< I Paralipomenon 1 >
౧ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
౨ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
౩యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
౪లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
5 filii Iafeth Gomer Magog Madai et Iavan Thubal Mosoch Thiras
౫యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
6 porro filii Gomer Aschenez et Rifath et Thogorma
౬గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
7 filii autem Iavan Elisa et Tharsis Cetthim et Dodanim
౭యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
8 filii Ham Chus et Mesraim Phut et Chanaan
౮హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
9 filii autem Chus Saba et Evila Sabatha et Rechma et Sabathaca porro filii Rechma Saba et Dadan
౯కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
10 Chus autem genuit Nemrod iste coepit esse potens in terra
౧౦కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
11 Mesraim vero genuit Ludim et Anamim et Laabim et Nepthuim
౧౧ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
12 Phethrosim quoque et Chasluim de quibus egressi sunt Philisthim et Capthurim
౧౨పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
13 Chanaan vero genuit Sidonem primogenitum et Heth
౧౩కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
14 Iebuseum quoque et Amorreum et Gergeseum
౧౪ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
15 Evheumque et Aruceum et Asineum
౧౫హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
16 Aradium quoque et Samareum et Ematheum
౧౬అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
17 filii Sem Aelam et Assur et Arfaxad et Lud et Aram et Us et Hul et Gothor et Mosoch
౧౭షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
18 Arfaxad autem genuit Sala qui et ipse genuit Heber
౧౮అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
19 porro Heber nati sunt duo filii nomen uni Phaleg quia in diebus eius divisa est terra et nomen fratris eius Iectan
౧౯ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
20 Iectan autem genuit Helmodad et Saleph et Asermoth et Iare
౨౦యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 Aduram quoque et Uzal et Decla
౨౧హదోరము, ఊజాలు, దిక్లాను,
22 Ebal etiam et Abimahel et Saba necnon
౨౨ఏబాలు, అబీమాయేలు, షేబా,
23 et Ophir et Evila et Iobab omnes isti filii Iectan
౨౩ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
౨౪షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
౨౫ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
౨౬రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
27 Abram iste est Abraham
౨౭తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
28 filii autem Abraham Isaac et Ismahel
౨౮అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
29 et hae generationes eorum primogenitus Ismahelis Nabaioth et Cedar et Adbeel et Mabsam
౨౯వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
30 Masma et Duma Massa Adad et Thema
౩౦మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31 Iathur Naphis Cedma hii sunt filii Ismahelis
౩౧యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
32 filii autem Cetthurae concubinae Abraham quos genuit Zamram Iecsan Madan Madian Iesboc Sue porro filii Iecsan Saba et Dadan
౩౨అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
33 filii autem Madian Epha et Apher et Enoch et Abida et Eldaa omnes hii filii Cetthurae
౩౩మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
34 generavit autem Abraham Isaac cuius fuerunt filii Esau et Israhel
౩౪అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
35 filii Esau Eliphaz Rauhel Iaus Ialam Core
౩౫ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
36 filii Eliphaz Theman Omer Sepphu Gethem Cenez Thamna Amalech
౩౬వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
37 filii Rauhel Naath Zara Samma Maza
౩౭రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
38 filii Seir Lothan Sobal Sebeon Ana Dison Eser Disan
౩౮శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39 filii Lothan Horri Humam soror autem Lothan fuit Thamna
౩౯లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
40 filii Sobal Alian et Manaath et Ebal et Sepphi et Onam filii Sebeon Aia et Ana filii Ana Dison
౪౦శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
41 filii Dison Amaran et Eseban et Iethran et Charan
౪౧అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42 filii Eser Balaan et Zaban et Iacan filii Dison Us et Aran
౪౨ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
43 isti sunt reges qui imperaverunt in terra Edom antequam esset rex super filios Israhel Bale filius Beor et nomen civitatis eius Denaba
౪౩ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
44 mortuus est autem Bale et regnavit pro eo Iobab filius Zare de Bosra
౪౪బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
45 cumque et Iobab fuisset mortuus regnavit pro eo Husam de terra Themanorum
౪౫యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
46 obiit quoque et Husam et regnavit pro eo Adad filius Badad qui percussit Madian in terra Moab et nomen civitatis eius Avith
౪౬హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
47 cumque et Adad fuisset mortuus regnavit pro eo Semla de Masreca
౪౭హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
48 sed et Semla mortuus est et regnavit pro eo Saul de Rooboth quae iuxta amnem sita est
౪౮శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
49 mortuo quoque Saul regnavit pro eo Baalanan filius Achobor
౪౯షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
50 sed et hic mortuus est et regnavit pro eo Adad cuius urbis fuit nomen Phou et appellata est uxor eius Mehetabel filia Matred filiae Mezaab
౫౦బయల్ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
51 Adad autem mortuo duces pro regibus in Edom esse coeperunt dux Thamna dux Alva dux Ietheth
౫౧హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
52 dux Oolibama dux Hela dux Phinon
౫౨అహలీబామా, ఏలా, పీనోను,
53 dux Cenez dux Theman dux Mabsar
౫౩కనజు, తేమాను, మిబ్సారు,
54 dux Magdihel dux Iram hii duces Edom
౫౪మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.