ondaty, ondaty retiañe, naho ho tiliheñe hambañe ami’ ty fitilihañe ze kila ondaty, le tsy nirahe’ Iehovà iraho.
౨౯మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.
30 Fa naho manao raha vao t’Iehovà, naho sokafe’ o taneo ty vava’e, hampibotseke iareo naho ze hene a’ iareo vaho hivarigodam-beloñe mb’ an-tsikeokeok’ ao, le ho fohi’ areo te ninjè’ ondatio t’Iehovà. (Sheol )
౩౦కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు. (Sheol )
31 Ie vaho nimodo i saontsi’ey le nivalaetrake ambane’ iereo i taney,
౩౧మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.
32 vaho sinoka’ i taney ty vava’e le fonga nabea’e rekets’ o hasavereña’ iareoo, ze lahilahy mpiamy Korahke naho o vara’e iabio.
౩౨భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
33 Aa le nigodam-beloñe mb’ an-tsikeokeok’ ao iereo reke-panañañ’ iaby; nikitek’ ambone’e i taney, naho fa nimongoreñe amy valobohokey iereo. (Sheol )
౩౩వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. (Sheol )
34 Le nitriban-day iaby ze ana’ Israele narine eo, namantsiñe ty hoe, Ke hatele’ i taney ka zahay!
౩౪వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు.
35 Niboak’ am’ Iehovà amy zao ty afo nahaforototo ‘indaty roanjato-tsi-limampolo nañemboke rey.
౩౫అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
36 Le natoro’ Iehovà amy Mosè ty hoe:
౩౬అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.
37 Misaontsia amy Elazare ana’ i Aharone Mpisoroñe handrambesa’e o sadron’ afo boak’ amy afoio, le hampiparatsahe’e ey i afoy, fa miavake irezay.
౩౭ఆ నిప్పుని దూరంగా చల్లు.
38 Ampipeho ho endraendra hanaroñe i kitreliy o sadron’ afo’ ondaty rinotsan-kakeo ty fiai’iareoo, fa miavake amy te nengaeñe am’ Iehovà, le ho viloñe amo ana’ Israeleo.
౩౮పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.”
39 Aa le rinambe’ i Elazare mpisoroñe o sadron’ afo torisìke nengae’ i niforototoeñe reio, vaho nipepeheñe ho kape’ i kitreliy,
౩౯అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,
40 ho faniahiañe o ana’ Israeleo te tsy hitotoke mb’eo ty ondaty sotra tsy tarira’ i Aharone hañembok’ am’ Iehovà, tsy mone hanahake i Korahke naho o mpiama’eo, amy nitsara’ Iehovà am-pità’ i Mosèy.
౪౦కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.
41 Ie amy loakandroy le fonga niñeoñeoñe amy Mosè naho i Aharone i valobohòn’ ana’ Israeley ami’ty hoe, Fa zinama’ areo ondati’ Iehovào.
౪౧తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి,
42 Aa naho nifanontoñe i valobohòkey hiatreatre amy Mosè naho amy Aharone, f’ie nitolike mb’ an-kibohom-pamantañam-b’eo le hehe te nisaroña’ i rahoñey vaho niboake ty enge’ Iehovà.
౪౨సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.
43 Aa le niheo mb’ aolo’ i kibohom-pamantañañey mb’eo t’i Mosè naho i Aharone.
౪౩మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,
44 Le nitsara amy Mosè t’Iehovà nanao ty hoe:
౪౪యెహోవా మోషేతో “మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,
45 Isitaho o valobohòkeo hamorototoako aniany. Ie nibabok’ an-daharañe,
౪౫తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.
46 le hoe t’i Mosè amy Aharone, Angalao sadron’ afo le apoho ama’e ty afo boak’ amy kitreliy, le ampipoho emboke naho mihitrifa masìka mb’amy valobohòkey ho fijebañañe iareo amy te niboak’ am’ Iehovà ty fombo vaho fa namototse i angorosiy.
౪౬అప్పుడు మోషే “నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది” అని అహరోనుతో చెప్పాడు.
47 Aa ie mbe nisaontsy t’i Mosè, le rinambe’ i Aharone izay le nipitsik’ an-day naneñateña i valobohòkey; naho tendreke te niorotse am’ ondatio i angorosiy; Napo’e ama’e ty emboke vaho nijebañe ondatio.
౪౭మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
48 Aa ie nijohañe añivo’ o mateo naho o veloñeo le nijihetse i angorosiy.
౪౮అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.
49 Rai-ale-tsi-efats’ arivo-tsi-fitonjato ty nivetrak’ amy andro zay mandikoatse o nikoromak’ amy Korahkeio.
౪౯కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.
50 Ie nijihetse i angorosiy le nibalike mb’ amy Mosè t’i Aharone mb’an-dalan-kibohom-pamantañañe mb’eo.
౫౦ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.