< ゼパニヤ書 1 >
1 ユダの王アモンの子ヨシヤの世に、ゼパニヤに臨んだ主の言葉。ゼパニヤはクシの子、クシはゲダリヤの子、ゲダリヤはアマリヤの子、アマリヤはヒゼキヤの子である。
౧యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
2 主は言われる、「わたしは地のおもてからすべてのものを一掃する」。
౨“ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
3 主は言われる、「わたしは人も獣も一掃し、空の鳥、海の魚をも一掃する。わたしは悪人を倒す。わたしは地のおもてから人を絶ち滅ぼす」。
౩మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.
4 「わたしはユダとエルサレムのすべての住民との上に手を伸べる。わたしはこの所からバアルの残党と、偶像の祭司の名とを断つ。
౪“నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి, బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.
5 また屋上で天の万象を拝む者、主に誓いを立てて拝みながら、またミルコムをさして誓う者、
౫మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.
6 主にそむいて従わない者、主を求めず、主を尋ねない者を断つ」。
౬యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”
7 主なる神の前に沈黙せよ。主の日は近づき、主はすでに犠牲を備え、その招いた者を聖別されたからである。
౭యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.
8 主の犠牲をささげる日に、「わたしはつかさたちと王の子たち、およびすべて異邦の衣服を着る者を罰する。
౮“యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను, రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.
9 その日にわたしはまた、すべて敷居をとび越え、暴虐と欺きとを自分の主君の家に満たす者を罰する」。
౯ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”
10 主は言われる、「その日には魚の門から叫び声がおこり、第二の町からうめき声がおこり、もろもろの丘からすさまじい響きがおこる。
౧౦ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.
11 しっくいの家の住民よ、泣き叫べ。あきないする民は皆滅ぼされ、銀を量る者は皆断たれるからである。
౧౧కనానీయులంతా నాశనమయ్యారు. డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.
12 その時、わたしはともしびをもって、エルサレムを尋ねる。そして滓の上に凝り固まり、その心の中で『主は良いことも、悪いこともしない』と言う人々をわたしは罰する。
౧౨ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.
13 彼らの財宝はかすめられ、彼らの家は荒れはてる。彼らは家を建てても、それに住むことができない、ぶどう畑を作っても、そのぶどう酒を飲むことができない」。
౧౩వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.
14 主の大いなる日は近い、近づいて、すみやかに来る。主の日の声は耳にいたい。そこに、勇士もいたく叫ぶ。
౧౪యెహోవా మహా దినం దగ్గర పడింది. యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.
15 その日は怒りの日、なやみと苦しみの日、荒れ、また滅びる日、暗く、薄暗い日、雲と黒雲の日、
౧౫ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.
16 ラッパとときの声の日、堅固な町と高いやぐらを攻める日である。
౧౬ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.
17 わたしは人々になやみを下して、盲人のように歩かせる。彼らが主に対して罪を犯したからである。彼らの血はちりのように流され、彼らの肉は糞土のように捨てられる。
౧౭ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.
18 彼らの銀も金も、主の怒りの日には彼らを救うことができない。全地は主のねたみの火にのまれる。主は地に住む人々をたちまち滅ぼし尽される。
౧౮యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.