< Isaia 63 >
1 Ia o mb’atoy hirik’ Edome, reketse lambam-Botsrà nimenaeñeo? i minday engeñe amo saro’eoy, i maràm-bintañ’ ami’ty ha’ra’elahin-kaozara’ey? —Izaho mivolañe ami’ty hatò, fatratse te handrombake.—
౧ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి.
2 Aa vaho ino ty mahamena o saro’oo, naho ty sarimbo’o, manahake ty mpandia divay an-tsajoa ao?
౨నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి?
3 Izaho avao ty nandialia i fanindrian-divaiy, fa ondatio, leo raike tsy nimpiamako; eka ho liàko ami’ty fifomboko, naho hatsafeko ami’ty fiforoforoako; naho nifitse amo sikikoo ty lio’ iareo vaho hene kinomatraoko o sarokoo,
౩ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే.
4 Toe androm-pañavahañe ty an-troko ao, fa tondroke ty taom-pijebañako.
౪పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.
5 Nenteako te tsy teo ty hañolotse, niisako an-kalatsañe fe tsy teo ty hanozañe; aa le ty tañako avao ty ninday fandrombahañe ho ahiko, nanozañ’ahy ty fifomboko.
౫సాయం చేసేవాడి కోసం చూశాను. ఎవరూ రాలేదు. ఎవడూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే నా హస్తమే నాకు విజయం సాధించిపెట్టింది. నా ఆగ్రహం నన్ను నడిపించింది.
6 Le niliako an-kaboseke ondatio, naho nimamoeko am-poroforo, vaho naretsako an-tane ty haozara’ iareo.
౬కోపంతో ప్రజలను తొక్కేశాను. నా ఆగ్రహంతో వారికి మత్తెక్కించాను. వారి రక్తాన్ని నేల పారబోశాను.
7 Ho taroñeko ty fiferenaiña’ Iehovà, naho ty fijejoañe Iehovà, ty amo hene raha fanjàka natolo’ Iehovà antikañeo, naho i fatariha’e ra’elahy amy anjomba’ Israeley, i natolo’e iareo ty amo fitretreza’eoy naho amo fiferenaiña’e bey heneheneo,
౭యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను.
8 amy natao’e, ty hoe; Toe ondatiko iereo, anake tsy handañitse; Ie ro nandrombake iareo.
౮అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.
9 Amo haferenai’ iareo iabio, le niferenaiña’e, naho nandrombake iareo ty anjelim-piatrefa’e; ty fikokoa’e, toe i haleñ’arofo’ey ty nijebaña’e iareo naho notroñe’e vaho nivavè’e amo hene andro taoloo.
౯వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.
10 Fe niola iereo, nanjehatse amy Arofo’e masiñey; aa le nifotetse re ho rafelahi’ iareo; ie avao ty nialy am’ iereo.
౧౦అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.
11 Nitiahi’ ondati’eo amy zao o andro taolo faha’ i Mosèo: Aia i nampitroatse iareo amy riakey rekets’ i mpiara-lia-rai’eiy? Aia i nampijoñe i Arofo’e Masiñey am’ iereoy?
౧౧ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?
12 ie nanehake ty fitàn-kavana’ i Mosè am-pità’e lifots’engeñey; ie nandriatse i rano aolo’ iareoy, hanoe’e tahinañe tsy modo ho aze;
౧౨మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?
13 ie niaolo iareo hitsake i lalekey hoe te soavala ampatrañey, tsy hitsikapy?
౧౩తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి? లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు.
14 Manahake ty fizotsoan’ añombe mb’am-bavatane mb’eo, ty nampitofà’ i Arofo’ Iehovà iareo; izay ty niaoloa’o ondati’oo, hanoe’o tahinañe bey volonahetse.
౧౪లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు. నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు.
15 Mijilova boak’ andikerañ’añe, mivazohoa boak’ amy akiba’o miavake lifots’engeñey; aia ty fahimbaña’o, naho o haozara’o ra’elahio, ty fitrekotrekon-kovi’o, naho o fiferenaiña’o ahio? nisebaneñe hao?
౧౫పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి.
16 Ihe ro Rae’ay; ndra te nofi’ i Avrahame naho amoea’ Israele; Ihe ry Iehovà ro Rae’ay, i Mpijebañe Anay Haehaey ro tahina’o.
౧౬అయితే మా తండ్రివి నువ్వే. అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా.
17 O ry Iehovà, ino ty ampandilara’o anay o lala’oo naho mampigañe ty tro’ay tsy hañeveñe ama’o? Mibaliha amo mpitoro’oo, amo fifokoan-dova’oo.
౧౭యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు? మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా.
18 Didý tsy ho rinoa’ iareo ondaty navahe’o iabio, fa linialia’ o rafelahi’aio i toe’o miavakey
౧౮నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు.
19 Fa ninjare hoe mbe lia’e tsy nifehe’o zahay, amy te tsy nitokaveñe amy Tahina’oy.
౧౯నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.