< Malachi Propheta 1 >
1 onus verbi Domini ad Israhel in manu Malachi
౧ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవా వాక్కు.
2 dilexi vos dicit Dominus et dixistis in quo dilexisti nos nonne frater erat Esau Iacob dicit Dominus et dilexi Iacob
౨యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.
3 Esau autem odio habui et posui montes eius in solitudinem et hereditatem eius in dracones deserti
౩ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”
4 quod si dixerit Idumea destructi sumus sed revertentes aedificabimus quae deserta sunt haec dicit Dominus exercituum isti aedificabunt et ego destruam et vocabuntur Termini impietatis et Populus cui iratus est Dominus usque in aeternum
౪“మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం” అని ఎదోమీయులు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు.
5 et oculi vestri videbunt et vos dicetis magnificetur Dominus super terminum Israhel
౫కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు.
6 filius honorat patrem et servus dominum suum si ergo pater ego sum ubi est honor meus et si dominus ego sum ubi est timor meus dicit Dominus exercituum ad vos o sacerdotes qui despicitis nomen meum et dixistis in quo despeximus nomen tuum
౬“కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు.
7 offertis super altare meum panem pollutum et dicitis in quo polluimus te in eo quod dicitis mensa Domini despecta est
౭మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా
8 si offeratis caecum ad immolandum nonne malum est et si offeratis claudum et languidum nonne malum est offer illud duci tuo si placuerit ei aut si susceperit faciem tuam dicit Dominus exercituum
౮గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?” అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
9 et nunc deprecamini vultum Dei ut misereatur vestri de manu enim vestra factum est hoc si quo modo suscipiat facies vestras dicit Dominus exercituum
౯ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
10 quis est in vobis qui claudat ostia et incendat altare meum gratuito non est mihi voluntas in vobis dicit Dominus exercituum et munus non suscipiam de manu vestra
౧౦“మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
11 ab ortu enim solis usque ad occasum magnum est nomen meum in gentibus et in omni loco sacrificatur et offertur nomini meo oblatio munda quia magnum nomen meum in gentibus dicit Dominus exercituum
౧౧తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
12 et vos polluistis illud in eo quod dicitis mensa Domini contaminata est et quod superponitur contemptibile est cum igni qui illud devorat
౧౨మీరైతే యెహోవా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు.
13 et dixistis ecce de labore et exsuflastis illud dicit Dominus exercituum et intulistis de rapinis claudum et languidum et intulistis munus numquid suscipiam illud de manu vestra dicit Dominus
౧౩అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవా అడుగుతున్నాడు.
14 maledictus dolosus qui habet in grege suo masculum et votum faciens immolat debile Domino quia rex magnus ego dicit Dominus exercituum et nomen meum horribile in gentibus
౧౪నేను ఘనమైన గొప్ప రాజును. అన్య దేశాల ప్రజల్లో నా పేరంటే భయం. యెహోవాకు మొక్కుబడి చెల్లించడానికి మగ జంతువు ఉన్నప్పటికీ జబ్బు పడిన దాన్ని అర్పించే వంచకుడు శాపానికి గురి అవుతాడు.