< Psalmorum 82 >
1 Psalmus Asaph. Deus stetit in synagoga deorum: in medio autem deos diiudicat.
౧ఆసాపు కీర్తన దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
2 Usquequo iudicatis iniquitatem: et facies peccatorum sumitis?
౨ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? (సెలా)
3 Iudicate egeno, et pupillo: humilem, et pauperem iustificate.
౩పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
4 Eripite pauperem: et egenum de manu peccatoris liberate.
౪పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.
5 Nescierunt, neque intellexerunt, in tenebris ambulant: movebuntur omnia fundamenta terræ.
౫వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.
6 Ego dixi: Dii estis, et filii excelsi omnes.
౬మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.
7 Vos autem sicut homines moriemini: et sicut unus de principibus cadetis.
౭అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.
8 Surge Deus, iudica terram: quoniam tu hereditabis in omnibus Gentibus.
౮దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.