< 詩篇 97 >
1 主は王となられた。地は楽しみ、海に沿った多くの国々は喜べ。
౧యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక.
2 雲と暗やみとはそのまわりにあり、義と正とはそのみくらの基である。
౨మబ్బులూ చీకటీ ఆయనచుట్టూ ఉన్నాయి. నీతి న్యాయాలు యెహోవా సింహాసనానికి పునాదిగా ఉన్నాయి.
3 火はそのみ前に行き、そのまわりのあだを焼きつくす。
౩ఆయన ముందు అగ్ని బయలు దేరింది. చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది.
౪ఆయన మెరుపులు లోకాన్ని వెలిగిస్తాయి. భూమి దాన్ని చూసి వణికిపోతుంది.
5 もろもろの山は主のみ前に、全地の主のみ前に、ろうのように溶けた。
౫లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.
6 もろもろの天はその義をあらわし、よろずの民はその栄光を見た。
౬ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి రాజ్యాలన్నీ ఆయన మహాత్మ్యాన్ని చూస్తాయి.
7 すべて刻んだ像を拝む者、むなしい偶像をもってみずから誇る者ははずかしめをうける。もろもろの神は主のみ前にひれ伏す。
౭చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్ళు, పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. అలాటి దేవుళ్ళు అందరూ యెహోవాకు మొక్కండి.
8 主よ、あなたのさばきのゆえに、シオンは聞いて喜び、ユダの娘たちは楽しむ。
౮యెహోవా, సీయోను ఇది విని సంతోషించింది. యూదా పట్టణాలు ఆనందించాయి. నీ నీతికరమైన ఆదేశాలనుబట్టి సంతోషిస్తున్నాయి.
9 主よ、あなたは全地の上にいまして、いと高く、もろもろの神にまさって大いにあがめられます。
౯ఎందుకంటే యెహోవా, నువ్వు ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి. దేవుళ్ళందరిలోకీ నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు.
10 主は悪を憎む者を愛し、その聖徒のいのちを守り、これを悪しき者の手から助け出される。
౧౦యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.
11 光は正しい人のために現れ、喜びは心の正しい者のためにあらわれる。
౧౧నీతిమంతులకు వెలుగును, నిజాయితీపరులకు ఆనందాన్ని విత్తనాలుగా చల్లడం జరిగింది.
12 正しき人よ、主によって喜べ、その聖なるみ名に感謝せよ。
౧౨నీతిమంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి.