< Fitomaniana 2 >
1 Hedèy te nakopo’ i Talè an-drahoñe ao t’i Tsione amy haviñera’ey! Naretsa’e boak’ an-dikerañey pak’ an-tane eo ty hatsomerentsere’ Israele, vaho nandikofa’e ty fatimpaha’e amy androm-pifomboa’ey.
౧ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.
2 Fa nagedra’ i Talè tsy aman-tsehanga’e o kiboho’ Iakobeo, vaho tsy niferenaiña’e; fa nafetsa’e ambane eo o kijoly fatrats’ i anak’ ampela’ Iehodàio; ie nafotsa’e an-tane; tiniva’e i fifeheañey naho o roandria’eo.
౨యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
3 Fa naitoa’e an-kaviñerañe mena ty tsifa’ Israele; nasita’e aolo’ i rafelahiy ty fità’e havana; vaho finorototo’e hoe afo misolebatse t’Iakobe, afo mangotomomoke mb’eo mb’eo.
౩తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.
4 Nabitso’e hoe rafelahy ty fale’e, najado’e hoe ravetro ty fità’e, vaho zinama’e iaby ze nisoa am-pihaino; an-kivoho’ i anak’ampela’ i Tsioney ty nampidoandoaña’e ty haviñera’e hoe afo.
౪ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు. ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు. సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు.
5 Fa ninjare rafelahy t’i Talè henanekeo, fa nigenohe’e t’Israele; hene nabea’e o sokemitraha’eo, rinotsa’e o fipalirañe fatratseo; vaho nampitomboe’e amy anak’ampela’ Iehodày ty fangololoihañe naho fandalàñe.
౫ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
6 Hinatsakatsa’e i kivoho’ey hoe t’ie nigoloboñe; nampiantoe’e i toem-pivori’e namotoañañey; nampahaliñoe’ Iehovà e Tsione ao o Famantañañeo naho o Sabatao, vaho ninjè’e ami’ty fitorifiha’ i fifomboa’ey i mpanjakay naho o mpisoroñeo.
౬ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.
7 Navokovoko’ i Talè i kitreli’ey, nampangorìñe Aze i toe’e niavakey; napo’e am-pitan-drafelahy o rindrin’ anjombao: ie nikorake añ’anjomba’ Iehovà ao, manahake te añ’androm-pivory miavake.
౭ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు. తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు. దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు. ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు.
8 Sinafiri’ Iehovà ty handrotsake ty kijoli’ i anak’ ampela’ i Tsioney; fa kinazazà’e ty taly, tsy nampoli’e ty fità’e tsy handrotsake; nampirovete’e iaby ty fahañe naho ty rindriñe; mitrao-pinìke iereo.
౮సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.
9 Nalentek’ an-tane ao o lalam-bei’eo; fa rinotsa’e vaho pinoza’e o sikada’eo; songa an-tane tsy mitan-Kàke i mpanjaka’ey naho o roandria’eo; eka tsy manjo aroñaroñe boak’ am’ Iehovà o mpitoki’eo.
౯యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.
10 Mitozòke an-tane eo ty androanavi’ i Tsione, mijomohoñe, nampibobò deboke añ’ambone’eo; midian-gony am-baniañe; miondre-doha’ mb’an-tane o somondrara mieha’ i Tsioneo.
౧౦సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.
11 Milesa o masokoo ty amo ranomasoo, mioremeñe ty troko; fa nadoañe an-tane ty ateko, ty amy fandrotsahañe i anak’ampela’ ondatikoy, ty amo anak’ajajao naho o mpinono mitoirañe an-dalan-drovao;
౧౧నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా అంతరంగం కలవరంతో ఉంది. నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి. పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు.
12 Hoe iereo aman-drene, aia ty tsako naho ty divay? ie tsipike hoe mate an-dala’ i rovay ey ie midoañe añ’arañan-drene’e ao ty fiai’ iareo.
౧౨పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.
13 Akore ty havereko azo? Añoharako ami’ty inon-drehe ry anak’ ampela’ Ierosalaime? Ino ty hañirinkiriñako ama’o hañohòako azo, ry anak’ampela’ i Tsione? Fa mienene manahake i riakey ty fere’o, ia ty hahamelañe azo?
౧౩యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?
14 Nahaisak’ aroñarom-bande naho hagegeañe ho azo o mpitoki’oo; vaho tsy nabora’ iareo o tahi’oo, hampipoliañe azo boak’an-drohy ao, fa fetsen-dremborake ty niisa’ iareo, toe talim-pandroahañe.
౧౪నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.
15 Songa miteha-pitañe ama’o ze miary eo; sindre mikosake naho mikofikofi-doha amy anak’ampela’ Ierosalaimey manao ty hoe: Itoy hao i rova nitokaveñe ty hoe: Fahafoniran-Kasoa Vintañe, ty firebeha’ ty tane-bey toiy?
౧౫దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
16 Nampidañadaña falie ama’o o fonga malaiñe azoo; mikosasàke naho mikodrìtse nife manao ty hoe: Fa nabean-tika; itoy ‘nio i andro nitaman-tikañey, fa tendreke, le isake.
౧౬నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.
17 Fa nanoe’ Iehovà i naereñere’ey; fa nihenefa’e i fetse najado’e añ’andro taoloy; fa naretsa’e ambane eo le tsy niferenaiña’e; vaho nampirebehe’e ama’o o rafelahi’oo; naonjo’e ty tsifa’ o malaiñ’azoo.
౧౭తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.
18 Mitoreo añ’arofo amy Talè iereo: O ry kijoli’ i anak’ampela’ i Tsioney, ampikararaho ranomaso hoe sorotombake handro an-kaleñe; ko ampahazoe’o fiaiñe ty fañova’o; ko ampitofa’o o fihaino’oo.
౧౮ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ. “సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు. జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు.
19 Miongaha, mikoeaha te haleñe, ami’ty fiorota’ o fijilovañeo; adoaño ty arofo’o hoe rano añatrefan-dahara’ i Talè; añonjono fitañe ama’e ho ami’ty fiai’ o keleia’o mitoirañe ami’ty kerè an-doha o lalañeo iabio.
౧౯రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
20 Hehe ry Iehovà biribirio: ia o nanoa’o o raha zaoo? Habotse’ o rakembao hao o tolin-tsabo’eo? o ajaja otroñe’e am-pitàñeo? Ho zamaneñe an-toe’ i Talè miavak’ ao hao ty mpisoroñe naho ty mpitoky?
౨౦యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
21 Ty tora’e naho ty androanavi-bey, songa màndre an-tane an-dalañe eo; o somondrarakoo naho o ajalahikoo, fonga zinevo’ i fibaray; binaibai’o amy andron-kaviñera’oy zinama’o fa tsy niferenaiña’o.
౨౧యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
22 Kinoi’o hoe añ’androm- pivory miavake, o hekoheko miariseho ahikoo; vaho leo raike tsy nahabotatsake, tsy nanisañe amy andron-kaviñera’ Iehovày; o notroñekoo naho nibeizekoo ro fonga nabea’ i rafelahiy.
౨౨ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.