< エゼキエル書 35 >
౧యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2 「人の子よ、あなたの顔をセイル山に向け、これに対して預言し、
౨నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకుని దాని గురించి ఈ విషయం చెప్పు,
3 これに言え。主なる神はこう言われる、セイル山よ、見よ、わたしはあなたを敵とし、わたしの手をあなたに向かって伸べ、あなたを全く荒し、
౩“యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, శేయీరు పర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను.
4 あなたの町々を滅ぼす。あなたは荒れはてる。そしてわたしが主であることを悟る。
౪నీ పట్టణాలను నాశనం చేస్తాను. నువ్వు నిర్జనంగా ఉంటావు.” అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.
5 あなたは限りない敵意をいだいて、イスラエルの人々をその災の時、終りの刑罰の時に、つるぎの手に渡した。
౫ఇశ్రాయేలీయుల పట్ల నువ్వు ఎప్పుడూ పగతో ఉన్నావు. వారి విపత్తు సమయంలో, వారి దోష శిక్ష ముగింపు కాలంలో నువ్వు వారిని కత్తి పాలు చేశావు.
6 それゆえ、主なる神は言われる、わたしは生きている。わたしはあなたを血にわたす。血はあなたを追いかける。あなたには血のとががあるゆえ、血はあなたを追いかける
౬కాబట్టి నా జీవం తోడు. నేను నిన్ను రక్తపాతానికి గురి చేస్తాను. రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. రక్తపాతాన్ని నువ్వు అసహ్యించుకోలేదు కాబట్టి రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
7 わたしはセイル山を全く荒し、そこに行き来する者を断ち、
౭వచ్చే పోయే వాళ్ళు అక్కడ లేకుండా చేసి, నేను శేయీరు పర్వతాన్ని పాడుగా నిర్జనంగా చేస్తాను.
8 その山々を殺された者で満たす。つるぎで殺された者が、あなたのもろもろの丘、もろもろの谷、もろもろのくぼ地に倒れる。
౮అక్కడి పర్వతాలను చచ్చిన వాళ్ళతో నింపుతాను. నీ కొండల్లో లోయల్లో నీ వాగులన్నిటిలో వారు కత్తి పాలవుతారు.
9 わたしはあなたを、永遠の荒れ地とし、あなたの町々には住む者がなくなる。そしてあなたがたは、わたしが主であることを悟る。
౯నీ పట్టణాలను మళ్ళీ కట్టడం జరగదు. నువ్వు ఎప్పుడూ పాడుగా ఉంటావు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
10 あなたは言う、『これら二つの国民、二つの国はわたしのもの、われわれはこれを獲よう』と。しかし主はそこにおられる。
౧౦యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు రాజ్యాలూ ఆ రెండు ప్రాంతాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకుందాం రండి. అని నీవు అన్నావు.
11 それゆえ、主なる神は言われる、わたしは生きている。あなたが彼らを憎んで、彼らに示した怒りと、ねたみにしたがって、わたしはあなたを扱う。わたしがあなたをさばく時、わたし自身をあなたに示す。
౧౧నా జీవం తోడు నువ్వు పగ పట్టి వారి పట్ల చూపిన అసూయకూ కోపానికీ నేను తగిన విధంగా నీ పట్ల వ్యవహరిస్తాను. నిన్ను శిక్షించేటప్పుడు వారికి నన్ను నేనే తెలియపరచుకుంటాను. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
12 あなたがイスラエルの山々に向かって、『これは荒れはてて、われわれの食となる』と言ったもろもろのそしりを、主なるわたしが聞いたことをあなたは悟る。
౧౨అవి పాడైపోయాయి, మనం వాటిని దిగమింగేలా మన వశమయ్యాయి, అని నువ్వు ఇశ్రాయేలు పర్వతాలను గురించి పలికిన దూషణ మాటలన్నీ నేను, యెహోవాను విన్నాను.
13 あなたがたは、わたしに対して口をもって誇り、またわたしに対して、あなたがたの言葉を多くした。わたしはそれを聞いた。
౧౩నోరు పెద్దగా చేసుకుని నువ్వు నాకు విరోధంగా ఎన్నో సంగతులు చెప్పావు. నేను వాటిని విన్నాను.
14 主なる神はこう言われる、全地の喜びのために、わたしはあなたを荒れ地とする。
౧౪యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, లోకమంతా సంతోషించేటప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను.
15 あなたが、イスラエルの家の嗣業の荒れるのを喜んだように、わたしはあなたに、そのようにする。セイル山よ、あなたは荒れ地となる。エドムもすべてそのようになる。そのとき彼らは、わたしが主であることを悟るようになる。
౧౫ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవడం చూసి నువ్వు సంతోషించావు కాబట్టి నీకూ అలాగే చేస్తాను. శేయీరు పర్వతమా! నువ్వు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!