< Dagiti Salmo 43 >

1 Ukomennak, O Dios, ken ipakaasim ti kalintegak kadagiti saan a nadiosan a nasion;
దేవా, నాకు న్యాయం తీర్చు. దైవభక్తిలేని ప్రజలతో నా తరుపున వాదించు.
2 Ta sika ti Dios ti pigsak; apay nga imbellengnak? Apay nga agdung-awak iti panangparigat dagiti kabusor?
నా బలానికి ఆధారమైన దేవుడివి నువ్వే. నన్ను ఎందుకు తోసివేశావు? నీవు నాకు దుర్గం వంటి దేవుడివి. శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?
3 O, ibaonmo ti silawmo ken ti kinapudnom; idalandak koma; ipandak koma iti nasantoan a turodmo ken iti tabernakulom.
నీ వెలుగునూ, నీ సత్యాన్నీ పంపించు. అవి నాకు దారి చూపనీ. అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికీ, నీ నివాసాలకూ నన్ను తీసుకు వెళ్ళనీ.
4 Ket mapanakto iti altar ti Dios, iti Dios nga aglaplapusanan a rag-ok; ken iti arpa idaydayawkanto, O Dios, a Diosko.
అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.
5 Apay a nakadumogka, kararuak? Apay a maringgoranka iti kaunggak? Mangnamnamaka iti Dios; ta agdayawak pay kenkuana, nga isu ti tulong ken Diosko.
నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? నీలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. నా సహాయం, నా దేవుడూ అయిన ఆయన్ని నేను స్తుతిస్తాను.

< Dagiti Salmo 43 >