< 詩篇 32 >

1 ダビデの訓諭のうた その愆をゆるされその罪をおほはれしものは福ひなり
దావీదు రాసిన కీర్తన, మస్కిల్. దైవధ్యానం. తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.
2 不義をヱホバに負せられざるもの心にいつはりなき者はさいはひなり
యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.
3 我いひあらはさざりしときは終日かなしみさけびたるが故にわが骨ふるびおとろへたり
నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.
4 なんぢの手はよるも昼もわがうへにありて重し わが身の潤澤はかはりて夏の旱のごとくなれり (セラ)
పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. (సెలా)
5 斯てわれなんぢの前にわが罪をあらはしわが不義をおほはざりき 我いへらくわが愆をヱホバにいひあらはさんと 斯るときしも汝わがつみの邪曲をゆるしたまへり (セラ)
అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. (సెలా)
6 されば神をうやまふ者はなんぢに遇ことをうべき間になんぢに祈らん 大水あふれ流るるともかならずその身におよばじ
దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.
7 汝はわがかくるべき所なり なんぢ患難をふせぎて我をまもり救のうたをもて我をかこみたまはん (セラ)
నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.
8 われ汝ををしへ汝をあゆむべき途にみちびき わが目をなんぢに注てさとさん
నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.
9 汝等わきまへなき馬のごとく驢馬のごとくなるなかれ かれらは鑣たづなのごとき具をもてひきとめずば近づききたることなし
వివేకం లేని గుర్రం లాగానో, గాడిద లాగానో ఉండకు. వాటిని అదుపు చేయాలంటే కళ్ళెం ఉండాలి. అవి నువ్వు కోరిన చోటికి వెళ్ళవు.
10 惡者はかなしみ多かれどヱホバに依頼むものは憐憫にてかこまれん
౧౦దుర్మార్గులకు ఎన్నో దిగుళ్ళు ఉన్నాయి. అయితే యెహోవాలో నమ్మకం ఉంచిన వాణ్ణి ఆయన నిబంధన కృప ఆవరించి ఉంటుంది.
11 ただしき者よヱホバを喜びだのしめ 凡てこころの直きものよ喜びよばふべし
౧౧నీతిపరులారా, యెహోవాలో సంతోషంగా ఉండండి. ఆయనలో ఉత్సాహంగా ఉండండి. హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్ళు ఆనందంతో కేకలు వేయండి.

< 詩篇 32 >