< Keluaran 38 >
1 Bezaleel mengambil kayu akasia, lalu dibuatnya mezbah untuk kurban bakaran. Mezbah itu berbentuk persegi, panjangnya dan lebarnya masing-masing 2,2 meter, dan tingginya 1,3 meter.
౧అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.
2 Pada setiap sudut atasnya dibuat tanduk yang jadi satu dengan mezbah itu. Seluruhnya dilapisi dengan perunggu.
౨దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.
3 Dibuatnya juga kuali-kuali, sekop, mangkuk-mangkuk, garpu-garpu dan tempat api. Semua perlengkapan itu dibuat dari perunggu.
౩బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.
4 Dibuatnya anyaman kawat dari perunggu yang dililitkan pada mezbah bagian bawah, tingginya setengah dari tinggi mezbah.
౪బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.
5 Lalu dibuatnya empat gelang untuk kayu pengusung pada keempat sudut bawahnya.
౫ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.
6 Kayu pengusung itu dibuatnya dari kayu akasia yang dilapisi dengan perunggu.
౬ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.
7 Lalu kedua kayu pengusung itu dimasukkannya ke dalam gelang-gelang pada kedua sisi mezbah itu. Mezbah itu dibuatnya dari papan dan bagian dalamnya berongga.
౭ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.
8 Bezaleel membuat bak perunggu dengan alas perunggu. Perunggu itu dari cermin-cermin kepunyaan wanita-wanita yang melayani di pintu Kemah TUHAN.
౮గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
9 Bezaleel memagari pelataran Kemah TUHAN dengan layar dari kain linen halus. Di bagian selatan, panjangnya 44 meter,
౯అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.
10 ditahan oleh dua puluh tiang perunggu, masing-masing dalam alas perunggu, dengan kait dan sangkutannya dari perak.
౧౦ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.
11 Di sebelah utara dibuat seperti itu juga.
౧౧ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.
12 Di sebelah barat dipasang layar sepanjang 22 meter, dengan sepuluh tiang dan sepuluh alas; kait dan penyambungnya dibuat dari perak.
౧౨పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.
13 Di sebelah timur, yang ada pintunya, lebar layarnya juga 22 meter.
౧౩తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.
14 Di kiri kanan pintu itu dipasang layar, masing-masing panjangnya 6,6 meter, dengan tiga tiang dan tiga alas.
౧౪ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
౧౫ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
16 Semua layar di sekeliling pelataran itu dibuat dari kain linen halus.
౧౬ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.
17 Alas tiang-tiangnya dibuat dari perunggu, sedangkan kait, sambungan dan puncak tiangnya dibuat dari perak. Semua tiang di sekitar pelataran itu dihubungkan satu sama lain dengan sangkutan perak.
౧౭స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.
18 Tirai pintu gerbang pelataran itu dibuat dari linen halus yang ditenun dengan wol biru, ungu dan merah serta dihias dengan sulaman. Panjangnya sembilan meter dan tingginya dua meter, sama dengan layar dari pelataran.
౧౮ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.
19 Kain pintu itu ditahan oleh empat tiang dengan empat alas perunggu. Semua kait, tutup puncaknya dan sangkutannya dibuat dari perak,
౧౯వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.
20 tetapi patok-patok untuk Kemah dan untuk pagarnya dibuat dari perunggu.
౨౦వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.
21 Inilah daftar logam yang dipakai dalam Kemah TUHAN, tempat kedua batu dengan Sepuluh Perintah Allah itu disimpan. Daftar itu dibuat atas perintah Musa dan disusun oleh orang-orang Lewi yang bekerja di bawah pimpinan Itamar, anak Imam Harun.
౨౧మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.
22 Bezaleel anak Uri, cucu Hur dari suku Yehuda, membuat segala yang diperintahkan TUHAN.
౨౨యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.
23 Pembantunya, Aholiab anak Ahisamakh dari suku Dan, adalah seorang tukang ukir, perancang dan penenun kain linen halus, serta wol biru, ungu dan merah.
౨౩దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.
24 Emas yang dipersembahkan kepada TUHAN untuk Kemah Suci seluruhnya berjumlah seribu kilogram, ditimbang menurut timbangan yang berlaku di Kemah TUHAN.
౨౪పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్.
25 Perak yang diperoleh dari sensus bangsa Israel berjumlah 3.430 kilogram ditimbang menurut timbangan yang berlaku di Kemah TUHAN.
౨౫జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్.
26 Jumlah itu sama dengan apa yang dibayar oleh semua orang yang terdaftar dalam sensus itu. Setiap orang membayar harga yang ditentukan, ditimbang menurut timbangan yang berlaku. Dalam sensus itu terdaftar 603.550 orang laki-laki yang berumur dua puluh tahun ke atas.
౨౬ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.
27 Dari perak itu, 3.400 kilogram dipakai untuk membuat keseratus alas tiang Kemah TUHAN dan kain pintunya. Tiap alas beratnya 34 kilogram.
౨౭అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.
28 Dari sisa perak itu, sebanyak 30 kilogram, Bezaleel membuat penyambung-penyambung dan kait-kait untuk tiang-tiangnya, serta tutup puncak tiang-tiang itu.
౨౮1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.
29 Perunggu yang dipersembahkan kepada TUHAN semuanya berjumlah 2.425 kilogram.
౨౯అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు.
30 Perunggu itu dipakai untuk membuat alas pintu Kemah TUHAN, mezbah dengan anyaman kawat dari perunggu, seluruh perlengkapan mezbah,
౩౦అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.
31 alas layar sekeliling pelataran dan pintu gerbangnya, semua patok Kemah dan pelataran sekelilingnya.
౩౧ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.