< Zakariás 7 >

1 És lőn a Dárius király negyedik esztendejében, hogy szóla az Úr Zakariáshoz a kilenczedik hónapnak, a Kiszlévnek negyedikén,
రాజైన దర్యావేషు పరిపాలనలో నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగవ దినాన యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది.
2 Mikor elküldék az Isten házába Saréczert és Régem-Méleket és társait, hogy esedezzenek az Úr színe előtt,
బేతేలువారు యెహోవాను బతిమాలుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును వారితో బాటు వారి మనుషులను పంపించారు.
3 És hogy megkérdezzék a papokat, a kik a Seregek Urának házában vannak, és megkérdezzék a prófétákat is: Sírjak-é az ötödik hónapban és bőjtöljek-é, a mint cselekedtem azt néhány esztendő óta?
మందిరం దగ్గరనున్న యాజకులతో ప్రవక్తలతో “ఇన్ని సంవత్సరాలుగా మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించమంటారా” అని మనవి చేశారు.
4 Szóla ekkor a Seregeknek Ura nékem, mondván:
సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
5 Szólj az ország minden népének és a papoknak, mondván: Mikor bőjtöltetek és gyászoltatok az ötödik és hetedik hónapban, és pedig hetven esztendeig: avagy bőjtölvén, nékem bőjtöltetek-é?
“దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి. జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా? నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?
6 És mikor ettetek, és mikor ittatok: avagy nem magatoknak ettetek és magatoknak ittatok-é?
మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు? మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?
7 Avagy nem ezek a beszédek-é azok, a melyeket szólott vala az Úr az előbbi próféták által, mikor még Jeruzsálem népes és gazdag vala a körülte levő városokkal együtt, és mind a déli táj, mind a lapály-föld népes vala?
యెరూషలేములోనూ, దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశంలోనూ, పడమటి మైదాన భూముల్లోను ప్రజలు విస్తరించి క్షేమంగా ఉన్న కాలంలో పూర్వపు ప్రవక్తల ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకో లేదు గదా?”
8 És szóla az Úr Zakariásnak, mondván:
యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
9 Így szólt a Seregeknek Ura, mondván: Igaz ítélettel ítéljetek, és irgalmasságot és könyörületességet gyakoroljon kiki az ő felebarátjával!
“సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
10 Özvegyet és árvát, jövevényt és szegényt meg ne sarczoljatok, és egymás ellen még szívetekben se gondoljatok gonoszt.
౧౦వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
11 De nem akarák meghallani, sőt vállaikat vonogaták, és bedugák füleiket, hogy ne halljanak.
౧౧అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.
12 Szívöket is megkeményíték, hogy ne hallják a törvényt és az igéket, a melyeket a Seregeknek Ura küldött vala az ő lelke által, az elébbi próféták által. És igen felgerjedt vala a Seregeknek Ura.
౧౨ధర్మశాస్త్రాన్ని గానీ, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సేనల ప్రభువు యెహోవా తన ఆత్మ ప్రేరణచేత తెలియజేసిన మాటలను గానీ, వినకుండా హృదయాలను వజ్రాల వలె కఠిన పరచుకున్నారు. కనుక సేనల ప్రభువు యెహోవా దగ్గర నుండి మహోగ్రత వారి మీదికి వచ్చింది.
13 És lőn, hogy a mint én kiáltottam és nem hallották meg: úgy kiáltottak, de nem hallottam meg, azt mondja a Seregeknek Ura;
౧౩కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.
14 Hanem szétszórtam őket mindenféle nemzetek közé, a kik nem ismerték őket, és puszta lőn utánok a föld, hogy senki azon sem át nem megy, sem meg nem tér. Így tevék pusztává a kívánatos földet.
౧౪వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది. ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”

< Zakariás 7 >