< 箴言 知恵の泉 28 >
1 悪しき者は追う人もないのに逃げる、正しい人はししのように勇ましい。
౧ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.
2 国の罪によって、治める者は多くなり、さとく、また知識ある人によって、国はながく保つ。
౨దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.
3 貧しい者をしえたげる貧しい人は、糧食を残さない激しい雨のようだ。
౩పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.
4 律法を捨てる者は悪しき者をほめる、律法を守る者はこれに敵対する。
౪ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.
5 悪人は正しいことを悟らない、主を求める者はこれをことごとく悟る。
౫దుష్టులు న్యాయమేదో గ్రహించరు. యెహోవాను ఆశ్రయించే వారికి అన్నీ తెలుసు.
6 正しく歩む貧しい者は、曲った道を歩む富める者にまさる。
౬వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు.
7 律法を守る者は賢い子である、不品行な者と交わるものは、父をはずかしめる。
౭ఉపదేశం అంగీకరించే తనయుడు బుద్ధిమంతుడు. తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.
8 利息と高利とによってその富をます者は、貧しい者を恵む者のために、それをたくわえる。
౮డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.
9 耳をそむけて律法を聞かない者は、その祈でさえも憎まれる。
౯ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.
10 正しい者を悪い道に惑わす者は、みずから自分の穴に陥る、しかし誠実な人は幸福を継ぐ。
౧౦యథార్థవంతులను దుర్మార్గంలో పడవేసే వాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు. నిష్కళంకులకు మంచి వారసత్వం దొరుకుతుంది.
11 富める人は自分の目に自らを知恵ある者と見る、しかし悟りのある貧しい者は彼を見やぶる。
౧౧ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల పేదవాడు వాడి అసలు రంగు బయట పెడతాడు.
12 正しい者が勝つときは、大いなる栄えがある、悪しき者が起るときは、民は身をかくす。
౧౨నీతిపరులకు జయం కలగడం మహాఘనతకు కారణం. దుష్టులు అధికారానికి వచ్చేటప్పుడు ప్రజలు దాగిఉంటారు.
13 その罪を隠す者は栄えることがない、言い表わしてこれを離れる者は、あわれみをうける。
౧౩అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.
14 常に主を恐れる人はさいわいである、心をかたくなにする者は災に陥る。
౧౪ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.
15 貧しい民を治める悪いつかさは、ほえるしし、または飢えたくまのようだ。
౧౫పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.
16 悟りのないつかさは残忍な圧制者である、不正の利を憎む者は長命を得る。
౧౬వివేకం లేకుండా ప్రజానీకాన్ని పీడించే అధికారి క్రూరుడు. దగాకోరుతనాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడౌతాడు.
17 人を殺してその血を身に負う者は死ぬまで、のがれびとである、だれもこれを助けてはならない。
౧౭వేరొకడి రక్తం చిందించిన వాడు దోషం మూటగట్టుకొన్నవాడు. వాడు మరణ దినం దాకా పారిపోతూనే ఉంటాడు.
18 正しく歩む者は救を得、曲った道に歩む者は穴に陥る。
౧౮యథార్థంగా ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు. మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు.
19 自分の田地を耕す者は食糧に飽き、無益な事に従う者は貧乏に飽きる。
౧౯తన పొలం సేద్యం చేసుకునే వాడికి కడుపునిండా అన్నం దొరకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవారికి కలిగే పేదరికం అంతా ఇంతా కాదు.
20 忠実な人は多くの祝福を得る、急いで富を得ようとする者は罰を免れない。
౨౦నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.
21 人を片寄り見ることは良くない、人は一切れのパンのために、とがを犯すことがある。
౨౧పక్షపాతం చూపడం మంచిది కాదు. కేవలం ఒక్క రొట్టెముక్క కోసం కొందరు తప్పు చేస్తారు.
22 欲の深い人は急いで富を得ようとする、かえって欠乏が自分の所に来ることを知らない。
౨౨చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.
23 人を戒める者は舌をもってへつらう者よりも、大いなる感謝をうける。
౨౩ముఖ స్తుతి మాటలు పలికే వాడికంటే మనుషులకు బుద్ధి చెప్పేవాడు తుదకు ఎక్కువ మెప్పు పొందుతాడు.
24 父や母の物を盗んで「これは罪ではない」と言う者は、滅ぼす者の友である。
౨౪తన తలిదండ్రుల సొమ్ము దోచుకుని “అది ద్రోహం కాదు” అనుకొనేవాడు నాశనం చేసే వాడికి జతకాడు.
25 むさぼる者は争いを起し、主に信頼する者は豊かになる。
౨౫దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.
26 自分の心を頼む者は愚かである、知恵をもって歩む者は救を得る。
౨౬తన మనస్సులోని ఆలోచనలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు.
27 貧しい者に施す者は物に不足しない、目をおおって見ない人は多くののろいをうける。
౨౭పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.
28 悪しき者が起るときは、民は身をかくす、その滅びるときは、正しい人が増す。
౨౮దుష్టులు అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజలు దాక్కుంటారు. దుర్మార్గులు నశించేటప్పుడు నీతిమంతులు వృద్ధి చెందుతారు.