< Zakariás 1 >
1 Dárius második esztendejében, a nyolczadik hónapban szóla az Úr Zakariáshoz, a Berekiás fiához, a ki Iddó próféta fia, mondván:
౧దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.
2 Igen megharagudott az Úr a ti atyáitokra.
౨“యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు.
3 Mondjad azért nékik: Ezt mondja a Seregeknek Ura: Térjetek hozzám, szól a Seregeknek Ura, és hozzátok térek, mond a Seregeknek Ura.
౩కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
4 Ne legyetek olyanok, mint atyáitok, a kikhez az elébbi próféták kiáltottak, mondván: Ezt mondja a Seregeknek Ura: Térjetek meg kérlek a ti gonosz útaitokról, és a ti gonosz cselekedeteitekből, de nem hallgattak meg, és nem figyelmeztek reám, szól az Úr.
౪మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”
5 Atyáitok? Hol vannak ők? És a próféták örökké élnek-é?
౫“మీ పితరులు ఏమయ్యారు? ప్రవక్తలు కలకాలం జీవిస్తారా?
6 De az én beszédeim és végzéseim, a melyeket szolgáim, a próféták által hirdettem: nem beteljesedtek-é a ti atyáitokon? És megtértek és azt mondták: A mint elhatározta vala a Seregeknek Ura, hogy a mi útaink és cselekedeteink szerint bánik velünk: úgy bánt velünk.
౬అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”
7 A tizenegyedik hónapnak, azaz a Sebat hónapnak huszonnegyedik napján, Dáriusnak második esztendejében, szóla az Úr Zakariáshoz, a Berekiás fiához, a ki Iddó próféta fia, mondván:
౭దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది.
8 Látám éjszaka, hogy ímé, egy férfiú veres lovon ül vala, és áll vala a mirtus-fák között, a melyek egy árnyas völgyben valának; háta megett pedig veres, tarka és fehér lovak.
౮రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి.
9 És mondám: Mik ezek Uram? És mondá nékem az angyal, a ki beszél vala nékem: Én megmutatom néked: mik ezek.
౯అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు.
10 Akkor felele az a férfiú, a ki a mirtus-fák között áll vala, és mondá: Azok ezek, a kiket az Úr küldött, hogy járják be e földet;
౧౦అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు.
11 És felelének az Úr angyalának, a ki a mirtus-fák között áll vala, és mondák: Bejártuk a földet, és ímé, az egész föld vesztegel és nyugodt.
౧౧అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు.
12 Az Úr angyala pedig felele, és mondá: Seregeknek Ura! Meddig nem könyörülsz még Jeruzsálemen és Júdának városain, a melyekre haragszol immár hetven esztendő óta?
౧౨అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు.
13 És nyájas szavakkal, vígasztaló szókkal felele az Úr az angyalnak, a ki beszél vala velem.
౧౩నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు.
14 És mondá nékem az angyal, a ki beszél vala velem: Kiálts, ezt mondván: Ezt mondja a Seregeknek Ura: szeretem Jeruzsálemet és a Siont nagy szeretettel!
౧౪అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది.
15 De nagy haraggal haragszom én a hivalkodó népekre, a kikre kevéssé haragudtam ugyan, de ők gonoszra törtek.
౧౫ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు.
16 Azt mondja azért az Úr: könyörületességgel fordulok Jeruzsálemhez; benne építtetik meg az én házam, szól a Seregeknek Ura, és mérőzsinór nyujtatik ki Jeruzsálem felett.
౧౬కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు.
17 Mégis kiálts, mondván: Ezt mondja a Seregeknek Ura: Bővelkedni fognak még városaim a jóban, mert megvígasztalja még az Úr a Siont, és magáévá fogadja még Jeruzsálemet!
౧౭నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”
18 Majd felemelém szemeimet, és ímé, négy szarvat láték.
౧౮ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి.
19 És mondám az angyalnak, a ki beszél vala velem: Mik ezek? És monda nékem: Ezek azok a szarvak, a melyek szétszórták Júdát, Izráelt és Jeruzsálemet.
౧౯“ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.
20 Azután mutata nékem az Úr négy mesterembert.
౨౦అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు.
21 És mondám: Mit jöttek ezek cselekedni? Ő pedig szóla, mondván: Ezek azok a szarvak, a melyek szétszórták Júdát annyira, hogy senki sem emelheti vala fel fejét: de eljöttek ezek, hogy elrettentsék őket, hogy letörjék a pogányok szarvait, a kik szarvakkal támadtak vala Júda földe ellen, hogy szétszórják azt.
౨౧“వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.