< 詩篇 88 >
1 聖歌隊の指揮者によってマハラテ・レアノテのしらべにあわせてうたわせたコラの子の歌、さんび。エズラびとヘマンのマスキールの歌 わが神、主よ、わたしは昼、助けを呼び求め、夜、み前に叫び求めます。
౧ఒక పాట, కోరహు వారసుల కీర్తన. ప్రధాన సంగీతకారుని కోసం, మహలతు లయన్నోతు అనే రాగంతో పాడేది. ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ (దైవ ధ్యానం) యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.
2 わたしの祈をみ前にいたらせ、わたしの叫びに耳を傾けてください。
౨నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.
3 わたしの魂は悩みに満ち、わたしのいのちは陰府に近づきます。 (Sheol )
౩నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది. (Sheol )
4 わたしは穴に下る者のうちに数えられ、力のない人のようになりました。
౪సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
5 すなわち死人のうちに捨てられた者のように、墓に横たわる殺された者のように、あなたが再び心にとめられない者のようになりました。彼らはあなたのみ手から断ち滅ぼされた者です。
౫చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
6 あなたはわたしを深い穴、暗い所、深い淵に置かれました。
౬నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
7 あなたの怒りはわたしの上に重く、あなたはもろもろの波をもってわたしを苦しめられました。 (セラ)
౭నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. (సెలా)
8 あなたはわが知り人をわたしから遠ざけ、わたしを彼らの忌みきらう者とされました。わたしは閉じこめられて、のがれることはできません。
౮నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
9 わたしの目は悲しみによって衰えました。主よ、わたしは日ごとにあなたを呼び、あなたにむかってわが両手を伸べました。
౯బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
10 あなたは死んだ者のために奇跡を行われるでしょうか。なき人のたましいは起きあがってあなたをほめたたえるでしょうか。 (セラ)
౧౦మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? (సెలా)
11 あなたのいつくしみは墓のなかに、あなたのまことは滅びのなかに、宣べ伝えられるでしょうか。
౧౧సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
12 あなたの奇跡は暗やみに、あなたの義は忘れの国に知られるでしょうか。
౧౨చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
13 しかし主よ、わたしはあなたに呼ばわります。あしたに、わが祈をあなたのみ前にささげます。
౧౩అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
14 主よ、なぜ、あなたはわたしを捨てられるのですか。なぜ、わたしにみ顔を隠されるのですか。
౧౪యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
15 わたしは若い時から苦しんで死ぬばかりです。あなたの脅しにあって衰えはてました。
౧౫చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
16 あなたの激しい怒りがわたしを襲い、あなたの恐ろしい脅しがわたしを滅ぼしました。
౧౬నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.
17 これらの事がひねもす大水のようにわたしをめぐり、わたしを全く取り巻きました。
౧౭నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి.
18 あなたは愛する者と友とをわたしから遠ざけ、わたしの知り人を暗やみにおかれました。
౧౮నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.