< Job 28 >
1 habet argentum venarum suarum principia et auro locus est in quo conflatur
౧వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.
2 ferrum de terra tollitur et lapis solutus calore in aes vertitur
౨ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.
3 tempus posuit tenebris et universorum finem ipse considerat lapidem quoque caliginis et umbram mortis
౩మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.
4 dividit torrens a populo peregrinante eos quos oblitus est pes egentis hominum et invios
౪మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.
5 terra de qua oriebatur panis in loco suo igne subversa est
౫భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.
6 locus sapphyri lapides eius et glebae illius aurum
౬దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.
7 semitam ignoravit avis nec intuitus est oculus vulturis
౭వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.
8 non calcaverunt eam filii institorum nec pertransivit per eam leaena
౮గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.
9 ad silicem extendit manum suam subvertit a radicibus montes
౯మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
10 in petris rivos excidit et omne pretiosum vidit oculus eius
౧౦శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.
11 profunda quoque fluviorum scrutatus est et abscondita produxit in lucem
౧౧నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.
12 sapientia vero ubi invenitur et quis est locus intellegentiae
౧౨అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
13 nescit homo pretium eius nec invenitur in terra suaviter viventium
౧౩మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.
14 abyssus dicit non est in me et mare loquitur non est mecum
౧౪అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.
15 non dabitur aurum obrizum pro ea nec adpendetur argentum in commutatione eius
౧౫బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.
16 non conferetur tinctis Indiae coloribus nec lapidi sardonico pretiosissimo vel sapphyro
౧౬అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.
17 non adaequabitur ei aurum vel vitrum nec commutabuntur pro ea vasa auri
౧౭సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.
18 excelsa et eminentia non memorabuntur conparatione eius trahitur autem sapientia de occultis
౧౮పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది.
19 non adaequabitur ei topazium de Aethiopia nec tincturae mundissimae conponetur
౧౯కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.
20 unde ergo sapientia veniet et quis est locus intellegentiae
౨౦అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
21 abscondita est ab oculis omnium viventium volucres quoque caeli latet
౨౧అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.
22 perditio et mors dixerunt auribus nostris audivimus famam eius
౨౨“మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి.
23 Deus intellegit viam eius et ipse novit locum illius
౨౩దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.
24 ipse enim fines mundi intuetur et omnia quae sub caelo sunt respicit
౨౪ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.
25 qui fecit ventis pondus et aquas adpendit mensura
౨౫గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,
26 quando ponebat pluviis legem et viam procellis sonantibus
౨౬వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,
27 tunc vidit illam et enarravit et praeparavit et investigavit
౨౭ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.
28 et dixit homini ecce timor Domini ipsa est sapientia et recedere a malo intellegentia
౨౮యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.