< Josue 18 >
1 Kalpasanna, nagsasarak ti entero a taripnong dagiti tattao ti Israel idiay Silo. Impatakderda sadiay ti tabernakulo ken sinakupda ti daga iti sangoananda.
౧ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు.
2 Adda pay pito a tribu dagiti tattao ti Israel a saan pay a naibingayan iti tawid.
౨ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి.
3 Kinuna ni Josue kadagiti tattao ti Israel, “Kasano kabayag ti panangitantanyo ti ipapanyo iti daga nga inted kadakayo ni Yahweh, a Dios dagiti kapuonanyo?
౩కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు?
4 Mangdutokkayo iti tallo a lallaki manipud iti tunggal tribu, ket ibaonko ida. Mapanda ket kitaenda ti daga. Mangaramiddanto iti mapa a pakakitaan kadagiti tawidenda, ket kalpasanna, agsublidanto kaniak.
౪ఒక్కొక్క గోత్రానికి ముగ్గుర్ని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటాతిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరికి తీసుకురావాలి.
5 Bingayendanto daytoy iti pito a paset. Agtalinaedto ni Juda iti masakupanda idiay abagatan, ken agtalinaedto ti balay ni Jose iti masakupanda idiay amianan.
౫వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి.
6 Mapaenyonton ti daga iti pito a paset ket iyegyo kaniak ditoy ti mapana. Bunotekto iti sangoanan ni Yahweh a Diostayo no ania a paset ti maited iti tunggal maysa.
౬మీరు ఏడు వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను.
7 Awan ti paset dagiti Levita kadakayo, ta ti kinapadida kenni Yahweh ti tawidda. Naawat ti Gad, Ruben ken ti kagudua a tribu ti Manases ti tawidda, iti ballasiw ti Jordan. Daytoy ti tawid nga inted kadakuada ni Moises nga adipen ni Yahweh.”
౭లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం, యొర్దాను అవతల తూర్పువైపున స్వాస్థ్యాన్ని పొందారు.”
8 Isu a nagrubuat dagiti lallaki ket napanda. Binilin ni Josue dagiti napan a mangmapa iti daga, a kunana, “Sursorenyo ti daga ket iyaramidanyo daytoy iti mapa ket agsublikayo kaniak. Bunotekto iti sangoanan ni Yahweh idiay Silo no ania a paset ti maited iti tunggal maysa.”
౮ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ “మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అన్నాడు.
9 Pimmanaw dagiti lallaki ket sinursorda ti daga sada inyaramidan daytoy iti mapa iti nalukot a pagsuratan babaen kadagiti siudadna iti pito a paset, inlislistada dagiti siudad iti tunggal paset. Ket nagsublida kenni Josue iti kampo idiay Silo.
౯వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.
10 Kalpasanna, nangbunot ni Josue iti sangoanan ni Yahweh idiay Silo no ania a paset ti maited iti tungga maysa. Ket biningay ni Josue ti daga kadagiti tattao ti Israel-naikkan ti tunggal maysa iti pasetna iti daga.
౧౦వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
11 Ti bingay a daga para iti tribu ti Benjamin ket naited iti tunggal pulida. Ti masakupan ti daga a bingayda ket masarakan iti nagbaetan dagiti kaputotan ni Juda ken dagiti kaputotan ni Jose.
౧౧బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం, వాటా వచ్చింది. వారి వాటా సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకు, యోసేపు వంశస్థుల సరిహద్దుకు మధ్య ఉంది.
12 Iti amianan, nangrugi ti beddengda idiay Jordan. Nagpasang-at ti beddeng iti amianan a paset ti Jerico, ket kalpasanna agpalaud a lumasat iti katurturodan a pagilian. Dimmanon daytoy idiay let-ang iti Bet Aven.
౧౨ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు యెరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బేతావెను అరణ్యం దగ్గర అంతం అయింది.
13 Manipud sadiay, naglayon ti beddeng nga agpa-abagatan iti Luz (isu met laeng ti lugar a Betel). Kalpasanna, agpababa ti beddeng iti Atarot Adar, iti bantay nga adda iti abagatan ti Bet Horon.
౧౩అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకూ వెళ్ళింది.
14 Agturong ti beddeng iti sabali a pagturongan, agkurba iti akin-laud a paset, nga agpa-abagatan iti bantay, iti kasumbangir ti Bet Horon. Nagpatingga daytoy idiay Kiriat Baal (wenno Kiriat Jearim), ti siudad a kukua iti tribu ti Juda. Daytoy ti pakabuklan ti akinlaud a paset.
౧౪అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బేత్‌హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనే కిర్యత్యారీము వరకూ వెళ్ళింది, అది పడమటి సరిహద్దు.
15 Nangrugi ti akin abagatan a paset iti asideg ti Kiriat Jearim. Nangrugi sadiay ti beddeng agingga iti Epron, agingga kadagiti ubbog iti Neftoa.
౧౫దక్షిణం వైపు కిర్యత్యారీము కొననుండి దాని సరిహద్దు పడమరగా నెఫ్తోయ నీళ్ల ఊటవరకూ సాగి
16 Nagpababa ngarud ti nagbeddengan agingga iti beddeng ti bantay a tumannawag iti tanap ti Ben Hinnom, nga adda iti akin-amianan a pungto iti tanap ti Refaim. Nagpababa daytoy agingga iti tanap ti Hinnom, iti abagatan iti bakras dagiti Jebuseo, ken nagpababa agingga iti En Rogel.
౧౬ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.
17 Nagkurba daytoy nga agpa amianan, nga agturong iti Ensemes, ken manipud sadiay rimmuar daytoy iti Gelilot, a kasumbangir ti sang-atan ti Adummim. Kalpasanna, simmalog daytoy iti Bato ni Bohan (ni Bohan ket anak a lalaki ni Ruben).
౧౭అది ఉత్తరంగా ఏన్‌షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.
18 Naglayon daytoy iti amianan a paset ti Bet Araba ket nagpababa agingga iti Araba.
౧౮అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బేత్‌హోగ్లా వరకూ వెళ్ళింది.
19 Naglayon ti beddeng iti amianan a paset ti Bet Hogla. Nagpatingga ti beddeng idiay amianan a sabangan ti Natay a Baybay, iti akin abagatan a pungto ti Jordan. Daytoy ti nagbeddengan iti abagatan.
౧౯అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయింది. ఇది దక్షిణ సరిహద్దు.
20 Nangrugi ti beddeng ti Jordan iti akindaya a paset. Daytoy ti tawid iti tribu ti Benjamin, ken naited daytoy iti tunggal pulida, nagbebeddengan iti amin nga aglawlaw.
౨౦తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది.
21 Ita, dagiti siudad iti tribu ti Benjamin segun kadagiti pulida ket Jerico, Bet Hogla, Emek Kesis,
౨౧బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో, బేత్‌హోగ్లా, యెమెక్కెసీసు,
22 Bet Araba, Sumaraim, Betel,
౨౨బేత్ అరాబా, సెమరాయిము,
౨౩బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా,
24 Kepar Ammoni, Opni, ken Gaba. Adda sangapulo ket dua a siudad, saan a naibilang dagiti barioda.
౨౪కెఫార్ అమ్మోని, ఒప్ని, గెబా అనేవి, వాటి పల్లెలు కాక పన్నెండు పట్టణాలు.
25 Adda pay dagiti siudad iti Gabaon, Rama, Beerot,
౨౫గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
౨౬కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా,
27 Rekem, Irpeel, Tarala,
౨౭సేలా, ఎలెపు, యెరూషలేము అనే ఎబూసు, గిబియా, కిర్యతు అనేవి. వాటి పల్లెలు పోతే పద్నాలుగు పట్టణాలు.
28 Sela, Haclef, Jebus(nga isu met laeng ti Jerusalem), Gibea ken Kiriat. Adda sangapulo ket uppat a siudad, saan a naibilang dagiti barioda. Daytoy ti tawid ti Benjamin para kadagiti pulina.
౨౮వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం.