< 創世記 11 >

1 全地は同じ発音、同じ言葉であった。
అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
2 時に人々は東に移り、シナルの地に平野を得て、そこに住んだ。
వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
3 彼らは互に言った、「さあ、れんがを造って、よく焼こう」。こうして彼らは石の代りに、れんがを得、しっくいの代りに、アスファルトを得た。
వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
4 彼らはまた言った、「さあ、町と塔とを建てて、その頂を天に届かせよう。そしてわれわれは名を上げて、全地のおもてに散るのを免れよう」。
వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
5 時に主は下って、人の子たちの建てる町と塔とを見て、
యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
6 言われた、「民は一つで、みな同じ言葉である。彼らはすでにこの事をしはじめた。彼らがしようとする事は、もはや何事もとどめ得ないであろう。
యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
7 さあ、われわれは下って行って、そこで彼らの言葉を乱し、互に言葉が通じないようにしよう」。
కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.
8 こうして主が彼らをそこから全地のおもてに散らされたので、彼らは町を建てるのをやめた。
ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
9 これによってその町の名はバベルと呼ばれた。主がそこで全地の言葉を乱されたからである。主はそこから彼らを全地のおもてに散らされた。
అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
10 セムの系図は次のとおりである。セムは百歳になって洪水の二年の後にアルパクサデを生んだ。
౧౦షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
11 セムはアルパクサデを生んで後、五百年生きて、男子と女子を生んだ。
౧౧షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
12 アルパクサデは三十五歳になってシラを生んだ。
౧౨అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
13 アルパクサデはシラを生んで後、四百三年生きて、男子と女子を生んだ。
౧౩అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
14 シラは三十歳になってエベルを生んだ。
౧౪షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
15 シラはエベルを生んで後、四百三年生きて、男子と女子を生んだ。
౧౫షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
16 エベルは三十四歳になってペレグを生んだ。
౧౬ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
17 エベルはペレグを生んで後、四百三十年生きて、男子と女子を生んだ。
౧౭ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
18 ペレグは三十歳になってリウを生んだ。
౧౮పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
19 ペレグはリウを生んで後、二百九年生きて、男子と女子を生んだ。
౧౯పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
20 リウは三十二歳になってセルグを生んだ。
౨౦రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
21 リウはセルグを生んで後、二百七年生きて、男子と女子を生んだ。
౨౧రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
22 セルグは三十歳になってナホルを生んだ。
౨౨సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
23 セルグはナホルを生んで後、二百年生きて、男子と女子を生んだ。
౨౩సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
24 ナホルは二十九歳になってテラを生んだ。
౨౪నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
25 ナホルはテラを生んで後、百十九年生きて、男子と女子を生んだ。
౨౫నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
26 テラは七十歳になってアブラム、ナホルおよびハランを生んだ。
౨౬తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
27 テラの系図は次のとおりである。テラはアブラム、ナホルおよびハランを生み、ハランはロトを生んだ。
౨౭తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
28 ハランは父テラにさきだって、その生れた地、カルデヤのウルで死んだ。
౨౮హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.
29 アブラムとナホルは妻をめとった。アブラムの妻の名はサライといい、ナホルの妻の名はミルカといってハランの娘である。ハランはミルカの父、またイスカの父である。
౨౯అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
30 サライはうまずめで、子がなかった。
౩౦శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
31 テラはその子アブラムと、ハランの子である孫ロトと、子アブラムの妻である嫁サライとを連れて、カナンの地へ行こうとカルデヤのウルを出たが、ハランに着いてそこに住んだ。
౩౧తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
32 テラの年は二百五歳であった。テラはハランで死んだ。
౩౨తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.

< 創世記 11 >