< Ezekiela 38 >
1 Le niheo amako ty tsara’ Iehovà nanao ty hoe:
౧యెహోవా నాతో ఇలా చెప్పాడు.
2 O ana’ondatio, atrefo ty Goge an-tane’ i Magoge, roandria’ ty rova-bey Meseke naho i Tobale vaho itokio
౨నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు.
3 ami’ty hoe: Inay ty nafè’ Iehovà Talè, Inao ry Goge, roandria’ ty rova bei’ i Meseke naho i Tobale t’ie atrefeko;
౩“ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుడవైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
4 hampibaliheko naho ho porengoteko o valañorà’oo, vaho ho kozozoteko mb’eo rekets’ o lahindefo’o iabio, soavala naho mpiningitse, songa misikiñe fikalañe, valobohòke jabajaba songa an-kalan-defo naho fañaro-sirañe, sambe mitam-pibara.
౪నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను.
5 Hitraok’ am’iareo t’i Parase, i Kose vaho i Pote, songa amam-pikalañe naho fañaron-doha.
౫నీతో కూడ పర్షియా, కూషు, పూతు దేశాల వారినీ డాళ్ళు, శిరస్త్రాణాలు ధరించే వారినీ బయలుదేరదీస్తాను.
6 I Gomere naho ze hene lian-dahin-defo’e; ty anjomba’ i Togarmà boak’ an-tsietoitane avaratse añe naho ze fonga firimboña’e naho ondaty maro mihipok’ ama’oo.
౬గోమెరు, అతని సైన్యం, ఉత్తరాన ఉండే తోగర్మా, అతని సైన్యం, ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు.”
7 Mañalankàña, le mihentseña, ihe naho o valobohòke nifanontone ama’oo, vaho ifeheo!
౭“నీవు సిద్ధంగా ఉండడమే కాక, నీతో కలిసిన ఈ సమూహమంతటిని సిద్ధపరచి వారికి నాయకత్వం వహించు.
8 Ie modo ty andro maro le ho tilihen-drehe hitoroñe amy figadoñan-taoñey, haname i tane nivotsoreñe amy fibaraiy, o hinoloholo amo kilakila’ ndatioo, mb’ am-bohibohi’ Israele mb’eo, ie nainai’e niratraratra; f’ie nakareñe amo fifelehañe maroo vaho songa miaiñ’ añoleñañe.
౮చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.
9 Hionjom-beo hoe tio-bey irehe hanahake rahoñe manaroñe i taney, ihe naho ze hene firimboña’o naho o valobohòke mihipok’ ama’oo.
౯గాలివాన వచ్చినట్టు, మేఘం కమ్మినట్టు నీవు ఆ దేశం మీదికి వస్తావు. నీవు, నీ సైన్యం, నీతో కలిసిన విస్తారమైన జనాలు ఆ దేశం మీద కమ్ముకుంటారు.”
10 Hoe ty nafè’ Iehovà Talè: hifetsak’ amy andro zay, te, hionjo-mb’ añ’ arofo’o ao ty saontsy, hikitrok’ an-tsafiry raty:
౧౦ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఆ కాలంలో నీ మనస్సులో చెడు తలంపులు కలుగుతాయి.
11 hanao ty hoe: Hionjoñe mb’amy tane aman-tanañe tsy aman-kijoliy iraho; haname o mitofao, o miaiñañoleñañeo, o songa mimoneñe tsy mifahetseo, tsy misikadañe tsy aman-dalambey,
౧౧నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.
12 hikopahako naho hitsindrohako, hampitoliha’o fitàñe mb’amo tane nangoakoake fa imoneñañeo naho mb’am’ ondaty natontoñe amo kilakila’ ndatio, ie aman’ añombe naho vara, mpimoneñe añivo’ ty tane toy.
౧౨గతంలో పాడై మళ్ళీ నివాసయోగ్యమైన స్థలాల మీదికి వెళ్ళి, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకుంటాను. వివిధ జనాల్లోనుండి తిరిగివచ్చి, పశువులు, ఆస్తులు సంపాదించి, భూమి నట్టనడుమ నివసించే ప్రజల మీదికి వెళ్తాను.
13 Hañontane azo t’i Seba naho i Dedane naho o mpanao balibali’ i Tarsise, rekets’ o ana-donak’ama’eo, Nivotrake eo hitavane vara hao? Nampirimboñe valobohòke hitsindroke hao, hitarazo volafoty naho volamena mb’eo, hinday hare naho kilankañe, hitavane fikopaham-bey?
౧౩సెబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, వారి యోధులందరు నిన్ను చూసి “సొమ్ము దోచుకోడానికి వచ్చావా? కొల్లగొట్టడానికీ వెండి బంగారాలు, పశువులు, సరుకులు పట్టుకుపోడానికీ సైన్యం సమకూర్చుకుని వచ్చావా?” అని అడుగుతారు.
14 Aa le mitokia, ry ana’ ondatio, taroño amy Goge ty hoe: Inao ty nafè’ Iehovà Talè: Amy andro hiaiñañoleña’ ondatiko Israeleoy; tsy ho fohi’o hao?
౧౪“కాబట్టి నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించే సమయం కనిపెట్టావు కదా?
15 Le hitandroake eo irehe boak’ an-toe’o añ’ila avaratse añe, ihe rekets’ ondaty mitozantozañe, songa miningi-tsoavala, valobohòke jabajaba vaho firimboñan-dahindefon-dra’elahy,
౧౫దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి
16 haname ondatiko Israeleo hoe rahoñe mampikopoke i taney, amo andro honka’eo, ie hendeseko mb’an-taneko mb’eo, hahafohina’ o kilakila’ndatio ahy, le havahen-draho ty ama’o añatrefam-pihaino’ iareo eo, ry Goge.
౧౬మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.”
17 Aa hoe ty nafè’ Iehovà Talè: Tsy ihe hao ty nampisaontsieko o mpitorokoo, o mpitoki’ Israeleo, ie nitoky tañ’ andro izay t’ie tsy mete tsy ho tehafeko mb’am’ iereo mb’eo?
౧౭ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే “గతంలో ప్రతి సంవత్సరం నిన్ను వారిమీదికి రప్పిస్తానని నా సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చింది నేనే గదా?
18 Aa amy sa-panamea’ i Goge ty tane Israeley, hoe t’Iehovà Talè: hitroatroake ty fiforoforoako.
౧౮ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
19 Fa ty famarahiako naho fifomboko ty nivolañako, Toe ho fañozokozoñañe jabajaba ty an-tane’ Israele ao amy andro zay,
౧౯“కాబట్టి నేను రోషంతో, మహా రౌద్రంతో ఈ విధంగా ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేశంలో గొప్ప భూకంపం కలుగుతుంది.
20 kanao sindre hititititike añatrefako eo ze fiañe an-driak’ ao naho o voron-dikerañeo, naho o bibin-kivokeo, naho ze raha milalilaly misitsitse an-tane eo, naho ze kila ondaty ambone’ ty tane toy, mbore hihotrake o vohitseo, hihintsañe o tevañeo vaho hikoromak’ an-tane eo ze kijoly iaby.
౨౦సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి.
21 Le ho ikoiheko fibara ambone’ o haboako iabio, hoe t’Iehovà Talè; vaho fonga hañatsake ty rahalahi’e ze fibara’ ondaty.
౨౧నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
22 Hizakako añ’ angorosy naho an-dio, naho hampahavieko ama’e naho amo mpirai-lia’eo naho amo valobohòke mindre ama’eo ty orañe mampiòpo, naho ty havandra gadaboñe, vaho ty afo amam-ponde.
౨౨తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను.
23 Le honjoñen-dRaho naho havaheñe naho ho rendrem-pihainom-pifeheañe maro, vaho ho fohi’ iareo te Izaho Iehovà.
౨౩అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.