< Soromoni' 2 >

1 Nagra Saroni agupofi flaua kna nehu'na, agupofima nehagea lili flaua kna hu'noe.
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును.
2 Mofa'neramimofo amunompina navesima negantoa mofamoka, ave'ave trazampi me'nea lili flauamofo amosregna hu'nane.
(ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
3 Navesima negantoa ne'moka zafaramimofo amu'nompina mareri agatere epoli zafagna hunka mago'a vene'ne amu'nompina mani'nane. Ana zafamofo tonapi mani'nena haganentake raga'a tagi'na nenoe.
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. అతని పండు ఎంతో రుచిగా ఉంది.
4 Tusi neza retro hunte'nea ra nontega navareno nevuno, agu'areti'ma huno avesima nante'nea avu'avamo'a tavravereti refite nanteankna hu'ne.
అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.
5 Anante hagegema hu zafargareti'ma kre'nea bretia namige'na ne'na, hankavea eri'na mani'na nevu'na, epoli zafa raga namige'na nenavuna ha'neno. Na'ankure kagrikura tusiza hu'na navesi negante'na kria e'nerue.
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.
6 Hagi hoga'a azante nanuna ante harage nehugeno, tamaga azanura nanuki'ne.
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.
7 Jerusalemi mofaneramimota gazeline afi dia afu'mo'za nentahisageta nagritera huvempa hutma tamavesi'zana ame huta eri o'otinkeno kna fatgore eno.
(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
8 Hagi avesima nentoa ne'mo'a, agonarega ne-ege'na agasasanke'a nentahue. Takaure takaure huno agona kreneramino, vagri vagri huno ne'one agona kreramino ne-e.
[రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
9 Avesima nentoa ne'mo'a gazeliema nehaza afukna huge, agaho dia afukna hu'ne. Nosika mani'neno zaho eri kampinti mase nompinka rentragino nege.
నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
10 Nevesima nentoa ne'mo'a amanage huno nagrikura hu'ne, navesi navesima hunegantoa mofamoka otinka eno. Hentofa zagani'a mani'nananki egeta nagrane va'mneno.
౧౦నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
11 Hagi zasi'ma nehianknamo'a vagaregeno kora aruse'ne.
౧౧చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
12 Flaua trazamo'a hageno amosrea ahegeno, wainia taga huno eri fatgo nehigeno, namaramimo'a zanontera tusiza hu'za nani'nani nehazage'za, kugofa namaramimo'za kugokugo nehaze.
౧౨దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
13 Fiki zafamo'a agafa huno raga neregeno, grepi zafamo'a amosre nehegeno, mna'amo'a antaguntagu nehie. Navesima negantoa mofamoka otinka eno. Hentofa zaganimoka nagri'ene eno huno navesima nentoa ne'mo'a hu'ne!
౧౩అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
14 Maho namanimo'a fra'ma nekia havegampimka agonafi frakino mani'ne. Kavugosa naveri nehunka, kagerura aruge'na antahi'neno. Na'ankure kagerumo'a haga nehigeno, kavugosamo'a hentofaza hu'ne.
౧౪బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
15 Avesima nentankeno kavesima negantea grepi hozatani'a eri haviza hanagi, maka neone afi kraramina zamazeri hana huo. Na'ankure grepi zafamo'a amosre ahente'ne.
౧౫(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
16 Navesima nentoa ne'mo'a nagri su'a manige'na, nagra agri su'a mani'noe. Ana hu'neankino liliema nehaza flaua hozamofo amu'nompi vano nehuno, amosrema ahente'neana nene.
౧౬(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
17 Rumasama osu'nenire gazeliema nehaza dia afumo'ma agonaregati'ma ne-eaza hunka, navesima negantoa ne'moka ete nagritega eno.
౧౭(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.

< Soromoni' 2 >