< ミカ書 5 >
1 今あなたは壁でとりまかれている。敵はわれわれを攻め囲み、 つえをもってイスラエルのつかさのほおを撃つ。
౧యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
2 しかしベツレヘム・エフラタよ、あなたはユダの氏族のうちで小さい者だが、イスラエルを治める者があなたのうちからわたしのために出る。その出るのは昔から、いにしえの日からである。
౨బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
3 それゆえ、産婦の産みおとす時まで、主は彼らを渡しおかれる。その後その兄弟たちの残れる者はイスラエルの子らのもとに帰る。
౩కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
4 彼は主の力により、その神、主の名の威光により、立ってその群れを養い、彼らを安らかにおらせる。今、彼は大いなる者となって、地の果にまで及ぶからである。
౪ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
5 これは平和である。アッスリヤびとがわれわれの国に来て、われわれの土地を踏むとき、七人の牧者を起し、八人の君を起してこれに当らせる。
౫అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
6 彼らはつるぎをもってアッスリヤの地を治め、ぬきみのつるぎをもってニムロデの地を治める。アッスリヤびとがわれわれの地に来て、われわれの境を踏み荒すとき、彼らはアッスリヤびとから、われわれを救う。
౬వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.
7 その時ヤコブの残れる者は多くの民の中にあること、人によらず、また人の子らを待たずに主からくだる露のごとく、青草の上に降る夕立ちのようである。
౭యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
8 またヤコブの残れる者が国々の中におり、多くの民の中にいること、林の獣の中のししのごとく、羊の群れの中の若いししのようである。それが過ぎるときは踏み、かつ裂いて救う者はない。
౮యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
9 あなたの手はもろもろのあだの上にあげられ、あなたの敵はことごとく断たれる。
౯నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. అది వారిని నిర్మూలం చేస్తుంది.
10 主は言われる、その日には、わたしはあなたのうちから馬を絶やし、戦車をこわし、
౧౦యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. నీ రథాలను ధ్వంసం చేస్తాను.
11 あなたの国の町々を絶やし、あなたの城をことごとくくつがえす。
౧౧నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను.
12 またあなたの手から魔術を絶やす。あなたのうちには占い師がないようになる。
౧౨మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.
13 またあなたのうちから彫像および石の柱を絶やす。あなたは重ねて手で作った物を拝むことはない。
౧౩చెక్కిన విగ్రహాలూ దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.
14 またあなたのうちからアシラ像を抜き倒し、あなたの町々を滅ぼす。
౧౪మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను.
15 そしてわたしは怒りと憤りとをもってその聞き従わないもろもろの国民に復讐する。
౧౫నేను మహా కోపంతో ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”