< Zsoltárok 37 >
1 Dávidé. Ne bosszankodjál az elvetemültekre, ne irígykedjél a gonosztevőkre.
౧దావీదు కీర్తన చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.
2 Mert hirtelen levágattatnak, mint a fű, s mint a gyönge növény elfonnyadnak.
౨ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.
3 Bízzál az Úrban és jót cselekedjél; e földön lakozzál és hűséggel élj.
౩యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.
4 Gyönyörködjél az Úrban, és megadja néked szíved kéréseit.
౪తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
5 Hagyjad az Úrra a te útadat, és bízzál benne, majd ő teljesíti.
౫నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.
6 Felhozza a te igazságodat, mint a világosságot, és a te jogodat, miként a delet.
౬పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.
7 Csillapodjál le az Úrban és várjad őt; ne bosszankodjál arra, a kinek útja szerencsés, se arra, a ki álnok tanácsokat követ.
౭యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
8 Szünj meg a haragtól, hagyd el heveskedésedet; ne bosszankodjál, csak rosszra vinne!
౮కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.
9 Mert az elvetemültek kivágattatnak; de a kik az Urat várják, öröklik a földet.
౯దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
10 Egy kevés idő még és nincs gonosz; nézed a helyét és nincsen ott.
౧౦ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.
11 A szelidek pedig öröklik a földet, és gyönyörködnek nagy békességben.
౧౧నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.
12 Fondorkodik a gonosz az igaz ellen, és fogait csikorgatja rá:
౧౨దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు.
13 Az Úr neveti őt, mert látja, hogy eljő az ő napja.
౧౩వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు.
14 Fegyvert vonnak a gonoszok; felvonják ívöket, hogy a szegényt és nyomorultat elejtsék, és leöljék az igazán élőket;
౧౪అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.
15 De fegyverök saját szívökbe hat, és ívök eltörik.
౧౫వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి.
16 Jobb a kevés az igaznak, mint a sok gonosznak az ő gazdagsága.
౧౬దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది.
17 Mert a gonoszok karja eltörik, de az igazakat támogatja az Úr.
౧౭దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు.
18 Jól tudja az Úr a feddhetetleneknek napjait, és hogy örökségök mindörökké meglesz.
౧౮యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది.
19 Nem szégyenülnek meg a veszedelmes időben, és jóllaknak az éhség napjaiban.
౧౯రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది.
20 De a gonoszok elvesznek, és az Úrnak ellensége, mint a liget ékessége, elmúlik, füstként múlik el.
౨౦అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు.
21 Kölcsön kér a gonosz és meg nem fizet, de az igaz irgalmas és adakozó.
౨౧దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు.
22 Mert a kiket ő megáld, öröklik a földet, és a kiket ő megátkoz, kivágattatnak azok.
౨౨యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు.
23 Az Úr szilárdítja meg az igaz ember lépteit, és útját kedveli.
౨౩దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.
24 Ha elesik, nem terül el, mert az Úr támogatja kezével.
౨౪యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.
25 Gyermek voltam, meg is vénhedtem, de nem láttam, hogy elhagyottá lett volna az igaz, a magzatja pedig kenyérkéregetővé.
౨౫నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.
26 Mindennapon irgalmatoskodik és kölcsön ad, és az ő magzatja áldott.
౨౬అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.
27 Kerüld a rosszat és jót cselekedjél, és megmaradsz mindörökké.
౨౭చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు.
28 Mert az Úr szereti az ítéletet, és el nem hagyja az ő kegyeseit; megőrzi őket mindörökké, a gonoszok magvát pedig kiirtja.
౨౮ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.
29 Az igazak öröklik a földet, és mindvégig rajta lakoznak.
౨౯నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు.
30 Bölcseséget beszél az igaznak szája, és a nyelve ítéletet szól.
౩౦నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది.
31 Istenének törvénye van szívében, lépései nem ingadoznak.
౩౧అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు.
32 Leselkedik a gonosz az igazra, és halálra keresi azt;
౩౨దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు.
33 De az Úr nem hagyja azt annak kezében, sem nem kárhoztatja, mikor megítéltetik.
౩౩అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు.
34 Várjad az Urat, őrizd meg az ő útját; és fölmagasztal téged, hogy örököld a földet; és meglátod, a mikor kiirtatnak a gonoszok.
౩౪యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు.
35 Láttam elhatalmasodni a gonoszt és szétterjeszkedett az, mint egy gazdag lombozatú vadfa;
౩౫భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను.
36 De elmult és ímé nincsen! kerestem, de nem található.
౩౬అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు.
37 Ügyelj a feddhetetlenre, nézd a becsületest, mert a jövendő a béke emberéé.
౩౭చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
38 De a bűnösök mind elvesznek; a gonosznak vége pusztulás.
౩౮పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు.
39 Az igazak segedelme pedig az Úrtól van; ő az ő erősségök a háborúság idején.
౩౯నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు.
40 Megvédi őket az Úr és megszabadítja őket; megszabadítja őket a gonoszoktól és megsegíti őket, mert ő benne bíznak.
౪౦యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు.