< I Paralipomenon 24 >
1 porro filiis Aaron hae partitiones erunt filii Aaron Nadab et Abiu et Eleazar et Ithamar
౧అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
2 mortui sunt autem Nadab et Abiu ante patrem suum absque liberis sacerdotioque functus est Eleazar et Ithamar
౨నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
3 et divisit eos David id est Sadoc de filiis Eleazar et Ahimelech de filiis Ithamar secundum vices suas et ministerium
౩దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
4 inventique sunt multo plures filii Eleazar in principibus viris quam filii Ithamar divisit autem eis hoc est filiis Eleazar principes per familias sedecim et filiis Ithamar per familias et domos suas octo
౪వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
5 porro divisit utrasque inter se familias sortibus erant enim principes sanctuarii et principes Dei tam de filiis Eleazar quam de filiis Ithamar
౫ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
6 descripsitque eos Semeias filius Nathanahel scriba Levites coram rege et principibus et Sadoc sacerdote et Ahimelech filio Abiathar principibus quoque familiarum sacerdotalium et leviticarum unam domum quae ceteris praeerat Eleazar et alteram domum quae sub se habebat ceteros Ithamar
౬లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
7 exivit autem sors prima Ioiarib secunda Iedeiae
౭మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
8 tertia Arim quarta Seorim
౮మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
9 quinta Melchia sexta Maiman
౯అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
10 septima Accos octava Abia
౧౦ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
11 nona Hiesu decima Sechenia
౧౧తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
12 undecima Eliasib duodecima Iacim
౧౨పండ్రెండోది యాకీముకు,
13 tertiadecima Oppa quartadecima Isbaal
౧౩పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
14 quintadecima Belga sextadecima Emmer
౧౪పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
15 septimadecima Ezir octavadecima Hapses
౧౫పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
16 nonadecima Phetheia vicesima Iezecel
౧౬పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
17 vicesima prima Iachin vicesima secunda Gamul
౧౭ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
18 vicesima tertia Dalaiau vicesima quarta Mazziau
౧౮ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.
19 hae vices eorum secundum ministeria sua ut ingrediantur domum Domini et iuxta ritum suum sub manu Aaron patris eorum sicut praecepit Dominus Deus Israhel
౧౯ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.
20 porro filiorum Levi qui reliqui fuerant de filiis Amram erat Subahel et filiis Subahel Iedeia
౨౦మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
21 de filiis quoque Roobiae princeps Iesias
౨౧రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
22 Isaaris vero Salemoth filiusque Salemoth Iaath
౨౨ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
23 filiusque eius Ieriahu Amarias secundus Iazihel tertius Iecmaam quartus
౨౩హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
24 filius Ozihel Micha filius Micha Samir
౨౪ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
25 frater Micha Iesia filiusque Iesiae Zaccharias
౨౫ఇష్షీయా సంతానంలో జెకర్యా,
26 filii Merari Mooli et Musi filius Ioziau Benno
౨౬మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.
27 filius quoque Merari Oziau et Soem et Zacchur et Hebri
౨౭యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
28 porro Mooli filius Eleazar qui non habebat liberos
౨౮మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
29 filius vero Cis Ierahemel
౨౯కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
30 filii Musi Mooli Eder et Ierimoth isti filii Levi secundum domos familiarum suarum
౩౦మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
31 miseruntque et ipsi sortes contra fratres suos filios Aaron coram David rege et Sadoc et Ahimelech et principibus familiarum sacerdotalium et leviticarum tam maiores quam minores omnes sors aequaliter dividebat
౩౧రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.