< 시편 27 >
1 (다윗의 시) 여호와는 나의 빛이요 나의 구원이시니 내가 누구를 두려워하리요 여호와는 내 생명의 능력이시니 내가 누구를 무서워하리요
౧దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?
2 나의 대적, 나의 원수된 행악자가 내 살을 먹으려고 내게로 왔다가 실족하여 넘어졌도다
౨నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.
3 군대가 나를 대적하여 진 칠지라도 내 마음이 두렵지 아니하며 전쟁이 일어나 나를 치려 할지라도 내가 오히려 안연하리로다
౩నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను.
4 내가 여호와께 청하였던 한 가지 일 곧 그것을 구하리니 곧 나로 내 생전에 여호와의 집에 거하여 여호와의 아름다움을 앙망하며 그 전에서 사모하게 하실 것이라
౪యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను.
5 여호와께서 환난 날에 나를 그 초막 속에 비밀히 지키시고 그 장막 은밀한 곳에 나를 숨기시며 바위 위에 높이 두시리로다
౫ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.
6 이제 내 머리가 나를 두른 내 원수 위에 들리리니 내가 그 장막에서 즐거운 제사를 드리겠고 노래하여 여호와를 찬송하리로다!
౬అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.
7 여호와여, 내가 소리로 부르짖을 때에 들으시고 또한 나를 긍휼히 여기사 응답하소서
౭యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు.
8 너희는 내 얼굴을 찾으라 하실 때에 내 마음이 주께 말하되 여호와여, 내가 주의 얼굴을 찾으리이다 하였나이다
౮ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను.
9 주의 얼굴을 내게서 숨기지 마시고 주의 종을 노하여 버리지 마소서 주는 나의 도움이 되셨나이다 나의 구원의 하나님이시여, 나를 버리지 말고 떠나지 마옵소서
౯నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు.
10 내 부모는 나를 버렸으나 여호와는 나를 영접하시리이다
౧౦నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు.
11 여호와여, 주의 길로 나를 가르치시고 내 원수를 인하여 평탄한 길로 인도하소서
౧౧యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు.
12 내 생명을 내 대적의 뜻에 맡기지 마소서 위증자와 악을 토하는 자가 일어나 나를 치려 함이니이다
౧౨శత్రువులకు నా ప్రాణం అప్పగించకు. ఎందుకంటే అబద్ధ సాక్షులు నా మీదకి లేచారు, వాళ్ళు హింస వెళ్లగక్కుతున్నారు!
13 내가 산 자의 땅에 있음이여 여호와의 은혜 볼 것을 믿었도다
౧౩సజీవుల దేశంలో నేను యెహోవా దయ పొందుతానన్న నమ్మకం నాకు లేకపోతే నేను నిరీక్షణ కోల్పోయేవాణ్ణి.
14 너는 여호와를 바랄지어다! 강하고 담대하며 여호와를 바랄지어다!
౧౪యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!