< Piektā Mozus 12 >
1 Šie ir tie likumi un tās tiesas, ko jums būs turēt un darīt tai zemē, ko Tas Kungs, tavu tēvu Dievs, tev devis iemantot, kamēr jūs dzīvojat tai zemē.
౧“మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.
2 Izpostiet pilnīgi visas tās vietas, kur tie pagāni, ko jūs uzvarēsiet, kalpojuši saviem dieviem, uz augstiem kalniem un uz pakalniem un apakš zaļiem kokiem.
౨మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
3 Un viņu altārus jums būs apgāzt un viņu stabus salauzt un viņu elka kokus ar uguni sadedzināt un viņu dievu tēlus nocirst, un viņu vārdus izdeldēt no tās vietas.
౩వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.
4 Tā jūs nedariet Tam Kungam, savam Dievam.
౪వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.
5 Bet to vietu, ko Tas Kungs, jūsu Dievs, izredzēs no visām jūsu ciltīm, tur iecelt Savu vārdu, Viņa mājas vietu, to jums būs meklēt, un uz turieni tev būs iet.
౫మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.
6 Un tur jums būs novest savus dedzināmos upurus un savus kaujamos upurus un savus desmitos un savas rokas cilājamos upurus un savus solījumus un savas labprātības dāvanas un savu lielo un sīko lopu pirmdzimtos.
౬మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.
7 Un tur jums un jūsu namiem Tā Kunga, sava Dieva, priekšā būs ēst un priecāties par visu, ko jūsu rokas atnes, ar ko Tas Kungs tavs Dievs, tevi svētījis.
౭అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.
8 Nedariet, kā mēs šeit šodien darām, ikviens, kā tam šķiet pareizi esam.
౮ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.
9 Jo jūs līdz šim neesat nākuši pie dusas, nedz pie tās mantības, ko Tas Kungs, tavs Dievs, tev dos.
౯నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.
10 Bet jūs iesiet pāri pār Jardāni un dzīvosiet tai zemē, ko Tas Kungs, jūsu Dievs, jums liks iemantot, un Viņš jums dos dusu no visiem jūsu ienaidniekiem visapkārt, un jūs dzīvosiet mierā.
౧౦మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.
11 Kad nu Tas Kungs, jūsu Dievs, izredzēs vietu, tur iecelt Savu vārdu, uz turieni jums būs nest visu, ko es jums pavēlu, savus dedzināmos upurus un savus kaujamos upurus, savus desmitos un savas rokas cilājamos upurus, un visus savus izredzētos solījumus, ko jūs Tam Kungam esat solījuši.
౧౧నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.
12 Un jums būs priecāties Tā Kunga, sava Dieva, priekšā, jums un jūsu dēliem un jūsu meitām un jūsu kalpiem un jūsu kalponēm un tam Levitam, kas ir jūsu vārtos, jo tam nav daļas nedz mantības līdz ar jums.
౧౨మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
13 Sargies, ka tu savus dedzināmos upurus neupurē jebkurā vietā, ko tu ieraugi,
౧౩మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.
14 Bet tai vietā, ko Tas Kungs izredzēs vienā no tavām ciltīm, tur tev būs upurēt savus dedzināmos upurus, un tur tev visu būs darīt, ko es tev pavēlu.
౧౪కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.
15 Bet kā vien tavai dvēselei tīk, tu vari kaut un gaļu ēst visos savos vārtos, pēc Tā Kunga, sava Dieva, svētības, ko Viņš tev ir devis, šķīstais un nešķīstais to lai ēd, kā stirnu un briedi.
౧౫అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.
16 Tikai asinis jums nebūs ēst; jums tās būs izliet zemē kā ūdeni.
౧౬వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.
17 Bet savos vārtos tu nevari ēst to desmito no savas labības un sava vīna un savas eļļas, nedz tos pirmdzimtos no saviem lieliem un sīkiem lopiem, nedz savus solījumus, ko tu esi solījis, nedz savas labprātības dāvanas, nedz savas rokas cilājamo upuri.
౧౭మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
18 Bet to tu ēd Tā Kunga, sava Dieva, priekšā, tai vietā, ko Tas Kungs, tavs Dievs, izredzēs, tu un tavs dēls un tava meita un tavs kalps un tava kalpone un tas Levits, kas ir tavos vārtos, un priecājies Tā Kunga, sava Dieva, priekšā par visu, ko tava roka dara.
౧౮వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.
19 Sargies, ka tu to Levitu neatstāji, kamēr tu dzīvo savā zemē.
౧౯మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.
20 Kad Tas Kungs, tavs Dievs, izpletīs tavas robežas, kā Viņš tev ir runājis, un tu sacīsi: es ēdīšu gaļu, - tāpēc ka tavai dvēselei gribās gaļu ēst, - tad tu vari gaļu ēst, kā vien tavai dvēselei tīk.
౨౦మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.
21 Ja tā vieta būs tālu no tevis, ko Tas Kungs, tavs Dievs, izredzēs Savu vārdu tur iecelt, tad tu vari kaut no saviem lieliem un sīkiem lopiem, ko Tas Kungs tev ir devis, kā es tev esmu pavēlējis, un vari ēst savos vārtos, kā vien tavai dvēselei tīk.
౨౧నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,
22 Bet tikai kā stirnu un briedi ēd, tā tu to vari ēst; nešķīstais līdz ar šķīsto lai to ēd.
౨౨యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.
23 Noturies tikai, ka tu asinis neēd, jo asinīs ir dvēsele; un dvēseli ar miesu tev nebūs ēst.
౨౩అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.
24 Tās tev nebūs ēst, bet izliet zemē kā ūdeni.
౨౪మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.
25 Tās tev nebūs ēst, lai labi klājās tev un taviem bērniem pēc tevis, ja tu darīsi, kas ir pareizi priekš Tā Kunga acīm.
౨౫మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.
26 Bet savas svētās dāvanas, kas tev būs, un savus solījumus tev būs ņemt un tai vietā noiet, ko Tas Kungs izredzēs.
౨౬మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.
27 Un savus dedzināmos upurus, gaļu un asinis tev būs sataisīt uz Tā Kunga, sava Dieva, altāra, un izliet savu upuru asinis uz Tā Kunga, sava Dieva, altāri, bet to gaļu tev būs ēst.
౨౭మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.
28 Ņem vērā un klausi visus šos vārdus, ko es tev pavēlu, lai labi klājās tev un taviem bērniem pēc tevis mūžīgi, ja tu darīsi, kas ir labi un pareizi priekš Tā Kunga, sava Dieva, acīm. -
౨౮నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.
29 Kad Tas Kungs, tavs Dievs, tavā priekšā izdeldēs tos pagānus, ko tu ej iemantot, un tu tos būsi iemantojis un dzīvosi viņu zemē,
౨౯మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.
30 Sargies, ka tu netopi savaldzināts, viņiem dzīties pakaļ, kad tie tavā priekšā ir izdeldēti, un ka tu nevaicā pēc viņu dieviem sacīdams: tā kā šie ļaudis kalpojuši saviem dieviem, tāpat es arīdzan darīšu.
౩౦ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
31 Tev tā nebūs darīt Tam Kungam, savam Dievam, jo viss, kas Tam Kungam ir negantība, ko Viņš ienīst, to tie saviem dieviem ir darījuši, jo tie arī savus dēlus un savas meitas ar uguni ir sadedzinājuši saviem dieviem.
౩౧వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
32 Visus tos vārdus, ko es jums pavēlu, jums būs turēt, ka jūs tā dariet; tev pie tiem nebūs neko pielikt, neko atraut.
౩౨నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”