< ヨブ 記 30 >
1 しかし今はわたしよりも年若い者が、かえってわたしをあざ笑う。彼らの父はわたしが卑しめて、群れの犬と一緒にさえしなかった者だ。
౧ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందలు కాసే కుక్కలతో ఉండడానికి తగని వారని నేను తలంచాను.
2 彼らの手の力からわたしは何を得るであろうか、彼らはその気力がすでに衰えた人々だ。
౨వారి తండ్రుల చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి వయసు మళ్ళిపోవడం చేత వారి సత్తువతగ్గిపోయింది.
3 彼らは乏しさと激しい飢えとによって、かわいた荒れ地をかむ。
౩వారు పేదరికం చేత, కరువుచేత, శుష్కించిపోయిన వారు. పాడై నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలోని చీకటి తావుల్లో ఎండిన నేలలో వెదుకులాడుతారు.
4 彼らは、ぜにあおいおよび灌木の葉を摘み、れだまの根をもって身を暖める。
౪వారు తుప్పల్లోని రేవు కాడలను పెరుకుతారు. దూసరి తీగె వారికి ఆహారం.
5 彼らは人々の中から追いだされ、盗びとを追うように、人々は彼らを追い呼ばわる。
౫వారు మనుషుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముతూ కేకలు వేసినట్టు మనుషులు వారిని తరుముతూ కేకలు వేస్తారు.
6 彼らは急流の谷間に住み、土の穴または岩の穴におり、
౬భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది.
౭తుప్పల్లో వారు గాడిదల్లాగా ఓండ్ర పెడతారు ముళ్లచెట్ల కింద వారు కూర్చుంటారు.
8 彼らは愚かな者の子、また卑しい者の子であって、国から追いだされた者だ。
౮వారు మోటు వారికి, పేరు లేని పనికి మాలిన వారికి పుట్టినవారు. దేశంలోనుండి కొరడాలతో వారిని తరిమి వేశారు.
9 それなのに、わたしは今彼らの歌となり、彼らの笑い草となった。
౯అలాంటివారి కొడుకులు ఇప్పుడు నా గురించి పాటలు పాడుతారు. నేను వారి వేళాకోళానికి గురి అవుతున్నాను.
10 彼らはわたしをいとい、遠くわたしをはなれ、わたしの顔につばきすることも、ためらわない。
౧౦వారు నన్ను అసహ్యించుకుంటారు. నా దగ్గర నుండి దూరంగా పోతారు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు.
11 神がわたしの綱を解いて、わたしを卑しめられたので、彼らもわたしの前に慎みを捨てた。
౧౧ఆయన నా అల్లె తాడు తప్పించి నన్ను బాధించాడు. కాబట్టి వారు నాకు లోబడక నా అదుపు తప్పి పోయారు.
12 このともがらはわたしの右に立ち上がり、わたしを追いのけ、わたしにむかって滅びの道を築く。
౧౨నా కుడిపక్కన అల్లరిమూక లేస్తుంది. వారు నన్ను తరుముతారు. నాకు ఎదురుగా ముట్టడి దిబ్బ వేస్తారు.
13 彼らはわたしの道をこわし、わたしの災を促す。これをさし止める者はない。
౧౩వారిని అదుపు చేసే వారు లేరు. నా దారిని పాడు చేస్తారు. నా మీదికి ఆపద లాక్కొస్తారు.
14 彼らは広い破れ口からはいるように進みきたり、破壊の中をおし寄せる。
౧౪గొప్ప గండి పడి జలప్రవాహం వచ్చినట్టు వారు వస్తారు. ఆ వినాశంలో వారు కొట్టుకుపోతారు.
15 恐ろしい事はわたしに臨み、わたしの誉は風のように吹き払われ、わたしの繁栄は雲のように消えうせた。
౧౫భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘం లాగా నా అభివృద్ధి కదిలి వెళ్లి పోయింది.
16 今は、わたしの魂はわたしの内にとけて流れ、悩みの日はわたしを捕えた。
౧౬నా ప్రాణం నాలోనుంచి పార బోసినట్టు అయిపోయింది. కష్టకాలం నన్ను చేజిక్కించుకుంది.
17 夜はわたしの骨を激しく悩まし、わたしをかむ苦しみは、やむことがない。
౧౭రాత్రివేళ నా ఎముకలు నాలో విరుగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు.
18 それは暴力をもって、わたしの着物を捕え、はだ着のえりのように、わたしをしめつける。
౧౮దేవుని మహా బలం నా వస్త్రాన్ని ఒడిసి పట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకు పోతున్నది.
19 神がわたしを泥の中に投げ入れられたので、わたしはちり灰のようになった。
౧౯ఆయన నన్ను బురదలోకి తోసాడు. నేను దుమ్ములాగా బూడిదలాగా ఉన్నాను.
20 わたしがあなたにむかって呼ばわっても、あなたは答えられない。わたしが立っていても、あなたは顧みられない。
౨౦ఓ దేవా నీకు మొర పెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు.
21 あなたは変って、わたしに無情な者となり、み手の力をもってわたしを攻め悩まされる。
౨౧నువ్వు మారిపోయావు. నా పట్ల కఠినుడివైపోయావు. నీ బాహుబలంతో నన్ను హింసిస్తున్నావు.
22 あなたはわたしを揚げて風の上に乗せ、大風のうなり声の中に、もませられる。
౨౨గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు.
23 わたしは知っている、あなたはわたしを死に帰らせ、すべての生き物の集まる家に帰らせられることを。
౨౩నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు.
24 さりながら荒塚の中にある者は、手を伸べないであろうか、災の中にある者は助けを呼び求めないであろうか。
౨౪ఎవరైనా పడిపోతూ ఉన్నప్పుడు సహాయం కోసం చెయ్యి చాపడా? ఆపదలో రక్షించమని మొర పెట్టడా?
25 わたしは苦しい日を送る者のために泣かなかったか。わたしの魂は貧しい人のために悲しまなかったか。
౨౫బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?
26 しかしわたしが幸を望んだのに災が来た。光を待ち望んだのにやみが来た。
౨౬నాకు మేలు కలుగుతుందని నేను ఆశించాను. కానీ నాకు కీడు సంభవించింది. వెలుగు కోసం నేను కనిపెట్టగా చీకటి దక్కింది.
27 わたしのはらわたは沸きかえって、静まらない。悩みの日がわたしに近づいた。
౨౭నా పేగులు మానక మండుతున్నాయి అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి.
28 わたしは日の光によらずに黒くなって歩き、公会の中に立って助けを呼び求める。
౨౮సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను.
29 わたしは山犬の兄弟となり、だちょうの友となった。
౨౯నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను.
30 わたしの皮膚は黒くなって、はげ落ち、わたしの骨は熱さによって燃え、
౩౦నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి.
31 わたしの琴は悲しみの音となり、わたしの笛は泣く者の声となった。
౩౧నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది.