< 箴言 知恵の泉 11 >

1 いつはりの權衝はヱホバに惡まれ 義しき分銅は彼に欣ばる
దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.
2 驕傲きたれば辱も亦きたる謙だる者には智慧あり
గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.
3 直者の端荘は己を導き悖逆者の邪曲は己を亡す
నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది.
4 寳は震怒の日に益なし されど正義は救ふて死をまぬかれしむ
దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.
5 完全者はその正義によりてその途を直くせられ 惡者はその惡によりて跌るべし
యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు.
6 直者はその正義によりて救はれ 悸逆者は自己の惡によりて執へらる
నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు.
7 惡人は死るときにその望たえ 不義なる者の望もまた絶べし
దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి.
8 義者は艱難より救はれ 惡者はこれに代る
ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు.
9 邪曲なる者は口をもてその鄰を亡す されど義しき者はその知識によりて救はる
మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు.
10 義しきもの幸福を受ればその城邑に歓喜あり 惡きもの亡さるれば歓喜の聲おこる
౧౦నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి.
11 城邑は直者の祝ふに倚て高く挙られ 惡者の口によりて亡さる
౧౧నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి.
12 その鄰を侮る者は智慧なし 聡明人はその口を噤む
౧౨తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.
13 往て人の是非をいふ者は密事を洩し 心の忠信なる者は事を隠す
౧౩చాడీలు చెబుతూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయటపెడతాడు. నమ్మకస్థుడు రహస్యాలు దాస్తాడు.
14 はかりごとなければ民たふれ 議士多ければ平安なり
౧౪మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం.
15 他人のために保證をなす者は苦難をうけ 保證を嫌ふ者は平安なり
౧౫పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు.
16 柔順なる婦は榮誉をえ 強き男子は資財を得
౧౬మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు.
17 慈悲ある者は己の霊魂に益をくはへ 残忍者はおのれの身を擾はす
౧౭దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు.
18 惡者の獲る報はぴなしく 義を播くものの得る報賞は確し
౧౮దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.
19 堅く義をたもつ者は生命にいたり 惡を追もとむる者はおのれの死をまねく
౧౯వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు.
20 心の戻れる者はヱホバに憎まれ 直く道を歩む者は彼に悦ばる
౨౦మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు.
21 手に手をあはするとも惡人は罪をまぬかれず 義人の苗裔は救を得
౨౧భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు.
22 美しき婦のつつしみなきは金の環の豕の鼻にあるが如し
౨౨స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం.
23 義人のねがふところは凡て福祉にいたり 惡人ののぞむところは震怒にいたる
౨౩నీతిమంతులు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. దుష్టుల ఆశలు అహంకార పూరితం.
24 ほどこし散して反りて増ものあり 與ふべきを吝みてかへりて貧しきにいたる者あり
౨౪ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.
25 施與を好むものは肥え 人を潤ほす者はまた利潤をうく
౨౫ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.
26 穀物を蔵めて糶ざる者は民に阻はる 然れど售る者の首には祝福あり
౨౬ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.
27 善をもとむる者は恩恵をえん 惡をもとむる者には惡き事きたらん
౨౭మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది.
28 おのれの富を恃むものは仆れん されど義者は樹の青葉のごとくさかえん
౨౮సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు.
29 おのれの家をくるしむるものは風をえて所有とせん 愚なる者は心の智きものの僕とならん
౨౯తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు.
30 義人の果は生命の樹なり 智慧ある者は人を捕ふ
౩౦నీతిమంతులు జీవ వృక్ష ఫలాలు ఫలిస్తారు. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు.
31 みよ義人すらも世にありて報をうくべし況て惡人と罪人とをや
౩౧నీతిమంతులు ఈ లోకంలో తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే, దుష్టులకు, పాపులకు తప్పనిసరిగా తగిన ప్రతిఫలం కలుగుతుంది గదా.

< 箴言 知恵の泉 11 >