< Asan'ny Apostoly 18 >
1 Ie añe, le nienga i Atena t’i Paoly mb’e Korinto mb’eo.
౧ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు.
2 Le tendreke ty Jiosy atao Akoila, nisamak’ e Ponto, ie vaho nivotrake boak’e Italia rekets’ i Prisilae, vali’e, (ami’ty nandilia’ i Klaodio te hakareñ’ amy Roma ze atao Jiosy.) Le niheova’e,
౨పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు.
3 aa kanao nihamban-tolon-draha, le nimoneñe am’ iereo ao, nitrao-pitoroñe, fa sindre mpamboatse lamban-kibohotse.
౩వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
4 Boa-tSabotse re nañoke am-pitontonañe ao, nandrekets’ o Jiosio naho o Grikao.
౪అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు.
5 Ie pok’eo boake Makedonia añe t’i Silasy naho i Timoty, le nazìn’ arofo t’i Paoly hitaroñe amo Jiosio te Iesoà i Norizañey.
౫సీల, తిమోతిలు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్కు బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. అతనిలో ఆత్మ కలిగించే ఆసక్తివల్ల యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్షమిస్తున్నాడు.
6 Aa ie nandietse naho nanivetive avao, le nakopi’e o saro’eo, nanao ty hoe: Ami’ty añambone’ areo o lio’ areoo! Malio iraho, fa homb’ amo kilakila ondatio henane zao.
౬ఆ యూదులు అతనిని ఎదిరించి దూషించారు. అతడు తన బట్టలు దులుపుకుని, “మీ రక్తం మీ తలమీదే ఉండుగాక. నేను నిర్దోషిని. ఇక నుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాను” అని వారితో చెప్పి
7 Niakatse re, niheo mb’ añ’ anjomba’ ty atao Titosy Josto, mpitalaho aman’ Añahare, ie nipitek’ amy fitontonañey i anjomba’ey.
౭అక్కడ నుండి వెళ్ళి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుని ఉంది.
8 Niantoke i Talè t’i Krispo, bei’ i fitontonañey, naho o añ’ anjomba’e iabio; le maro amo nte-Korinto ro nahajanjiñe naho niato vaho nalipotse.
౮ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు.
9 Nañento i Paoly haleñe añ’ aroñaroñe t’i Talè, ami’ty hoe: Ko hembañe, fa mitaròña, le ko mianjiñe,
౯ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.
10 amy te mindre ama’o iraho vaho tsy ao ty hiambotrak’ ama’o hijoy, fa maro ty ondatiko an-drova atoy.
౧౦ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు.
11 Aa le nitoloñe ao taoñe raike tsy enem-bolañe re nañoke o tsaran’ Añahareo am’iareo.
౧౧అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.
12 Ie nimpifehe’ i Akaia t’i Galio, le nifandrimboñe o Tehodao nañoridañe i Paoly, vaho nasese’ iareo mb’an-jaka.
౧౨గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు.
13 T’indaty tìañe, hoe iareo, manigìke ondatio hitalaho aman’ Añahare am-pirangañe Hake.
౧౩“వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు” అని ఆరోపణ చేశారు.
14 Ie fa ho nanoka-palie t’i Paoly, le hoe t’i Galio amo Tehodao, Naho ie mioza an-dilatse ndra halolòañe, ry Tehodao, le ho nitò te nifeahako.
౧౪పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, “యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే.
15 Fe kanao ontane ty amo tsarao naho o tahinañeo vaho i lili’ areoy—le mifandahara, fa tsy ho zakaeko.
౧౫ఇది ఏదో ఉపదేశం గురించో, పేరుల గురించో, మీ ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు” అని యూదులతో చెప్పి
16 Le rinoa’e hisitak’ amy fiambesam-pizakañey.
౧౬వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు.
17 Aa le niambotraha’ i màroy t’i Sostena, bei’ i fitontonañey le kinabokabo’ iereo añatrefa’ i fiambesam-pizakañey, fe tsy nihaoñe’ i Galio.
౧౭అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
18 Ie nitambatse ela ao t’i Paoly, le niavotse amo roahalahio, vaho nijon-dàkañe mb’e Sirià añe mindre amy Prisilae naho i Akoila, ie fa nihitsife’e e Kenkrea ao hey o maroi’eo ami’ty fanta nanoe’e.
౧౮పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.
19 Ie nivotrake Efesosy añe, le nenga’e eo iereo, vaho nizilik’ am-pitontonañ’ ao nifañotsohotso amo Jiosio.
౧౯వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
20 Nihalalie’ iereo t’ie hitambatse ao, fe tsy nimete.
౨౦వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
21 Fa hoe re amy fienga’ey: Tsy mete tsy ambenako e Ierosaleme ao i sabadidake fa antitotsey, f’ie hibalike naho non’ Añahare; le nijon-dakañe Efesosy ao.
౨౧అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
22 Ie nandoake e Kaisaria añe, le nionjoñe mb’eo nifañontane amy Fivoriy, vaho nizotso mb’e Antiokia mb’eo.
౨౨తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.
23 Teo hey re, vaho nienga nañariary an-tane Galate naho e Frigià añe nampaozatse o mpiòke iabio.
౨౩అక్కడ కొంతకాలం ఉన్న తరువాత బయలుదేరి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు.
24 Ie amy zao nivotrake Efesosy ao ty Jiosy atao Apolosy, nte Aleksandria; ondaty fonitse hilala, maozatse amo Sokitse Masiñeo.
౨౪అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.
25 Toe naòke ami’ty lala’ i Talè indatiy, le naringatse an-troke, nitalily naho nañanatse Iesoà an-katò, fe ty fampilipora’ i Jaona avao ty nifohi’e.
౨౫అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు.
26 Niorotse nilañoñe an-kasibehañe am-pitontonañ’ao re; aa naho nahajanjiñe aze t’i Prisilae naho i Akoila, le natola’ iareo, vaho nampalangesañe an-katò o satan’ Añahareo.
౨౬ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకుని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు.
27 Ie nisalalae’e ty homb’ Akaia mb’eo, le nirisihe’ o roahalahio an-tsokitse o mpiòke añeo ty handrambe aze. Ie pok’ eo le vata’e nimbae’e o nahafiato amy hasoaio.
౨౭తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు.
28 Amy te niliere’e an-ozatse am-batraike ey o Jiosio le naboa’e amo Sokitse Masiñeo te toe Iesoà i Norizañey.
౨౮లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.