< Genesisy 28 >
1 Tinoka’ Ietsàk’ amy zao t’Iakòbe naho tinata’e vaho nafanto’e ami’ty hoe, Ko mañenga valy amo anak’ ampela nte-Kanàneo.
౧ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.
2 Mionjona mb’e Padan’ arame, mb’añ’ anjomba’ i Betoele, raen-drene’o añe, vaho mañengà amo anak’ampela’ i Labàne, rahalahin-drene’oo.
౨నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో
3 Ehe te hitahy azo t’i El-Sadai, hampibodobodo naho hañamaro azo, soa te ho firimboñam-pifokoañe.
౩సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా
4 Le hatolo’e azo naho amo tarira’o mindre ama’oo o fitahiañe i Avrahameo, handovà’o i tane maha-renetane azoy, i natolon’ Añahare amy Avrahamey.
౪ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు.
5 Aa le nirahe’ Ietsàke mb’ eo t’Iakòbe, hañavelo mb’e Padan’ arame, mb’ amy Labàne ana’ i Betoele nte-Arame, rahalahi’ i Ribkae rene’ i Esave naho Iakòbe añe.
౫అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ.
6 Ie nirendre’ i Esave te nitatae’ Ietsake t’Iakòbe naho nirahe’e mb’e Padan’ arame mb’eo hañenga valy boak’añe, ie nitata aze ro namantoke ty hoe, Ko mañenga amo anak’ ampela’ i Kanàneo,
౬ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.
7 le nihaoñe’ Iakòbe i nafanton-drae’e naho i rene’ey vaho nitaveañe mb’e Padan’ Arame añe,
౭యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ,
8 le napota’ i Esave te tsy nòn-drae’e Ietsake o anak’ ampela’ i Kanàneo;
౮ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు.
9 aa le nimb’ am’ Iesmaèle mb’eo re nañenga i Makalate, rahavave’ i Nebaiote, ana’ Iesmaèle ana’ i Avrahame, ho tovo’ o vali’eo.
౯అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు.
10 Nienga i Beersevà t’Iakòbe naho nionjo mb’e Kharane añe.
౧౦యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ
11 Ie nahaisake toetse, le nialeñe ao fa nimotake i àndroy. Nangalak’ amo vato eio re naho napo’e ho ankala’ ty añambone’e vaho nandre niròtse amy toetsey.
౧౧ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.
12 Nañinofy re, le ingo ty fanongà nitroatse an-tane eo, ty ambone’e naha-takatse an-digiligin-dikerañe eñe vaho inge, niañambone naho nizotsoa’ o anjelin’Añahareo.
౧౨అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
13 Naheo’e te nijohañe ambone’e ey t’Iehovà, nanao ty hoe: Izaho Iehovà Andrianañaharen-drae’o Avrahame naho Andrianañahare’ Iets’ake. Hatoloko azo naho amo tarira’oo o tane andrea’o henaneo.
౧౩యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.
14 Ho mira ami’ty debo’ ty tane toy o tarira’oo, ie hangetseketseke mañandrefa naho maniñana naho mañavaratse vaho mañatimo, le ihe naho o tarira’oo ro hitahiañe ze hene hasavereña’ ty tane toy.
౧౪నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.
15 Inao, mpindre ama’o iraho, hañambeñe azo ndra aia’aia ty hañaveloa’o, vaho hampoliko an-tane atoy, le tsy hieng’ azo naho tsy henefeko o vinolako ama’oo.
౧౫ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.
16 Ie nivañoñe amy firota’ey t’Iakobe le hoe re, Toe an-toetse atoy t’Iehovà fe tsy napotako.
౧౬యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు.
17 Nihemban-dre le nanao ty hoe, Akore ty harevendreveñañe etoañe! Ts’inoñe naho tsy anjomban’ Añahare ty etoa vaho itoy i lalambein-dikerañey.
౧౭అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
18 Nitroatse marain-tsikiake t’Iakòbe le rinambe’e i vato napo’e ho ankala’ ty añambone’ey naho natroa’e ho ajiba, vaho nañiliña’e solike ambone’e eo.
౧౮పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.
19 Natao’e ty hoe Betele ty añara’ i toetsey, fa nitokaveñe ty hoe Loze i tanàñey taolo.
౧౯అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.
20 Nifanta amy zao t’Iakòbe ami’ty hoe, Naho hañimbañ’ ahiko t’i Andrianañahare, hañaro ahy ami’ty liako toy naho hamahañe ahy hànen-ko haneñe naho lamba hisikinañe,
౨౦అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,
21 hibalihako an-kanintsiñe mb’añ’ anjomban-draeko añe, le ho Andrianañahareko t’Iehovà,
౨౧తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.
22 naho ho anjomban’ Añahare ty vato natroako ho ajiba toy, vaho toe homeako Azo ty faha-folo’ ze hene hatolo’o ahiko.
౨౨అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.