< 民数記 33 >

1 イスラエルの人々が、モーセとアロンとに導かれ、その部隊に従って、エジプトの国を出てから経た旅路は次のとおりである。
మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
2 モーセは主の命により、その旅路にしたがって宿駅を書きとめた。その宿駅にしたがえば旅路は次のとおりである。
యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
3 彼らは正月の十五日にラメセスを出立した。すなわち過越の翌日イスラエルの人々は、すべてのエジプトびとの目の前を意気揚々と出立した。
మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
4 その時エジプトびとは、主に撃ち殺されたすべてのういごを葬っていた。主はまた彼らの神々にも罰を加えられた。
ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
5 こうしてイスラエルの人々はラメセスを出立してスコテに宿営し、
ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
6 スコテを出立して荒野の端にあるエタムに宿営し、
సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
7 エタムを出立してバアル・ゼポンの前にあるピハヒロテに引き返してミグドルの前に宿営し、
ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
8 ピハヒロテを出立して、海のなかをとおって荒野に入り、エタムの荒野を三日路ほど行って、メラに宿営し、
పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
9 メラを出立し、エリムに行って宿営した。エリムには水の泉十二と、なつめやし七十本とがあった。
ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
10 エリムを出立して紅海のほとりに宿営し、
౧౦ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
11 紅海を出立してシンの荒野に宿営し、
౧౧అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
12 シンの荒野を出立してドフカに宿営し、
౧౨సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
13 ドフカを出立してアルシに宿営し、
౧౩దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
14 アルシを出立してレピデムに宿営した。そこには民の飲む水がなかった。
౧౪ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
15 レピデムを出立してシナイの荒野に宿営し、
౧౫రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
16 シナイの荒野を出立してキブロテ・ハッタワに宿営し、
౧౬అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
17 キブロテ・ハッタワを出立してハゼロテに宿営し、
౧౭కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
18 ハゼロテを出立してリテマに宿営し、
౧౮హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
19 リテマを出立してリンモン・パレツに宿営し、
౧౯రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
20 リンモン・パレツを出立してリブナに宿営し、
౨౦రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
21 リブナを出立してリッサに宿営し、
౨౧లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
22 リッサを出立してケヘラタに宿営し、
౨౨రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
23 ケヘラタを出立してシャペル山に宿営し、
౨౩కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
24 シャペル山を出立してハラダに宿営し、
౨౪షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
25 ハラダを出立してマケロテに宿営し、
౨౫హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
26 マケロテを出立してタハテに宿営し、
౨౬మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
27 タハテを出立してテラに宿営し、
౨౭తాహతు నుండి తారహుకు వచ్చారు.
28 テラを出立してミテカに宿営し、
౨౮తారహు నుండి మిత్కాకు వచ్చారు.
29 ミテカを出立してハシモナに宿営し、
౨౯మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
30 ハシモナを出立してモセラに宿営し、
౩౦హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
31 モセラを出立してベネヤカンに宿営し、
౩౧మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
32 ベネヤカンを出立してホル・ハギデガデに宿営し、
౩౨బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
33 ホル・ハギデガデを出立してヨテバタに宿営し、
౩౩హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
34 ヨテバタを出立してアブロナに宿営し、
౩౪యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
35 アブロナを出立してエジオン・ゲベルに宿営し、
౩౫ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
36 エジオン・ゲベルを出立してチンの荒野すなわちカデシに宿営し、
౩౬ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
37 カデシを出立してエドムの国の端にあるホル山に宿営した。
౩౭కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
38 イスラエルの人々がエジプトの国を出て四十年目の五月一日に、祭司アロンは主の命によりホル山に登って、その所で死んだ。
౩౮యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
39 アロンはホル山で死んだとき百二十三歳であった。
౩౯అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
40 カナンの地のネゲブに住んでいたカナンびとアラデの王は、イスラエルの人々の来るのを聞いた。
౪౦అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
41 ついで、ホル山を出立してザルモナに宿営し、
౪౧వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
42 ザルモナを出立してプノンに宿営し、
౪౨సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
43 プノンを出立してオボテに宿営し、
౪౩పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
44 オボテを出立してモアブの境にあるイエ・アバリムに宿営し、
౪౪ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
45 イエ・アバリムを出立してデボン・ガドに宿営し、
౪౫ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
46 デボン・ガドを出立してアルモン・デブラタイムに宿営し、
౪౬దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
47 アルモン・デブラタイムを出立してネボの前にあるアバリムの山に宿営し、
౪౭అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
48 アバリムの山を出立してエリコに近いヨルダンのほとりのモアブの平野に宿営した。
౪౮అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
49 すなわちヨルダンのほとりのモアブの平野で、ベテエシモテとアベル・シッテムとの間に宿営した。
౪౯వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
50 エリコに近いヨルダンのほとりのモアブの平野で、主はモーセに言われた、
౫౦యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
51 「イスラエルの人々に言いなさい。あなたがたがヨルダンを渡ってカナンの地にはいるときは、
౫౧“నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
52 その地の住民をことごとくあなたがたの前から追い払い、すべての石像をこぼち、すべての鋳像をこぼち、すべての高き所を破壊しなければならない。
౫౨ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
53 またあなたがたはその地の民を追い払って、そこに住まなければならない。わたしがその地をあなたがたの所有として与えたからである。
౫౩ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
54 あなたがたは、おのおの氏族ごとにくじを引き、その地を分けて嗣業としなければならない。大きい部族には多くの嗣業を与え、小さい部族には少しの嗣業を与えなければならない。そのくじの当った所がその所有となるであろう。あなたがたは父祖の部族にしたがって、それを継がなければならない。
౫౪మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
55 しかし、その地の住民をあなたがたの前から追い払わないならば、その残して置いた者はあなたがたの目にとげとなり、あなたがたの脇にいばらとなり、あなたがたの住む国において、あなたがたを悩ますであろう。
౫౫అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
56 また、わたしは彼らにしようと思ったとおりに、あなたがたにするであろう」。
౫౬అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”

< 民数記 33 >