< Pirmā Mozus 16 >
1 Un Sāraī, Ābrama sieva, tam nedzemdēja, un tai bija kalpone no Ēģiptes, Hāgare vārdā.
౧అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు.
2 Un Sāraī sacīja uz Ābramu: redzi, Tas Kungs man ir liedzis dzemdēt, ej jel pie manas kalpones, vai es caur viņu nemantotu dzimumu. Un Ābrams klausīja Sāraī balsij.
౨శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.
3 Tad Sāraī, Ābrama sieva, ņēma Hāgari, to Ēģiptieti, savu kalponi, kad Ābrams desmit gadus bija dzīvojis Kanaāna zemē, un deva to par sievu Ābramam, savam vīram.
౩అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది.
4 Un viņš gāja pie Hāgares, un tā tapa grūta. Kad nu tā redzēja, ka bija grūta, tad viņas valdniece bija nicināta viņas acīs.
౪అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.
5 Tad Sāraī sacīja uz Ābramu: tu dari nepareizi; savu kalponi es esmu devusi tavā klēpī, un nu viņa redz sevi grūtu esam, un es esmu nicināta viņas acīs; Tas Kungs lai tiesā starp mani un tevi.
౫అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది.
6 Un Ābrams sacīja uz Sāraī: redzi, tava kalpone ir tavā rokā, dari tai, kā tev patīk.
౬అందుకు అబ్రాము “ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.
7 Un Sāraī to pārmācīja, un tā aizbēga no viņas; un Tā Kunga eņģelis to atrada pie ūdens akas tuksnesī, pie tās akas uz Šuras ceļa.
౭షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు.
8 Un tas sacīja: Hāgare, Sāraī kalpone, no kurienes tu nāci un uz kurieni tu ej? Un tā sacīja: es bēgu no savas valdnieces Sāraī.
౮ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది.
9 Tad Tā Kunga eņģelis tai sacīja: griezies atpakaļ pie savas valdnieces un pazemojies apakš viņas rokas.
౯అప్పుడు యెహోవా దూత “నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు” అన్నాడు.
10 Un Tā Kunga eņģelis uz to sacīja: Es vairodams vairošu tavu dzimumu, un to neskaitīs liela pulka dēļ.
౧౦యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు.
11 Un Tā Kunga eņģelis uz to sacīja: redzi, tu esi grūta un dzemdēsi dēlu; nosauc viņa vārdu Ismaēls, tāpēc ka Tas Kungs tavas bēdas paklausījis.
౧౧తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు.
12 Un tas būs cilvēks kā meža ēzelis; viņa roka būs pret ikkatru, un ikkatra roka pret viņu, un viņš dzīvos visu savu brāļu priekšā.
౧౨అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు.
13 Un tā nosauca Tā Kunga vārdu, kas ar viņu bija runājis: Tu esi tas stiprais Dievs, kas mani redz; jo tā sacīja: vai es šeit gan neesmu pakaļ skatījusies Tam, kas mani uzlūkojis?
౧౩అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది.
14 Tāpēc to aku sauc par Beer Lekai-Roī (tas ir: par dzīvā aku, kas mani uzlūko); redzi, tā ir starp Kādešu un Baredu.
౧౪దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “బెయేర్ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
15 Un Hāgare dzemdēja Ābramam dēlu, un Ābrams nosauca savu dēlu, ko Hāgare tam bija dzemdējusi, par Ismaēli.
౧౫తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు.
16 Un Ābrams bija astoņdesmit un sešus gadus vecs, kad Hāgare viņam Ismaēli dzemdēja.
౧౬అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.