< प्रकाशित वाक्य 14 >
1 तिना गल्ला ते बाद मैं नजर दित्ती और देखो, से मिन्टू सिय्योनो रे पाह्ड़ो पाँदे खड़ी रा। और तेस साथे एक लाख चवाल़ी ह्जार जणे ए, जिना रे माथे पाँदे तेसरा नाओं और पिते रा नाओं लिखी राखेया।
౧తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.
2 और स्वर्गो ते माखे एक एड़ी आवाज सुणी, जो बऊत सारे पाणिए री और बड़ी गिड़ने री जी आवाज थी और जो आवाज मैं सुणी, से एड़ी थी, मानो बीणा बजाणे वाल़े बीणा बजाओए।
౨అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
3 सेयो एक लाख चवाल़ी ह्जार लोक सिंहासनो सामणे और चारो प्राणिया सामणे और बुजुर्गा सामणे, मानो ये नया गाणा गाणे लगी रे थे और तिना एक लाख चवाल़ी ह्जार जणेया खे छाडी की, जो तरतिया पाँदा ते मोले लयी राखे थे, कोई से गाणा नि सिखी सको था।
౩వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
4 ये एक लाख चवाल़ी ह्जार सेयो लोक ए, जो जवाणसा साथे अशुद्ध नि ऊए, पर कुआँरे ए, यो सेयो ईए कि जेती केथी मिन्टू जाओ था, सेयो तेस पीछे चली पड़ो थे। यो तो परमेशर और मिन्टूए खे पईले फल़ो जेड़े मांणूआ बीचा ते मोले लयी राखे।
౪వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు.
5 तिना रे मुंओ ते कदी चूठ नि निकल़ेया, सेयो निर्दोष ए।
౫అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
6 तेबे मैं एक ओर स्वर्गदूत सर्गो रे उड़दा ऊआ देखेया, जेसगे तरतिया रे रणे वाल़ेया री हर जाति, कुल़, पाषा और लोका खे सुनाणे खे सदा कालो रा ईश्वरीय सुसमाचार था। (aiōnios )
౬అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. (aiōnios )
7 और तिने जोरे की बोलेया, “परमेशरो ते डरो और तेसरी महिमा करो, कऊँकि तेसरे न्याय करने रा बखत आयी पऊँछी रा। और तेसरी भक्ति करो, जिने स्वर्ग, तरती, समुद्र और पाणिए रिया सूबल़ा बणाईया।”
౭అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.
8 तेबे इजी ते बाद एक ओर दूजा स्वर्गदूत ये बोलदा ऊआ आया, “रुड़ी गा, से बड़ा बेबीलोन रुड़ी गा, जिने आपणे व्याभिचारो री कोपमय शराब सबी जातिया खे पल़याई।”
౮వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.
9 तेबे इना ते बाद एक ओर तीजा स्वर्गदूत जोरे की ये बोलदा ऊआ आया, “जो कोई तेस डांगर और तेसरी मूरता री पूजा करो और आपणे माथे रे या आपणे आथो रे तेसरी छाप लओ,
౯తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా
10 तो तेस परमेशरो रे प्रकोपो री छुदी शराब, जो तेसरे रोषो रे कटोरे रे पाई राखी, पीणी और पवित्र स्वर्गदूता सामणे और मिन्टूए सामणे आग और गन्धको री पीड़ा रे पड़ना।
౧౦వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.
11 तिना री पीड़ा रा तुआँ जुगो-जुगो तक उठदा रणा और जो तेस डांगर और तेसरी मूरता री पूजा करोए और जो तिना रे नाओं री छाप लओए, तिना खे रात-दिन चैन नि मिलणा।” (aiōn )
౧౧వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు. (aiōn )
12 कऊँकि ये सारिया गल्ला ऊणे वाल़िया ए इजी खे परमेशरो रे लोका रा सब्र इदे ईए, जो परमेशरो री आज्ञा खे मानोए और यीशुए पाँदे विश्वास करोए।
౧౨దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి.”
13 मैं स्वर्गो ते ये आवाज सुणी, “लिख: जो मुड़दे प्रभुए रे मरोए, सेयो एबुए ते धन्य ए।” आत्मा बोलोआ, “आ, कऊँकि तिना खे आपणी मईणता ते आराम मिलणा और तिना रे काम तिना साथे ओए ए।”
౧౩అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.
14 तेबे मैं नजर दित्ती और देखो, एक उजल़ा बादल़ था और तेस बादल़ो पाँदे माणूं रे पुत्रो जेड़ा कोई बैठी रा था, जेसरे सिरो पाँदे सुईने रा मुकट और आथो रे पैनी दराटी थी।
౧౪మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
15 तेबे एकी और स्वर्गदूते मन्दरो ते निकल़ी की तेसते, जो बादल़ो पाँदे बैठी रा था, जोरे की आक्का पाई की बोलेया, “आपणी दराटी लयी की बाड, कऊँकि बाडणे रा बखत आईगा रा, कऊँकि तरतिया री फसल पाक्की चुकी री।”
౧౫అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, “పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు.”
16 तेबे से जो बादल़ो पाँदे बैठी रा था, तिने तरतिया पाँदे आपणी दराटी लगाई और तरतिया री फसल बाडी ती।
౧౬అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.
17 तेबे एक और स्वर्गदूत तेस मन्दरो ते निकल़ेया, जो स्वर्गो रे ए और तेसगे बी पैनी दराटी थी।
౧౭అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
18 तेबे एक ओर स्वर्गदूत, जेसखे आगी पाँदे अक्क था, बेदिया ते निकल़ेया और जेसगे पैनी दराटी थी, तिने जोरे की बोलेया, “आपणी पैनी दराटी लगाई की, तरतिया री अँगूरो री बेला रे गुच्छे बाडी दे, कऊँकि तिजी रे अँगूर पाक्की चुकी रे।”
౧౮మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, “భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి” అన్నాడు.
19 तेबे तिने स्वर्गदूते आपणी दराटी लगाई और तरतिया पाँदलिया अँगूरा रिया बेली रा फल बाडी की आपणे परमेशरो रे प्रकोपो रे बड़े रसकूण्डो रे पाईता
౧౯అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
20 और नगरो ते बारे तेस रसकूण्डो रे अँगूर माण्डे और रसकूण्डो ते इतणा खून निकल़ेया कि कोड़ेया री लगामा तक पऊँछेया और से सौ कोह तक बईगा।
౨౦పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.