< サムエル記Ⅱ 8 >
1 此後ダビデ、ペリシテ人を撃てこれを服すダビデまたペリシテ人の手よりメテグアンマをとれり
౧దావీదు ఫిలిష్తీయులను ఓడించి వారిని లోబరచుకుని వారి ఆధీనంలో ఉన్న మెతెగమ్మాను ఆక్రమించుకున్నాడు.
2 ダビデまたモアブを撃ち彼らをして地に伏しめ繩をもてかれらを度れり即ち二條の繩をもて死す者を度り一條の繩をもて生しおく者を量度るモアブ人は貢物を納てダビデの臣僕となれり
౨అతడు మోయాబీయులను ఓడించి, పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. రెండు కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలనీ, ఒక కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలనీ నిర్ణయించాడు. అప్పటినుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు.
3 ダビデまたレホブの子なるゾバの王ハダデゼルがユフラテ河の邊にて其勢を新にせんとて往るを撃り
౩సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి
4 しかしてダビデ彼より騎兵千七百人歩兵二萬人を取りまたダビデ一百の車の馬を存して其餘の車馬は皆其筋を切斷り
౪అతని దగ్గరనుండి వెయ్యీ ఏడు వందల మంది గుర్రపు రౌతులను, ఇరవై వేల కాల్బలాన్ని పట్టుకుని, వారి గుర్రాల మందలో వంద ఉంచుకుని, మిగిలినవాటి చీలమండ నరాలను కోయించాడు.
5 ダマスコのスリア人ゾバの王ハダデゼルを援んとて來りければダビデ、スリア人二萬二千を殺せり
౫దమస్కులో ఉన్న అరామీయులు సోబా రాజైన హదదెజెరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.
6 しかしてダビデ、ダマスコのスリアに代官を置きぬスリア人は貢物を納てダビデの臣僕となれりヱホバ、ダビデを凡て其往く所にて助けたまへり
౬దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.
7 ダビデ、ハダデゼルの臣僕等の持る金の楯を奪ひてこれをエルサレムに携きたる
౭హదదెజెరు సేవకుల దగ్గర ఉన్న బంగారు శూలాలను దావీదు స్వాధీనం చేసుకుని యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చాడు.
8 ダビデ王又ハダデゼルの邑ベタとベロタより甚だ多くの銅を取り
౮దావీదు రాజు హదదెజెరుకు చెందిన బెతహు, బేరోతై అనే పట్టణాల్లో ఉన్న విస్తారమైన ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.
9 時にハマテの王トイ、ダビデがハダデゼルの總の軍を撃破りしを聞て
౯దావీదు హదదెజెరు సైన్యం మొత్తాన్ని హతం చేశాడన్న వార్త హమాతు రాజైన తోయికి వినబడింది.
10 トイ其子ヨラムをダビデ王につかはし安否を問ひかつ祝を宣しむ其はハダデゼル嘗てトイと戰を爲したるにダビデ、ハダデゼルとたたかひてこれを撃やぶりたればなりヨラム銀の器と金の器と銅の器を携へ來りければ
౧౦హదదెజెరు, తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజెరుతో యుద్ధం చేసి అతణ్ణి ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి, క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు.
11 ダビデ王其攻め伏せたる諸の國民の中より取りて納めたる金銀と共に是等をもヱホバに納めたり
౧౧రాజైన దావీదు అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల, అమాలేకీయుల రాజ్యాలను జయించి దోచుకొన్న బంగారం, వెండితో పాటు,
12 即ちエドムよりモアブよりアンモンの子孫よりペリシテ人よりアマレクよりえたる物およびゾバの王レホブの子ハダデゼルより得たる掠取物とともにこれを納めたり
౧౨రెహోబు కొడుకు హదదెజెరు అనే సోబా రాజు దగ్గర దోచుకొన్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు.
13 ダビデ鹽谷にてエドム人一萬八千を撃て歸て名譽を得たり
౧౩దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.
14 ダビデ、エドムに代官を置り即ちエドムの全地に徧く代官を置てエドム人は皆ダビデの臣僕となれりヱホバ、ダビデを凡て其往くところにて助け給へり
౧౪ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ వచ్చాడు.
15 ダビデ、イスラエルの全地を治め其民に公道と正義を行ふ
౧౫దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్లా నీతి న్యాయాలు జరిగించాడు.
16 ゼルヤの子ヨアブは軍の長アヒルデの子ヨシヤバテは史官
౧౬సెరూయా కొడుకు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యానికి చెందిన దస్తావేజుల పర్యవేక్షణ అధికారి.
17 アヒトブの子ザドクとアビヤタルの子アヒメレクは祭司セラヤは書記官
౧౭అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకులు యాజకులు. శెరాయా లేఖికుడు.
18 ヱホヤダの子ベナヤはケレテ人およびペレテ人の長ダビデの子等は大臣なりき
౧౮యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధికారి. దావీదు కొడుకులు రాజ్య సభలో ప్రముఖులు.