< Mazmur 135 >
1 Pujilah TUHAN! Pujilah nama TUHAN, hai kamu hamba-hamba-Nya
౧యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.
2 yang berbakti di Rumah TUHAN di kediaman Allah kita.
౨యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.
3 Pujilah TUHAN, sebab Ia baik, pujilah nama-Nya, sebab Ia murah hati.
౩యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!
4 Ia memilih Yakub bagi diri-Nya, umat Israel dijadikan milik-Nya.
౪యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.
5 Sebab aku tahu TUHAN sungguh besar, Ia agung melebihi segala dewa.
౫యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు.
6 Ia melakukan apa yang dikehendaki-Nya, di langit dan di bumi, di laut dan di samudra yang dalam.
౬భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.
7 Dari ujung bumi Ia mendatangkan awan, dibuat-Nya kilat untuk hujan. Lalu Ia memerintahkan angin supaya keluar dari tempat penyimpanan-Nya.
౭భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.
8 Di Mesir Ia membunuh semua anak sulung dari manusia maupun binatang.
౮ఈజిప్టు ప్రజల తొలిచూలు సంతానాన్ని, పశువుల తొలి సంతతిని ఆయన హతం చేశాడు.
9 Di sana dibuat-Nya banyak keajaiban dan tanda untuk menghukum raja dan semua pegawainya.
౯ఐగుప్తూ, నీ మధ్య ఆయన సూచకక్రియలు, అద్భుతాలు కనపరచాడు. ఫరోకు, అతని పరివారానికీ వ్యతిరేకంగా వాటిని చేశాడు.
10 Ia membinasakan banyak bangsa, dan membunuh raja-raja perkasa:
౧౦ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.
11 Sihon raja Amori dan Og raja Basan, serta semua raja di Kanaan.
౧౧అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.
12 Lalu negeri mereka diserahkan-Nya menjadi milik Israel, umat-Nya.
౧౨ఆయన వాళ్ళ దేశాలను స్వాస్థ్యంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
13 Ya TUHAN, Engkau akan tetap diwartakan, dan nama-Mu diingat oleh semua keturunan,
౧౩యెహోవా, నీ నామం శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గూర్చిన జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
14 sebab Engkau memberi keadilan kepada umat-Mu, dan mengasihani hamba-hamba-Mu.
౧౪యెహోవా తన ప్రజల పక్షంగా నిలబడతాడు. అయితే తన సేవకుల విషయం కనికరం చూపిస్తాడు.
15 Berhala mereka dari emas dan perak, buatan tangan manusia.
౧౫ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.
16 Mereka mempunyai mulut, tetapi tak dapat berbicara, mempunyai mata, tetapi tak dapat melihat.
౧౬వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు.
17 Mereka mempunyai telinga, tetapi tak dapat mendengar, dari mulutnya tidak keluar napas.
౧౭వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.
18 Semoga begitulah nasib orang-orang yang membuatnya, dan yang percaya kepadanya.
౧౮వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.
19 Pujilah TUHAN, hai umat Israel, pujilah Dia, hai imam-imam Allah!
౧౯ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.
20 Pujilah TUHAN, hai orang-orang Lewi, pujilah Dia, kamu semua yang takwa.
౨౦లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.
21 Pujilah TUHAN di Sion, di Yerusalem tempat kediaman-Nya. Pujilah TUHAN!
౨౧యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.