< Salamo 143 >
1 Salamo nataon’ i Davida.
౧దావీదు కీర్తన యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
2 Ary aza dia mifandahatra amin’ ny mpanomponao eo am-pitsarana; Fa tsy misy olombelona ho marina eo anatrehanao.
౨నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు.
3 Fa nanenjika ny fanahiko ny fahavalo; Namely ny aiko ho lavo tamin’ ny tany izy: Nampitoeriny tao amin’ ny maizina aho, toy izay efa maty ela.
౩నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు. నన్ను నేలకేసి తొక్కిపెట్టాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళతో బాటు నన్ను కూడా పాతాళంలో ఉండిపోయేలా చేయాలని చూస్తున్నాడు.
4 Dia reraka ny fanahiko ato anatiko; Fadiranovana ny foko ato anatiko.
౪నా హృదయం నాలో నిరాశకులోనైంది. నా ఆత్మ నాలో క్షీణించిపోయింది.
5 Mahatsiaro ny andro fahiny ho Ary misaina ny asanao rehetra; Ny asan’ ny tananao no eritreretiko.
౫పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
6 Mananty tanana aminao aho; Ny fanahiko dia tahaka ny tany mangetana eo anatrehanao. (Sela)
౬నీ వైపు నా చేతులు ఆశగా చాపుతున్నాను. ఎండి నెర్రెలు విచ్చిన నేలలాగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతూ ఉంది. (సెలా)
7 Faingàna hamaly ahy, Jehovah ô, fa reraka ny fanahiko; Aza manafina ny tavanao amiko, Fandrao ho tahaka izay midìna any am-pasana aho.
౭యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
8 Ampandreneso ny famindram-ponao aho nony maraina, Fa Hianao no itokiako; Ampahalalao ahy izay lalana tokony halehako, Fa aminao no ananganako ny fanahiko.
౮నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
9 Jehovah ô, vonjeo amin’ ny fa-havaloko aho; Ao aminao no iereko.
౯యెహోవా, నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించు. నీ అండనే కోరుతున్నాను.
10 Ampianaro hanao ny sitraponao aho; Fa Hianao no Andriamanitro; Aoka ny Fanahinao tsara no hitarihanao ahy amin’ izay tany marina.
౧౦నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
11 Noho ny anaranao, Jehovah ô, velomy aho; Araka ny fahamarinanao avoahy ny fanahiko ho afaka amin’ ny fahoriana.
౧౧యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.
12 Ary araka ny famindram-ponao fongory ny fahavaloko, Ka aringano izay rehetra mampahory ny fanahiko; Fa mpanomponao aho.
౧౨నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి.