< Amosa 8 >

1 Tas Kungs Dievs man šādu lietu lika redzēt, un raugi, tur bija kurvis ar vasaras augļiem.
యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప!
2 Un Viņš sacīja: ko tu redzi, Amos? Un es sacīju: kurvi ar vasaras augļiem. Tad Tas Kungs uz mani sacīja: gals ir nācis maniem Israēla ļaudīm, Es tos vairs netaupīšu.
ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.
3 Un Dieva nama dziesmas tai dienā taps par kaukšanu, saka Tas Kungs Dievs; tur būs daudz nomirušas miesas, ikkatrā vietā tās klusi taps nomestas.
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి. ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి. నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.
4 Klausiet šo vārdu, jūs, kas aprijat nabagu un izdeldat bēdu ļaudis tai zemē,
దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
5 Un sakāt: kad jaunais mēnesis pāries, ka labību pārdodam? Un svētdiena, ka labības klētis varam atdarīt un mazāku darām ēfu un sēķeli lielāku, viltīgi pārgrozīdami svaru?
వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.
6 Ka tos mazos varam pirkt par naudu un tos nabagus par pāri kurpju, tad pelus pārdosim par labību.
పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం. దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”
7 Tas Kungs ir zvērējis pie Jēkaba goda: Es visus viņu darbus neaizmirsīšu nemūžam.
యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
8 Vai šādas lietas dēļ zemei nebūs kustināties, un visiem iedzīvotājiem iekš tās nebūs bēdāties? Tā visai uzplūdīs kā upe un plūdīs un nosīks kā Ēģiptes upe.
దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.
9 Un notiks tai dienā saka Tas Kungs Dievs, tad Es saulei likšu noiet dienas vidū un aptumšošu zemi pašā gaismā.
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది.
10 Un Es pārvērtīšu jūsu svētkus par bēdām un visas jūsu dziesmas par vaimanām, un uz visiem gurniem likšu maisu un uz visām galvām pleiķi(noskūt galvu), un Es likšu bēdāties kā par vienīgo dēlu, un gals būs rūgta diena.
౧౦మీ పండగలను దుఃఖదినాలుగా మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. మీ అందరి తలలు బోడిచేస్తాను. ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
11 Redzi, dienas nāk, saka Tas Kungs Dievs, ka es badu sūtīšu tai zemē, ne badu pēc maizes un ne tvīkšanu pēc ūdens, bet klausīt Tā Kunga vārdus.
౧౧యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.
12 Un tie skraidīs no vienas jūras līdz otrai, un tecēs apkārt no ziemeļa puses līdz rīta pusei Tā Kunga vārdu meklēt, bet neatradīs.
౧౨యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు కానీ అది వారికి దొరకదు.
13 Tai dienā skaistās jaunavas un jaunekļi apģībs no tvīkšanas,
౧౩ఆ రోజు అందమైన కన్యలూ యువకులూ దాహంతో సోలిపోతారు.
14 Kas pie Samarijas nozieguma zvērē un saka: tik tiešām kā tavs Dievs dzīvo, Dan, tik tiešām kā tas ceļš uz Bēršebu! Un tie kritīs un vairs necelsies.
౧౪సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ ‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”

< Amosa 8 >