< ホセア書 10 >
1 イスラエルは実を結ぶ茂ったぶどうの木である。その実を多く結ぶにしたがって、祭壇を増し、その地の豊かなるにしたがって、柱の像を麗しくした。
౧ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగ గాసింది. ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ, వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.
2 彼らの心は偽りである。今、彼らはその罪を負わなければならない。主はその祭壇をこわし、その柱の像を砕かれる。
౨వారి హృదయం కపటమైనది, వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు. యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు. వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు.
3 今、彼らは言う、「われわれは主を恐れないので、われわれには王がない。王はわれわれのために何をなしえようか」と。
౩వాళ్ళిలా అంటారు. “మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం. రాజు మనకేమి చేస్తాడు?”
4 彼らはむなしき言葉をいだし、偽りの誓いをもって契約を結ぶ。それゆえ、さばきは畑のうねの毒草のように現れる。
౪వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.
5 サマリヤの住民は、ベテアベンの子牛のためにおののき、その民はこれがために嘆き、その偶像に仕える祭司たちは、その栄光のうせたるがために泣き悲しむ。
౫బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు.
6 その子牛はアッスリヤに携えられ、礼物として大王にささげられ、エフライムは恥をうけ、イスラエルはおのれの偶像を恥じる。
౬వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు.
7 サマリヤの王は、水のおもての木切れのように滅ぼされる。
౭షోమ్రోను రాజు నాశనమైపోతాడు. నీళ్లలో కొట్టుకు పోయే పుడకలాగా ఉంటాడు.
8 イスラエルの罪であるアベンの高き所も滅び、いばらとあざみがその祭壇の上にはえ茂る。その時彼らは山に向かって、「われわれをおおえ」と言い、丘に向かって「われわれの上に倒れよ」と言う。
౮ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తయిన పూజా స్థలాలు నాశనం అవుతాయి. వారి బలిపీఠాల మీద ముళ్ళ కంప పెరుగుతుంది. పర్వతాలతో “మమ్మల్ని కప్పండి” అనీ, కొండలను చూసి “మా మీద పడండి” అనీ వారు చెబుతారు.
9 イスラエルよ、あなたはギベアの日からこのかた罪を犯した。彼らはその所に立っていた。戦いはギベアにおる彼らに及ばないであろうか。
౯ఇశ్రాయేలూ, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు. వారు అక్కడ ఉండిపోయారు. గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా?
10 わたしは来てよこしまな民を攻め、これを懲らしめる。彼らがその二つの罪のために懲しめられるとき、もろもろの民は集まって彼らを攻める。
౧౦నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు, అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు.
11 エフライムはならされた若い雌牛であって、穀物を踏むことを好む。わたしはその麗しい首を惜しんだ。しかし、わたしはエフライムにくびきをかける。ユダは耕し、ヤコブは自分のために、まぐわをひかねばならない。
౧౧ఎఫ్రాయిము కంకులు నూర్చడంలో నైపుణ్యం సంపాదించిన పెయ్య. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కడతాను. ఎఫ్రాయిము పొలం దున్నుతాడు. యూదా భూమిని దున్నుతాడు. యాకోబు దాన్ని చదును చేస్తాడు.
12 あなたがたは自分のために正義をまき、いつくしみの実を刈り取り、あなたがたの新田を耕せ。今は主を求むべき時である。主は来て救いを雨のように、あなたがたに降りそそがれる。
౧౨మీ కోసం నీతి విత్తనం వేయండి. నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ, యెహోవాను వెదకడానికి ఇదే అదను.
13 あなたがたは悪を耕し、不義を刈りおさめ、偽りの実を食べた。これはあなたがたが自分の戦車を頼み、勇士の多いことを頼んだためである。
౧౩నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు. పాపమనే కోత కోసుకున్నావు. ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు. నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు.
14 それゆえ、あなたがたの民の中にいくさの騒ぎが起り、シャルマンが戦いの日にベテ・アルベルを打ち破ったように、あなたがたの城はことごとく打ち破られる。母らはその子らと共に打ち砕かれた。
౧౪నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది. ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.
15 イスラエルの家よ、あなたがたの大いなる悪のゆえに、このように、あなたがたにも行われ、イスラエルの王は、あらしの中に全く滅ぼされる。
౧౫ఇలా మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలూ, నీకు నాశనం ప్రాప్తిస్తుంది. ప్రాతఃకాలాన ఇశ్రాయేలు రాజును పూర్తిగా నిర్మూలం చేస్తారు.