< 歴代誌Ⅰ 1 >

1 アダム、セツ、エノス、
ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
2 ケナン、マハラレル、ヤレド、
ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
3 エノク、メトセラ、ラメク、
యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
4 ノア、セム、ハム、ヤペテ。
లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
5 ヤペテの子らはゴメル、マゴグ、マダイ、ヤワン、トバル、メセク、テラス。
యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
6 ゴメルの子らはアシケナズ、デパテ、トガルマ。
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
7 ヤワンの子らはエリシャ、タルシシ、キッテム、ロダニム。
యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
8 ハムの子らはクシ、エジプト、プテ、カナン。
హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
9 クシの子らはセバ、ハビラ、サブタ、ラアマ、サブテカ。ラアマの子らはシバとデダン。
కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
10 クシはニムロデを生んだ。ニムロデは初めて世の権力ある者となった。
౧౦కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
11 エジプトはルデびと、アナムびと、レハブびと、ナフトびと、
౧౧ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
12 パテロスびと、カスルびと、カフトルびとを生んだ。カフトルびとからペリシテびとが出た。
౧౨పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
13 カナンは長子シドンとヘテを生んだ。
౧౩కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
14 またエブスびと、アモリびと、ギルガシびと、
౧౪ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
15 ヒビびと、アルキびと、セニびと、
౧౫హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
16 アルワデびと、ゼマリびと、ハマテびとを生んだ。
౧౬అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
17 セムの子らはエラム、アシュル、アルパクサデ、ルデ、アラム、ウズ、ホル、ゲテル、メセクである。
౧౭షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
18 アルパクサデはシラを生み、シラはエベルを生んだ。
౧౮అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
19 エベルにふたりの子が生れた。ひとりの名はペレグ彼の代に地の民が散り分れたからであるその弟の名はヨクタンといった。
౧౯ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
20 ヨクタンはアルモダデ、シャレフ、ハザル・マウテ、エラ、
౨౦యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 ハドラム、ウザル、デクラ、
౨౧హదోరము, ఊజాలు, దిక్లాను,
22 エバル、アビマエル、シバ、
౨౨ఏబాలు, అబీమాయేలు, షేబా,
23 オフル、ハビラ、ヨバブを生んだ。これらはみなヨクタンの子である。
౨౩ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
24 セム、アルパクサデ、シラ、
౨౪షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
25 エベル、ペレグ、リウ、
౨౫ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
26 セルグ、ナホル、テラ、
౨౬రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
27 アブラムすなわちアブラハムである。
౨౭తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
28 アブラハムの子らはイサクとイシマエルである。
౨౮అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
29 彼らの子孫は次のとおりである。イシマエルの長子はネバヨテ、次はケダル、アデビエル、ミブサム、
౨౯వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
30 ミシマ、ドマ、マッサ、ハダデ、テマ、
౩౦మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31 エトル、ネフシ、ケデマ。これらはイシマエルの子孫である。
౩౧యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
32 アブラハムのそばめケトラの子孫は次のとおりである。彼女はジムラン、ヨクシャン、メダン、ミデアン、イシバク、シュワを産んだ。ヨクシャンの子らはシバとデダンである。
౩౨అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
33 ミデアンの子らはエパ、エペル、ヘノク、アビダ、エルダア。これらはみなケトラの子孫である。
౩౩మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
34 アブラハムはイサクを生んだ。イサクの子らはエサウとイスラエル。
౩౪అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
35 エサウの子らはエリパズ、リウエル、エウシ、ヤラム、コラ。
౩౫ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
36 エリパズの子らはテマン、オマル、ゼピ、ガタム、ケナズ、テムナ、アマレク。
౩౬వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
37 リウエルの子らはナハテ、ゼラ、シャンマ、ミッザ。
౩౭రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
38 セイルの子らはロタン、ショバル、ヂベオン、アナ、デション、エゼル、デシャン。
౩౮శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39 ロタンの子らはホリとホマム。ロタンの妹はテムナ。
౩౯లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
40 ショバルの子らはアルヤン、マナハテ、エバル、シピ、オナム。ヂベオンの子らはアヤとアナ。
౪౦శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
41 アナの子はデション。デションの子らはハムラン、エシバン、イテラン、ケラン。
౪౧అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42 エゼルの子らはビルハン、ザワン、ヤカン。デシャンの子らはウズとアラン。
౪౨ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
43 イスラエルの人々を治める王がまだなかった時、エドムの地を治めた王たちは次のとおりである。ベオルの子ベラ。その都の名はデナバといった。
౪౩ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
44 ベラが死んで、ボズラのゼラの子ヨバブが代って王となった。
౪౪బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
45 ヨバブが死んで、テマンびとの地のホシャムが代って王となった。
౪౫యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
46 ホシャムが死んで、ベダテの子ハダデが代って王となった。彼はモアブの野でミデアンを撃った。彼の都の名はアビテといった。
౪౬హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
47 ハダデが死んで、マスレカのサムラが代って王となった。
౪౭హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
48 サムラが死んで、ユフラテ川のほとりのレホボテのサウルが代って王となった。
౪౮శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
49 サウルが死んで、アクボルの子バアル・ハナンが代って王となった。
౪౯షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
50 バアル・ハナンが死んで、ハダデが代って王となった。彼の都の名はパイといった。彼の妻はマテレデの娘であって、名をメヘタベルといった。マテレデはメザハブの娘である。
౫౦బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
51 ハダデも死んだ。エドムの族長は、テムナ侯、アルヤ侯、エテテ侯、
౫౧హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
52 アホリバマ侯、エラ侯、ピノン侯、
౫౨అహలీబామా, ఏలా, పీనోను,
53 ケナズ侯、テマン侯、ミブザル侯、
౫౩కనజు, తేమాను, మిబ్సారు,
54 マグデエル侯、イラム侯。これらはエドムの族長である。
౫౪మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.

< 歴代誌Ⅰ 1 >